iDreamPost
android-app
ios-app

Anant Ambani: అంబానీ ఇంట పెళ్లికి వెళ్లిన ఇద్దరు AP యువకులు అరెస్ట్‌.. కారణమిదే

  • Published Jul 15, 2024 | 8:44 AM Updated Updated Jul 15, 2024 | 8:44 AM

Anant Ambani Wedding-Two AP People Arrested: అనంత్‌ అంబానీ-రాధిక మర్చంట్‌ల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్లికి వెళ్లిన ఇద్దరు ఏపీ యువకులను అరెస్ట్‌ చేశారు. ఆ వివరాలు..

Anant Ambani Wedding-Two AP People Arrested: అనంత్‌ అంబానీ-రాధిక మర్చంట్‌ల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్లికి వెళ్లిన ఇద్దరు ఏపీ యువకులను అరెస్ట్‌ చేశారు. ఆ వివరాలు..

  • Published Jul 15, 2024 | 8:44 AMUpdated Jul 15, 2024 | 8:44 AM
Anant Ambani: అంబానీ ఇంట పెళ్లికి వెళ్లిన ఇద్దరు AP యువకులు అరెస్ట్‌.. కారణమిదే

రిలయన్స్‌ అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్‌ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ, రాధికల పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ నెల అనగా జూలై 12న, శుక్రవారం నాడు.. ముంబైలోని జియో కన్వెన్షన్‌ సెంటర్‌లో అంగరంగ వైభవంగా వీరిద్దరి పెళ్లి జరిగింది. ఈ పెళ్లికి మన దగ్గర నుంచి కోలీవుడ్‌, టాలీవుడ్‌, బాలీవుడ్‌ సెలబ్రిటీలతో పాటు.. రాజకీయ నాయకులు, క్రీడా రంగానికి చెందిన వారు కూడా హాజరయ్యారు. వీరితో పాటు హాలీవుడ్‌ తారాలోకం, సెలబ్రిటీలు అనంత్‌, రాధికల పెళ్లికి తరలి వచ్చారు.

ఇక ఈ పెళ్లి కోసం అంబానీ కుటుంబం 5 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఇక మీడియా, సోషల్‌ మీడియా ఎక్కడ చూసినా.. అనంత్‌ అంబానీ పెళ్లి ముచ్చట్లే కనిపిస్తున్నాయి. ఈ పెళ్లిలో అంబానీ కుటుంబం ధరించిన దుస్తులు.. వివాహం వేళ నూతన దంపతులు ధరించిన ఆభరణాలు, దుస్తులకు సంబంధించిన వివరాలు.. ఖరీదు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇదిలా ఉంటే.. అనంత్‌ అంబానీ పెళ్లికి వెళ్లిన ఇద్దరు ఆంధ్రప్రదేశ్‌ యువకులను అదుపులోకి తీసుకుని అరెస్ట్‌ చేశారు. ఎందుకు అంటే..

సెలబ్రిటీల ఇంట వివాహం అంటే ఆహ్వానం కచ్చితంగా ఉండాలి. అది లేకుండా వెళ్తే.. సెలబ్రిటీలైనా సరే లోపలికి అడుగు పెట్టలేరు. ఇక సదరు ఏపీ యువకులు ఆహ్వానం లేకుండా ఈ పెళ్లికి వెళ్లడంతో.. పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. వీరిని ఏపీకి చెందిన యూట్యూబర్‌ అల్లూరి వెంకటేష్, వ్యాపారవేత్తగా చెప్పుకునే షఫీ షేక్‌గా ముంబై పోలీసులు గుర్తించారు. వీరిపై వేర్వేరుగా కేసులు నమోదు చేసిన బాంద్రా కుర్లా కాంప్లెక్స్ పోలీసులు.. పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లారు. అనంతరం నోటీసులు ఇచ్చి పంపించి వేశారు. వివాహ వేడుకకు ఆహ్వానం లేదని విచారణలో చెప్పినట్లు పోలీసులు తెలిపారు. వీరిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ముంబై పోలీసులు ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.

ముంబైలోని జియో కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటుగా అనేక మంది వీవీఐపీలు, వీఐపీలు హాజరయ్యారు. అయితే ఇంతమంది ప్రముఖుల నడుమ అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ జరిగిన వేడుకలకు.. అనుమతి, ఆహ్వానం లేకుండా ఎవరూ రావడానికి అవకాశం లేదు. కాదని వెళ్తే.. ఇదిగో వీరిలా తిప్పలు తప్పవు. ఇక వివాహం సందర్భంగా అనంత్‌ అంబానీ.. తన పెళ్లికి వచ్చిన స్నేహితులకు 2 కోట్ల విలువైన గడియారాలు గిఫ్ట్‌గా ఇచ్చిన సంగతి తెలిసిందే.