iDreamPost
android-app
ios-app

భర్తను చంపించి జైలుకెళ్లింది.. అక్కడ తన యాక్టింగ్ తో పోలీసులను బోల్తా కొట్టించింది..

  • Published Jun 18, 2024 | 7:52 PM Updated Updated Jun 18, 2024 | 7:52 PM

Adilabad Government Teacher Wife Mislead District Jail Officials: ఆదిలాబాద్ లో భర్తను హత్య చేయించిన కేసులో ఏ1 ముద్దాయిగా ఉన్న రాథోడ్ విజయలక్ష్మి మరో డ్రామా ఆడింది. జిల్లా జైలు అధికారులను కాసేపు కంగారు పెట్టేసింది.

Adilabad Government Teacher Wife Mislead District Jail Officials: ఆదిలాబాద్ లో భర్తను హత్య చేయించిన కేసులో ఏ1 ముద్దాయిగా ఉన్న రాథోడ్ విజయలక్ష్మి మరో డ్రామా ఆడింది. జిల్లా జైలు అధికారులను కాసేపు కంగారు పెట్టేసింది.

  • Published Jun 18, 2024 | 7:52 PMUpdated Jun 18, 2024 | 7:52 PM
భర్తను చంపించి జైలుకెళ్లింది.. అక్కడ తన యాక్టింగ్ తో పోలీసులను బోల్తా కొట్టించింది..

ఇటీవల భర్తను సుపారీ ఇచ్చి హత్య చేయించిన భార్య గుర్తుందా? ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈవిడ సంచలనంగా మారింది. ఆమె ప్రస్తుతం రిమాండు ఖైదీగా ఉంది. అయితే భర్తను హత్య చేయించడమే కాకుండా.. జైలులో పోలీసులను కూడా బోల్తా కొట్టించింది. ఆమె యాక్టింగ్ చూసి అక్కడున్న పోలీసులు కూడా అవాక్కయ్యారు. ఆమెలో ఇంత టాలెంట్ దాగుందా అని ముక్కున వేలేసుకున్నారు. కాసేపు జైలు అధికారులు అందరికి చెమటలు పట్టించేసింది. చివరకి ఆమెది డ్రామా అని తెలియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కానీ, భర్తనే చంపించిన ఆ మహాతల్లికి.. ఇదెంతలే అని ఊరుకున్నారు. అసలు ఏం జరిగిందో చూద్దాం.

ఈ హత్య కేసు ఆదిలాబాద్ జిల్లాలోనే కాకుండా.. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచనంగా మారింది. ఈ భార్య బంగారంలా చూసుకునే భర్తను సుపారీ ఇచ్చి మరీ హత్య చేయించింది. ప్రియుడికి తనకి మధ్యలో అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తనే కడతేర్చింది. ఈ కేసు నమోదు చేసుకున్న కేవలం 24 గంటల్లోనే పోలీసులు కేసును ఛేదించారు. ప్రియుడి కోసం భర్తను హత్య చేయించిది అని నిర్ధారణకు వచ్చారు. ఆమె ఫోన్ ని స్వాధీనం చేసుకున్న పోలీసులకు దిమ్మతిరిగే విషయాలు తెలిశాయి. ఆమె కాల్ డేటా, మెసేజులు, ఫోటోలు చూసిన తర్వాత అసలు విషయం తెలిసిందే. ఆమెను అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. ఆ జైలులో కూడా ఆమె తన టాలెంట్ చూపించింది. అక్కడున్న అధికారులను కంగారు పెట్టేసింది.

జైలులో హై డ్రామా:

భర్త హత్యకేసులో ఈ విజయలక్ష్మి ఏ2 ముద్దాయిగా ఉంది. ఆమె రిమాండు ఖైదీగా ఉన్న జైలులో తన ప్రాణం పోతోంది అంటూ కేకలు వేసింది. తాను ఆత్మహత్యకు యత్నించినట్లు చెప్పింది. అరెస్టు సమయంలో తాను బ్లేడు ముక్కులు మింగేశాను అని చెప్పింది. తన కడుపులో బాగా నొప్పిగా ఉంది అంటూ కేకలు వేసింది. ఆమె మాటలు విని పోలీసులు కూడా కంగారు పడిపోయారు. వెంటనే భారీ బందోబస్తుతో ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు ఆమె మాటలు విని.. ఆమెకు ఎండోస్కోపీ చేశారు. అయితే లోపల ఎలాంటి పదార్థాలు, బ్లేడు ముక్కలు వారికి కనిపించలేదు. అలాంటివి ఏవీ ఆమె పొట్టలో లేవు అని నిర్ధారించారు. అలాగే ఆమెను రెండు గంటల పాటు అబ్జర్వేషన్ లో ఉంచారు. ఆ తర్వాత ఆమె ఆరోగ్యంగానే ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ఆ మాటలు విన్న తర్వాత పోలీసులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.

విజయలక్ష్మి చేసింది అంతా డ్రామా అని తెలుసుకున్నారు. ఆమె యాక్టింగ్ చూసి నిజంగానే చనిపోతుంది ఏమో అని అంతా నమ్మేశారు. విజయలక్ష్మి యాక్టింగ్ చూసి.. భర్తనే చంపించింది ఇలాంటివి ఒక లెక్కా అని పోలీసులు ఆమెను తిరిగి జైలుకు తీసుకెళ్లారు. ప్రియుడి మోజులో పడి ఈ విజయలక్ష్మి తన భర్తను హత్య చేయించింది. అతను ఒక ప్రభుత్వ టీచర్. పైగా భార్యని ఎంతో ప్రేమగా చూసుకుంటాడు. వారికి పిల్లలు కూడా ఉన్నారు. ఒకే ఒక్క తప్పుడు నిర్ణయంతో తన జీవితాన్ని నాశనం చేసుకోవడమే కాకుండా.. తన పిల్లల జీవితాన్ని కూడా పాడు చేసింది. జైలులో హై డ్రామా సృష్టించిన ఈ విజయలక్ష్మిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet