iDreamPost
android-app
ios-app

బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా నగదు పట్టివేత

  • Published Oct 10, 2023 | 7:03 PM Updated Updated Oct 10, 2023 | 7:03 PM
  • Published Oct 10, 2023 | 7:03 PMUpdated Oct 10, 2023 | 7:03 PM
బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా నగదు పట్టివేత

బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా నగదు పట్టుబడింది. కియా వాహనంలో తరలిస్తున్న మూడు కోట్ల 35 లక్షల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు, బంజారా హిల్స్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో ఈ లెక్కకు రాని డబ్బు పట్టుబడింది. ఆ వివరాల్లోకి వెళితే.. చింపి రెడ్డి హనుమంత రెడ్డి, బచ్చల ప్రభాకర్, మండల శ్రీరాములు రెడ్డి, మందల ఉదయ్ కుమార్ రెడ్డి లు కియా కారులో బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 3 మీదుగా వెళుతూ ఉన్నారు.

వీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు, బంజారా హిల్స్ పోలీసులు తనిఖీల కోసం ఆపారు. కారులో తనిఖీ చేయగా.. మూడు కోట్ల 35 లక్షల రూపాయల నగదు దొరికింది. డబ్బుతో పాటు, కారును కూడా అధికారులు సీజ్‌ చేశారు. నిందితుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇక, స్వాధీనం చేసుకున్న నగదును కోర్టులో అప్పగిస్తామని డీసీపీ జోయల్ డేవిస్ తెలిపారు. మరి, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో.. కియా కారులో ఏకంగా మూడు కోట్ల 35 లక్షల రూపాయల నగదు దొరకటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetHoliganbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobetjojobetgrandpashabet