iDreamPost
android-app
ios-app

Medchal: మేడ్చల్ లో దారుణం! 90 ఏళ్ల వృద్ధారాలిపై అత్యాచారానికి పాల్పడ్డ కామాంధులు..

  • Published Sep 20, 2024 | 5:42 PM Updated Updated Sep 20, 2024 | 5:42 PM

Medchal: అత్యాచారాల కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. తాజాగా మేడ్చల్‌లో ఓ దారుణమైన ఘటన చోటు చేసుకుంది. 90 ఏళ్ల వృద్ధురాలిపై ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు.

Medchal: అత్యాచారాల కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. తాజాగా మేడ్చల్‌లో ఓ దారుణమైన ఘటన చోటు చేసుకుంది. 90 ఏళ్ల వృద్ధురాలిపై ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు.

  • Published Sep 20, 2024 | 5:42 PMUpdated Sep 20, 2024 | 5:42 PM
Medchal: మేడ్చల్ లో దారుణం! 90 ఏళ్ల వృద్ధారాలిపై అత్యాచారానికి పాల్పడ్డ కామాంధులు..

దేశంలో అత్యాచారాలకి సంబంధించిన కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఆడవాళ్ళపై అత్యాచారాలు ఆగట్లేదు. కామాంధులు కుప్పలు కుప్పలుగా పెరిగిపోతున్నారు. చిన్న పిల్లల నుంచి పండు ముసలి వాళ్ళ దాకా ఎవ్వరినీ వదిలిపెట్టట్లేదు. చాలా దారుణంగా అఘాయిత్యాలు చేస్తున్నారు. తాజాగా మేడ్చల్‌లో ఓ దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఏకంగా 90 ఏళ్ల వృద్ధురాలిపై ముగ్గురు యువకులు నీచంగా అత్యాచారానికి పాల్పడ్డారు. మేడ్చల్ మండలం బండమాదారంలోని పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఓ వృద్ధురాలిపై ఏకంగా ముగ్గురు కామాంధులైన యువకులు సామూహిక అత్యాచారం చేశారు. వివరాల్లోకి వెళితే..

బండమాదారంలో క్వార్టర్స్ లో ఆ వృద్ధ మహిళా నివాసం ఉంటున్నారు. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆమె ఒంటరిగా ఉండటం చూసి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు ఆ కామాంధులు. వారిలో ఒకడిని పట్టుకొని గ్రామస్తులు దేహశుద్ధి చేశారు. బండమాదారం గ్రామానికి చెందిన వెంకట్ రావు(36) అనే వ్యక్తి మరో ఇద్దరి యువకులతో కలిసి అదే గ్రామానికి చెందిన లక్ష్మీ అనే ఈ వృద్ధురాలుపై అత్యాచారానికి పాల్పడ్డారు. పరీక్షల నిమిత్తం 108 సిబ్బంది ఆ వృద్ధురాలిని ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కి తరలించారు. సంఘటన స్థలానికి చేరుకొని ఈ దారుణ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అలాగే స్థానికులను కూడా విచారిస్తున్నారు. వెంకట్ రావుని అదుపులోకి తీసుకున్న పోలీసులు మరో ఇద్దరి నిందితుల కోసం కూడా గాలిస్తున్నారు. మరి 90 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారానికి పాల్పడ్డ ఈ ఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetartemisbetartemisbetbetsmovebetsmovexslotxslotjojobetcratosroyalbetbetparkwgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabet