iDreamPost
android-app
ios-app

మామను దారుణంగా కొట్టిన కోడలు! సమాజం సిగ్గుపడే ఘటన!

  • Published Mar 12, 2024 | 2:25 PM Updated Updated Mar 12, 2024 | 2:27 PM

కొడుకును పెళ్లి చేస్తూనే.. తమ బాధ్యత తీరిపోయిందని అనుకోరు అతడి తల్లిదండ్రులు. మనవళ్లు, మనవరాళ్లతో ఆడుకోవాలని సంబరపడిపోతుంటారు. అందుకే వయస్సు ఉడికిపోయాక.. కొడుకు ఇంట్లో ఉంటారు. కానీ కోడలు తమ ప్రైవసీకి అడ్డు అని భావిస్తూ ఉంటుంది.

కొడుకును పెళ్లి చేస్తూనే.. తమ బాధ్యత తీరిపోయిందని అనుకోరు అతడి తల్లిదండ్రులు. మనవళ్లు, మనవరాళ్లతో ఆడుకోవాలని సంబరపడిపోతుంటారు. అందుకే వయస్సు ఉడికిపోయాక.. కొడుకు ఇంట్లో ఉంటారు. కానీ కోడలు తమ ప్రైవసీకి అడ్డు అని భావిస్తూ ఉంటుంది.

  • Published Mar 12, 2024 | 2:25 PMUpdated Mar 12, 2024 | 2:27 PM
మామను దారుణంగా కొట్టిన కోడలు! సమాజం సిగ్గుపడే ఘటన!

తల్లిదండ్రుల తర్వాత అత్తమామలే.. కోడలికి అమ్మ, నాన్న. కానీ పుట్టింటి నుండి అత్తారింట్లోకి అడుగుపెట్టిన కొంత మంది కోడళ్లు.. ఇంట్లో పెద్దల నుండి పిల్లల వరకు తన మాటే వినాలని, తనదే పై చేయిగా ఉండాలన్న యోచన చేస్తున్నారు. తన ఇష్ట ప్రకారమే అత్తా, మామలు నడుచుకోవాలని, తాను ముద్ద వేసినప్పుడే తినాలన్న నిబంధనలు రాస్తున్నారు. కొడుకు ఉన్నప్పుడు ఒకలా, ఉద్యోగానికి వెళ్లినప్పుడు పెద్దల్ని మరోలా ట్రీట్ చేస్తున్నారు. బయటకు చెబితే తమ పరువే పోతుందన్న ఉద్దేశంతో గొంతులో బాధను దిగమింగుకుంటున్నారు.  కోడలిపై ఏవైనా చాడీలు చెబితే.. అతడు బయటకు వెళ్లాక తిండి పెట్టకుండా వారిని మాడ్చడమే కాదూ.. ప్రశ్నిస్తే.. వారిపై దాడి చేయడానికి కూడా వెనకాడటం లేదు. కోడళ్లు కాదూ కొరివి దెయ్యాలని నిరూపిస్తున్నారు.

తాజాగా ఓ కోడలు చిన్న తప్పు చేశాడన్న కారణంతో  అత్యంత దారుణంగా కొట్టింది.  సమాజం సిగ్గుపడే ఈ ఘటన కర్ణాటకలోని మంగళూరులో చోటుచేసుకుంది.  వివరాల్లోకి వెళితే.. మంగళూరుకు చెందిన పద్మనాభ సువర్ణ అనే వ్యక్తి కొడుకు, కూతురు ఉన్నారు. కొడుకు దుబాయ్‌లో ఉద్యోగం చేస్తుండగా.. కోడలు ఉమా శంకరి ఎలక్ట్రిసిటీ బోర్డులో ఉద్యోగి. దీంతో ఆ ఇంటికి పెద్ద దిక్కుగా కోడలి వద్ద ఉంటున్నాడు పద్మనాభ సువర్ణ. మార్చి 9న సోఫాపై షర్ట్ పెట్టాడన్న కోపంతో ఊగిపోయిన కోడలు.. వాకింగ్ స్టిక్ తీసుకుని.. 87 ఏళ్ల వృద్దుడు అని చూడకుండా.. మామను చితకబాదింది. దుర్బాషలాడుతూ అనంతరం బలంగా నెట్టేయండంతో సోఫాకు తల తగిలి గాయమైంది. దీంతో భయపడ్డ పద్మనాభ.. మర్నామికట్టెలోని సోదరుడి ఇంటికి వెళ్లిపోయాడు.

అక్కడ నుండి కుమార్తె ప్రియకు సమాచారం అందించాడు. ముఖం, మోకాలికి తీవ్ర గాయాలైన అతడిని ఆసుపత్రికి తరలించారు. కోడలు.. మామపై దాడి చేసిన ఘటన సీసీటీవీలో రికార్డు అయ్యింది. వీటి ఆధారంగా పద్మనాభ కుమార్తె ప్రియ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. ప్రియ ఇచ్చిన ఫిర్యాదుతో కోడలు ఉమా శంకరిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆమెను అదుపులోకి తీసుకున్నారు. మరింత దర్యాప్తు చేపడుతున్నారు పోలీసులు. ఇటీవల కాలంలో అత్తా, మామలపై కోడళ్లు దాడి చేస్తున్న ఘటనలు పెరిగిపోయాయి. గతంలో మామ ఓ గదిలో ఉండగా.. నిప్పంటించిందో కోడలు. అలాగే అత్తలను చితకబాదుతున్న ఇంటి ఇల్లాలి వీడియోలు బయటకు వచ్చాయి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetartemisbetartemisbetbetsmovebetsmovexslotxslotjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom