iDreamPost
android-app
ios-app

గణేష్ మండపంలో యువకుడి దొంగతనం! సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాలు!

  • Published Sep 22, 2023 | 3:09 PM Updated Updated Sep 22, 2023 | 3:09 PM
  • Published Sep 22, 2023 | 3:09 PMUpdated Sep 22, 2023 | 3:09 PM
గణేష్ మండపంలో యువకుడి దొంగతనం! సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాలు!

ఈ ఏడాది వినాయక చవితి సందర్భంగా హైదరదబాద్ నగరంలోని గల్లీ గల్లీలో గణేష్ విగ్రహాలను ఏర్పాటు చేశారు. అయితే ఇప్పటికే కొన్ని విగ్రహాల నిమజ్జనం కూడా పూర్తైంది. కాగా, గతంలో వినాయక మండపాల్లో దొంగతనం జరిగిన విషయం తెలిసిందే. దానికి సంబంధించిన వీడియోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇకపోతే తాజాగా కూడా గణేష్ మండపంలో ఓ యువకుడు దొంగతనానికి పాల్పడ్డాడు. ఇదంతా అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఇదే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే?

మేడ్చల్ జిల్లాలో రాఘవేంద్రనగర్ కాలనీలో స్థానికులు ఓ చోట విగ్రహాన్నిప్రతిష్ఠించారు. గురువారం రాత్రి కాలనీ వాసులు అంతా గుడి వద్ద చేరి భజనలు కూడా చేశారు. ఇక అదే రాత్రి కాపలా కోసం కొందరు యువకులు అదే గుడిలో నిద్రపొయారు. ఈ క్రమంలోనే ఆ రోజు అర్థరాత్రి 1 గంటల ప్రాంతంలో ఈ వినాయక మండపంలో ఓ యువకుడు దొంగతనానికి పాల్పడ్డాడు. వాళ్లు నిద్రపోయింది చూసి వారి పక్కనే ఉన్న సెల్ ఫోన్ చోరీ చేయాలని భావించాడు. ఇందులో భాగంగానే ఆ దొంగ గుడిలోకి వెళ్లి నిద్రపోతున్న యువకుల సెల్ ఫోన్ తీసుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే ఆ యువకులు నిద్రలేవడంతో ఆ దొంగ వెంటనే అక్కడి నుంచి పరుగులు తీశాడు. ఇదంతా అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. దీంతో ఇదే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతోంది.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio