iDreamPost
android-app
ios-app

మద్యం మత్తులో రౌడీ అరాచకం.. మహిళా ఎస్సై అని చూడకుండా..!

చెన్నైలో ఓ రౌడీ రెచ్చిపోయి ప్రవర్తించాడు. విధుల్లో ఉన్న ఓ మహిళా ఎస్సైతో దారుణంగా ప్రవర్తించాడు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

చెన్నైలో ఓ రౌడీ రెచ్చిపోయి ప్రవర్తించాడు. విధుల్లో ఉన్న ఓ మహిళా ఎస్సైతో దారుణంగా ప్రవర్తించాడు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

మద్యం మత్తులో రౌడీ అరాచకం.. మహిళా ఎస్సై అని చూడకుండా..!

మద్యం మనిషిని ఎంతకైన తెగించేలా చేస్తుంది. కొందరు వ్యక్తులు మత్తులో ఊగిపోతూ క్షణికావేశంలో ఎంతటి దారుణాలకైన తెగబడుతుంటారు. ఇంతే కాకుండా రోడ్డుపై వెళ్తున్న అమ్మాయిలను, మహిళలను కూడా వదలకుండా కొందరు కేటుగాళ్లు వేధింపులకు పాల్పడుతుంటారు. ఇక రౌడీల విషయానికొస్తే ఇంకాస్త డేంజర్ అనే చెప్పాలి. అయితే, ఇటీవల ఓ రౌడీ మద్యం మత్తులో ఉండి అరాచకానికి పాల్పడ్డాడు. ఏకంగా ఓ మహిళ ఎస్సై అని కూడా దారుణానికి పాల్పడ్డాడు. నడి రోడ్డుపైనే ఆ రౌడీ ఇలా చేయడంతో అంతా షాక్ కు గురయ్యారు. ఆ తర్వాత మిగతా పోలీసులు అక్కడికి చేరుకుని అతడికి చుక్కలు చూపించారు. ఇటీవల చెన్నైలోని చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. మద్యం మత్తులో ఉన్న ఆ రౌడీ ఏం చేశాడు? అసలు ఈ ఘటనలో ఏం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. చెన్నై పెరంబూరు వెప్పేరు పోలీస్ స్టేషన్ లో గౌరి అనే మహిళ ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే గురువారం రాత్రి చులై కురువన్ ప్రాంతంలో ఆమె విధుల్లో భాగంగా గాస్తి కాస్తున్నారు. ఇదే ప్రాంతానికి చెందిన కిషోర్ అనే వీధి రౌడీ తన ఫ్రెండ్స్ ను వెంట పెట్టుకుని అదే రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇంతటితో ఆగకుండా అక్కడ కొంతమందితో గొడవకు దిగారు. దీంతో అతని స్నేహితులు కూడా రెచ్చిపోయి అరాచకం సృష్టించారు. ఇదంతా డ్యూటీలో ఉన్న మహిళా ఎస్సై గౌరి గమనించారు. వెంటనే అక్కడికి చేరుకుని ఏం జరిగిందని వారిని అడిగి తెలుసుకున్నారు.

ఆ తర్వాత వారిని సముదాయించి గొడవ సద్దుమణిగేందుకు ప్రయత్నాలు చేయబోయారు. అయితే, ఈ క్రమంలోనే ఆ రైడీ కిషోర్ ఇంకాస్త రెచ్చిపోయాడు. దీంతో ఆ మహిళా ఎస్సై వెంటనే ఫైర్ అయి ఆ రౌడీతో వాగ్వాదానికి దిగింది. రౌడీ కిషోర్ కాస్త హద్దులు దాటి ప్రవర్తించాడు. నేను ఇలానే చేస్తా.. నా ఇష్టం అంటూ పెద్ద పెద్దగా అరిచాడు. ఆ క్షణంలో అతని స్నేహితులతంతా మహిళా ఎస్సై అని కూడా చూడకుండా ఆమెపై వాగ్వాదానికి దిగారు. ఇదంతా గమనించిన మరికొందరు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వెంటనే ఆ రౌడీని పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం పోలీసులు మరసటి రోజు అతడిని విచారించినట్లుగా తెలుస్తుంది.

ఇకపోతే, ఇదంతా గమనించిన కొందరు స్థానికులు సెల్ ఫోన్ లో వీడియో తీసుకున్నారు. ఇక అదే వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. దీన్ని చూసిన కొందరు నెటిజన్స్ ఒక్కోరు ఒకలా స్పందిస్తున్నారు. ఇలాంటి వీధి రౌడీలను ఏరిపారేయాలని ఒకరు కామెంట్స్ చేస్తే.. ఈ రకమైన కేటుగాళ్లను కఠినంగా శిక్షించాలని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. నడి రోడ్డుపై విధుల్లో ఉన్న మహిళా ఎస్సైతో వాగ్వాదానికి దిగిన ఈ వీధి రౌడి దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట రూపంలో తెలియజేయండి.

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetBets10casibommarsbahis girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetPusulabetPusulabetMadridbetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabet