Keerthi
ప్రస్తుతం ఎక్కడ చూసిన విష జ్వరాలనేవి ప్రజలను హాడలెత్తిస్తున్నాయి. తాజాగా ఈ విష జ్వరానికి గురైన పదో తరగతి విద్యార్థిని పై పాఠశాలలోని ఉపాధ్యాయులు నిర్లక్ష్యం వహించడంతో పెద్ద ఘోరమే జరిగిపోయింది.
ప్రస్తుతం ఎక్కడ చూసిన విష జ్వరాలనేవి ప్రజలను హాడలెత్తిస్తున్నాయి. తాజాగా ఈ విష జ్వరానికి గురైన పదో తరగతి విద్యార్థిని పై పాఠశాలలోని ఉపాధ్యాయులు నిర్లక్ష్యం వహించడంతో పెద్ద ఘోరమే జరిగిపోయింది.
Keerthi
ప్రస్తుతం నగరంలోని వివిధ ప్రాంతాల్లో విష జ్వరాలు ప్రజలను వణికిస్తున్నాయి. ఎక్కడ చూసిన ఇంటికొకరు తీవ్రమైన జ్వరాల బారినపడి మంచం పడుతున్నారు. అయితే దీనికి కారణం నగరంలో పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారడంతో పాటు అధికారులు పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహించడమే ఈ వ్యాధులు ప్రబలుడుతున్నాయి.దీంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ విష జ్వరల బారినపడిన వారిలో చాలామందికి సరైన సమయంలో చికిత్స అందించకపోవడంతో మరణిస్తున్నారు. కాగా, గతేడాది ఈ విష జ్వరంతో ఓ విద్యార్థి మరిణించిన ఘటన మరువక ముందే అదే పాఠశాలలో తాజాగా ఇప్పుడు మరో పదో తరగతి విద్యార్థిని విషజ్వరంతో మృతి చెందింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..
అదిలాబాద్ రూరల్ మండలంలో తీవ్ర విష జ్వరంతో బాధపడుతున్న ఓ పదవ తరగతి విద్యార్థి మృతి చెందడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మామిగూడ ఆశ్రమం పాఠశాలలో చదువుతున్న మహేశ్వరి అనే పదవ తరగతి విద్యార్థి గత కొన్ని రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్న పాఠశాలలో ఎవరు పట్టించుకోలేదు.ఈ విషయం తెలుసుకున్న విద్యార్థిని తండ్రి మంగళవారం మధ్యాహ్నం అదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి చికిత్స కోసం తీసుకెళ్లారు. కానీ పరిస్థితి విషమించడంతో మహేశ్వరి బుధవారం తెల్లవారుజామున ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.
అయితే విద్యార్థిని మహేశ్వరి తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్న పాఠశాలలో ఎవరు పట్టించుకోకపోవడంతో ఆమె మృతి చెందినట్లు ఆదివాసి సంఘూల నాయకులు ఆరోపిస్తున్నారు. కాగా, మహేశ్వరి మృతికి కారణమైన ఉపాధ్యాయులు, అధికారులు పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదివాసి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తూ ఆదిలాబాద రిమ్స్ ఎదుట రహదారి పై ర్యాలీ చేపట్టారు. ఇది ర్యాలీ అనేది ఉదయం ఏడు గంట నుంచి కోనసాగుతోంది. అయితే, విద్యార్థిని మృతికి కారణమైన అధికారులతో పాటు, ఉపాధ్యాయులు, వార్డెన్ లను సస్పెండ్ చేయాలని ఆదివాసి నాయకులు డిమాండ్ చేశారు.
కాగా, ఆదివాసుల బిడ్డలను ఈ విష జ్వరాలు మింగేస్తున్న అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. పైగా అలాంటి వారిపై ఐటిడిఎపిఓ, డిడి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే పాఠశాలలో కనీసం ఏఎన్ఏం ను నియమించకపోవడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనమని మండిపడ్డారు. ఇక విద్యార్థి కుటుంబానికి రూ. 50 లక్షలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని,అలా లేని పక్షంలో ఆందోళనకు దిగుతమని ఆదివాసి నాయకులు హెచ్చరించారు.మరి, ఇంకొన్ని రోజుల్లో పదో తరగతి పరీక్షలకు హాజరవ్వలసిన విద్యార్థిని ఇలా విష జ్వరం బలి తీసుకోనే ఘటన పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.