iDreamPost
android-app
ios-app

మైనర్ అమ్మాయిపై యువకుడి అత్యాచార0.. అందుకు సహకరించిన తల్లి, చెల్లి

  • Published Apr 29, 2024 | 8:55 PM Updated Updated Apr 29, 2024 | 8:55 PM

పెళ్ళికి ఒప్పుకోలేదని అమ్మాయిని బలవంతంగా ఎత్తుకెళ్లాడు. గదిలో బంధించి ఆమెపై పలుమార్లు అత్యాచారం చేశాడు. దీనికి ఆ యువకుడి తల్లి, చెల్లి కూడా సహకరించారు.

పెళ్ళికి ఒప్పుకోలేదని అమ్మాయిని బలవంతంగా ఎత్తుకెళ్లాడు. గదిలో బంధించి ఆమెపై పలుమార్లు అత్యాచారం చేశాడు. దీనికి ఆ యువకుడి తల్లి, చెల్లి కూడా సహకరించారు.

  • Published Apr 29, 2024 | 8:55 PMUpdated Apr 29, 2024 | 8:55 PM
మైనర్ అమ్మాయిపై యువకుడి అత్యాచార0.. అందుకు సహకరించిన తల్లి, చెల్లి

అమ్మాయి మైనర్. అబ్బాయి మేజర్. ఇంతవరకూ బానే ఉంది. కానీ అమ్మాయి పెళ్ళికి ఒప్పుకోలేదని ఆమెపై అత్యాచారం చేశాడు. అక్కడితో ఆగకుండా తన పేరుని ఆ అమ్మాయి పేరు మీద చెక్కాడు. ప్రేమ ఎంతుందో తెలియడం కోసం కొందరు ప్రేమించిన వారి పేర్లను పచ్చబొట్లుగా, టాటూలుగా తమ శరీరాల మీద పొడిపించుకుంటారు. ఎవరికి వారు పొడిపించుకుంటే అది ప్రేమ. మరి బలవంతంగా పొడిస్తే అది ప్రేమ ఎట్టా అవుతుంది. మామూలుగా ఏ ప్రియుడైనా ప్రేమించిన అమ్మాయి పేరుని గుండెల మీదో.. చేతి మీదో పచ్చబొట్టు పొడిపించుకుంటారు. లేదా టాటూ వేయించుకుంటారు. కానీ ఈ పిచ్చోడు అమ్మాయి ముఖం మీద తన పేరు చెక్కుకున్నాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని లఖీమ్ పూర్ ఖేరీలో చోటు చేసుకుని.

ఓ మైనర్ యువతిని అమన్ అనే ఒక వ్యక్తి కొన్ని నెలలుగా పెళ్లి చేసుకోవాలంటూ వేధిస్తున్నాడు. ఆ వేధింపులు తట్టుకోలేక ఆ అమ్మాయి ఆ వ్యక్తిని దూరం పెట్టింది. దీంతో కోపంతో రగిలిపోయిన యువకుడు.. షాపు నుంచి తిరిగి వస్తుండగా అమ్మాయిని బలవంతంగా ఎత్తుకెళ్ళి తన ఇంటిలో బంధించాడు. మూడు రోజుల పాటు ఆమెపై అత్యాచారం జరిపాడు. దీనికి యువకుడి చెల్లి, తల్లి సహకరించారు. మూడు రోజుల పాటు చిత్రహింసలు పెట్టారు. తనను పెళ్లి చేసుకోవాలంటూ శాడిస్ట్ లా ప్రవర్తించాడు. ఆమె ముఖం మీద ఐరన్ రాడ్ తో అమన్ అని తన పేరు చెక్కాడు. అర్ధరాత్రి సమయంలో ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకుంది ఆ అమ్మాయి. పోలీస్ స్టేషన్ కి వెళ్లి అమన్ పై ఫిర్యాదు చేసింది. పోలీసులు ఐపీసీ సెక్షన్ 343, 323, 504, 376, పోక్సో చట్టాల కింద అమన్ ను అరెస్ట్ చేశారు. అనంతరం ఆ మైనర్ అమ్మాయి మీడియాతో జరిగిన సంఘటన గురించి వెల్లడించింది.

తాను షాప్ కి వస్తువులు కొనడానికి వెళ్లానని.. షాపు నుంచి తిరిగి వస్తున్న సమయంలో ఆ అబ్బాయి వచ్చి తనను తన ఇంటికి తీసుకెళ్లాడని తెలిపింది. అతను తనతో తప్పుగా ప్రవర్తించాడని చెప్పుకొచ్చింది. రాడ్ తో ముఖాన్ని కాల్చి.. అమన్ అని ముఖంపై పేరు రాశాడని ఆమె అన్నది. ఆ సమయంలో తనను అమన్ చెల్లి, తల్లి గట్టిగా పట్టుకున్నారని.. ఎంత అరిచినా ఎవరూ తనను కాపాడేందుకు ముందుకు రాలేదని ఆమె మీడియాతో వెల్లడించింది. స్థానికంగా ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. అమన్ ని కఠినంగా శిక్షించాలని అమ్మాయి కుటుంబ సభ్యులు, స్థానికులు, మహిళా సంఘాల వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ ఘటన యోగి ఆదిత్యనాథ్ వంటి పవర్ ఫుల్ సీఎం ఉన్న రాష్ట్రంలో జరగడంతో ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. యోగి పాలనలో అమ్మాయిల మీద దాడులు ఎక్కువయ్యాయంటూ ఆరోపణలు చేస్తున్నారు.        

Jojobet GirişjojobetjojobetJojobetJojobetjojobetJojobetjojobetJojobetcasibomfixbetjojobetsüpertotobetsüpertotobetcasibomcasibomcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet giriş