iDreamPost
android-app
ios-app

నటిపై రచయిత ఫిర్యాదు.. అరెస్టు చేసిన పోలీసులు

ప్రజల నుండి అక్రమంగా డబ్బులు వసూలు చేసిందంటూ ప్రముఖ నటిపై సినిమా గీత రచయిత ఫిర్యాదు చేశాడు. అంతలో ఆమె కూడా తన పరువు తీస్తున్నాడంటూ అతడిపై పోలీసులకు కంప్లయింట్ చేసింది. కానీ..

ప్రజల నుండి అక్రమంగా డబ్బులు వసూలు చేసిందంటూ ప్రముఖ నటిపై సినిమా గీత రచయిత ఫిర్యాదు చేశాడు. అంతలో ఆమె కూడా తన పరువు తీస్తున్నాడంటూ అతడిపై పోలీసులకు కంప్లయింట్ చేసింది. కానీ..

నటిపై రచయిత ఫిర్యాదు.. అరెస్టు చేసిన పోలీసులు

కోలీవుడ్‌లో గీత రచయిత స్నేగన్ , ప్రముఖ నటి, బిజెపీ కార్య నిర్వాహకురాలు జయలక్ష్మి మధ్య వైరం పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేటట్లుగా మారింది. ఆమె తనను మోసం చేశారంటూ సదరు రచయిత.. తన పరువు తీశారంటూ జయలక్ష్మి ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు. అయితే జయలక్ష్మిని పోలీసులు అరెస్టు చేశారు. ఇంతకు ఏం జరిగిందంటే.. రచయిత స్నేగన్ సెనెగమ్ ఫౌండేషన్ అనే పేరుతో కొన్ని రోజులుగా ఓ సేవా సంస్థను నడుపుతున్నారు. అయితే ఇదే పేరుతో జయలక్ష్మి ప్రజల నుండి డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆయన దృష్టికి రావడంతో గత ఆగస్టులో ఆమెపై చెన్నై మెట్రోపాలిటన్ పోలీసు కమిషనరేట్‌లో ఫిర్యాదు చేశారు.

ఇదిలా ఉంటే.. తర్వాత జయలక్ష్మి సైతం రచయితపై ఫిర్యాదు చేసింది. స్నేగన్ తనపై తప్పడు ఆరోపలను చేస్తున్నారని, తన పరువు తీస్తున్నాడని పేర్కొంటూ కంప్లయింట్ చేసింది. ఇరువురిపై కేసులు నమోదయ్యాయి. కాగా, తనపై ఆమె తప్పుడు ఆరోపణలు చేశారంటూ.. ఆ కేసు కొట్టేయాలంటూ.. పిటిషన్ దాఖలు చేశాడు స్నేగన్. ఫిబ్రవరి 6న ఈ పిటిషన్ పై విచారణ జరిగింది. స్నేగన్ తరుఫు న్యాయవాది శ్రీధర్ వాదనలు చేపట్టారు. జయలక్ష్మి అతడి స్వచ్ఛంద సంస్థ సెనెగమ్ ఫౌండేషన్ పేరుని దుర్వినియోగపర్చిందని, అతడిని మోసం చేసింది కాకుండా.. స్నేగన్ పై తప్పుడు ఫిర్యాదు చేసిందని పేర్కొన్నాడు. దీంతో స్నేగన్ పై తిరుమంగళం పోలీస్ స్టేషన్ లో  నమోదైన కేసును రద్దు చేసింది కోర్టు.

కాగా, ఈ మనీలాండరింగ్ కేసులో చెన్నై అన్నానగర్‌లోని నటి జయలక్ష్మి ఇంట్లో సోదాలు చేపట్టారు పోలీసులు. కోర్టు అనుమతితో ఉదయం 9.30 నుండి సోదాలు నిర్వహించారు. 10 మందికి పైగా అధికారులు సోదాలు నిర్వహించారు. మూడు గంటల పాటు రైడ్స్ చేపట్టి. .ఆమె నివాసంలో కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం తిరుమంగళం పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. మోసం, డాక్యుమెంట్ల ఫోర్జరీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నటి, బీజెపీ నాయకురాలి అయ్యిండి.. ఇలా చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్  రూపంలో తెలియజేయండి.