iDreamPost
android-app
ios-app

భర్త వద్దు ప్రియుడే ముద్దు! చివరికి ట్విస్ట్ మాములుగా లేదు!

  • Published Jul 26, 2023 | 7:15 PM Updated Updated Jul 26, 2023 | 7:42 PM
  • Published Jul 26, 2023 | 7:15 PMUpdated Jul 26, 2023 | 7:42 PM
భర్త వద్దు ప్రియుడే ముద్దు! చివరికి ట్విస్ట్ మాములుగా లేదు!

వివాహ వ్యవస్థ ఎంతో పవిత్రమైంది. మూడు మూళ్లు, ఏడడుగుల బంధంతో ఒక్కటైన ఎన్నో జంటలు మధ్యలోనే విడాకులు తీసుకుంటున్నారు. దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఈ రోజుల్లో కొందరు భార్యాభర్తలు క్షణిక సుఖం కోసం కట్టుకున్న వాళ్లను కాదని పరాయి వాళ్ల మోజులో పడి పచ్చని కాపురాలను చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. ఇక వీరి సీక్రెట్ కాపురం బయటపడడంతో చివరికి హత్యలు చేయడం, లేదంటే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అచ్చం ఇలాంటి ఘటనే తాజాగా ఏపీలో చోటు చేసుకుంది.

పోలీసుల కథనం ప్రకారం.. ఏపీలోని అనకాపల్లి జిల్లాలోని తోటాడలో కొత్తలంక నూకప్పరావు-దీనమ్మ (26) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ముగ్గురు పిల్లల సంతానం. భర్త స్థానికంగా సీలింగ్ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలోనే దీనమ్మ భర్తకు తెలియకుండా మరొక యువకుడితో వివాహేతర సంబంధాన్ని కొనసాగించింది. ధీనమ్మ తన చీకటి కాపురం భర్త చెవిన పడకుండా సీక్రెట్ గా ప్రియుడితో సరసాలకు తెర లేపింది. అయితే, ఇదే విషయం ఇటీవల భర్తకు తెలిసింది. పద్దతి మార్చుకోవాలంటూ భార్యకు గట్టిగానే చెప్పి చూశాడు.

అయినా ధీనమ్మ ప్రవర్తన మార్చుకోకుండా ప్రియుడితో కోరికలు తీర్చుకుంటూ వచ్చింది. ఇలా కొన్ని రోజుల పాటు ఇదే విషయమై భార్యాభర్తలు గొడవ పడ్డారు. పెద్దలు కలగజేసుకుని ఇటీవల పంచాయితీ కూడా పెట్టించారు. ఇదిలా ఉంటే.. ఈ నెల 23న భార్యాభర్తలు మరోసారి గొడవ పడ్డారు. ఇక కోపంతో ఊగిపోయిన భర్త నూకప్పరావు.. భార్య ధీనమ్మ గొంతుకు చున్నీ బిగించి హత్య చేశాడు. అనంతరం భర్త నేరుగా స్టేషన్ కు వెళ్లి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఆ తర్వాత ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.

ఇది కూడా చదవండి: వీడిన సింధు హత్య మిస్టరీ! ఆమెను చంపింది ఎవరో కాదు..!

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom