iDreamPost
android-app
ios-app

ముచ్చుమర్రి బాలిక కేసు: వీళ్ళు మామూలు ముదుర్లు కాదు.. పోలీసులనే మిస్ గైడ్!

Muchumarri Girl Case Accused Are So Clever: 3వ తరగతి చదువుతున్న ఓ బాలిక ఆదివారం ఇంట్లోంచి ఆడుకోవడానికని వెళ్ళింది. అత్యాచారం చేసి చంపేశామని 7వ తరగతి బాలురు వెల్లడించారు. చంపేసి కృష్ణానదిలో పడేశామని చెప్పారు. కానీ ఇప్పుడు పూడ్చిపెట్టామని చెబుతున్నారు. చూస్తుంటే పోలీసులని మిస్ గైడ్ చేస్తున్నారేమో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

Muchumarri Girl Case Accused Are So Clever: 3వ తరగతి చదువుతున్న ఓ బాలిక ఆదివారం ఇంట్లోంచి ఆడుకోవడానికని వెళ్ళింది. అత్యాచారం చేసి చంపేశామని 7వ తరగతి బాలురు వెల్లడించారు. చంపేసి కృష్ణానదిలో పడేశామని చెప్పారు. కానీ ఇప్పుడు పూడ్చిపెట్టామని చెబుతున్నారు. చూస్తుంటే పోలీసులని మిస్ గైడ్ చేస్తున్నారేమో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

ముచ్చుమర్రి బాలిక కేసు: వీళ్ళు మామూలు ముదుర్లు కాదు.. పోలీసులనే మిస్ గైడ్!

ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లా పగిడ్యాల మండలంలో ఎల్లాల గ్రామానికి చెందిన 8 ఏళ్ల బాలిక ఈ నెల 7న ఫ్రెండ్స్ తో కలిసి ముచ్చుమర్రి పార్క్ కి వెళ్ళింది. అయితే 7వ తరగతి చదువుతున్న ముగ్గురు బాలురు బాలిక ఒంటరిగా ఉండడం చూసి ఆమెను ఎత్తుకెళ్ళి కాలువ వద్ద అత్యాచారం చేశారు. అనంతరం గొంతు నులిమి చంపేశారు. ఆ తర్వాత కృష్ణానదిలో పడేశారు. ఇదే తొలుత పోలీసుల విచారణలో చెప్పింది. వీళ్ళు చెప్పింది నిజం అనుకుని పోలీసులు ఐదు రోజుల నుండి నదిలో బాలిక మృతదేహం గురించి గాలిస్తున్నారు. గజ ఈతగాళ్లని రంగంలోకి దించి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఎంత వెతికినా కూడా దొరక్కపోవడంతో మరోసారి పోలీసులు తమదైన స్టైల్లో విచారించారు.

ఈసారి నదిలో పడేయలేదని చెప్పారు ఆ బాలురు. మరి ఏం చేశారురా అంటే.. పూడ్చిపెట్టామని కొన్ని లొకేషన్స్ ని చూపించారు. ముచ్చుమర్రి, పగిడ్యాల, కొణిదెల ప్రాంతాల్లో ఉన్న లొకేషన్స్ లో పోలీసులని తిప్పించారు కానీ ఎక్కడా కూడా బాలిక మృతదేహం కనిపించలేదు. సమీపంలోని చెట్ల దగ్గర ఏమైనా పూడ్చి పెట్టి ఉంటారేమో అని జేసీబీతో చెట్లను తొలగించి చూశారు. చుట్టూ మొత్తం గాలించారు. ముచ్చుమర్రి, పగిడ్యాల, కొణిదెల గ్రామాల్లో బాలురు చెప్పిన లొకేషన్స్ లో వెతికారు. కానీ బాలిక మృతదేహం లభించలేదు. దీంతో అసలు వీళ్ళు నిజమే చెప్తున్నారా? లేక పోలీసులను తప్పు దోవ పట్టిస్తున్నారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మొదట నదిలో పడేశామని చెప్పి పోలీసులని మిస్ గైడ్ చేశారనుకోవాలా? లేక బాలురు అదృష్టం కొద్దీ నదిలో బాలిక మృతదేహం దొరకలేదు కాబట్టి పోలీసులని తప్పుదోవ పట్టించడానికి పూడ్చిపెట్టామని చెప్పారా? అన్న సందేహాలు తలెత్తుకున్నాయి. అసలు నిజమే చెప్తున్నారో లేదో అన్న అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. చదివింది 7వ తరగతి అయినా వాళ్లకి ఇన్ని తెలివితేటలు ఉంటాయా? క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు చూస్తే ఎవరికైనా వస్తాయి.. సినిమాలు బాగా చూస్తారు కాబోలు.. అందుకే ఇలా పోలీసులను మిస్ గైడ్ చేస్తున్నారన్న అనుమానాలు వస్తున్నాయి. సాధారణంగా పెద్ద వయసున్న కేసుల్లో అయితే కేసుని సాల్వ్ చేయడానికి ఎక్కువ రోజులు పడుతుంది. ఎందుకంటే పెద్ద వయసున్న క్రిమినల్స్ ని హ్యాండిల్ చేయడం కష్టం కాబట్టి.

అయినప్పటికీ పోలీసులు తమదైన స్టైల్లో విచారణ చేపట్టి కేసుని త్వరగా సాల్వ్ చేస్తారు. కానీ ఈ 7వ తరగతి చదువుకునే పిల్లల విషయంలో మాత్రం 5 రోజులు అయినా బాలిక మృతదేహం ఏమైందన్న విషయం తెలియడం లేదు. అసలు బాలికను నిజంగానే చంపారా? చంపకుండా చంపామని చెబుతున్నారా? బాలురు ఇంకా ఏదైనా దాస్తున్నారా? వీరి వెనుక వేరే వ్యక్తి ఎవరైనా ఉన్నారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా ఈ విషయంలో ముగ్గురు బాలురు క్రైమ్ థ్రిల్లర్ సినిమాల్లో నిందితులు పోలీసులని మిస్ గైడ్ చేసినట్టు చేస్తున్నారేమో అన్న సందేహాలు బలపడుతున్నాయి. మరి ఈ విషయంలో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి