iDreamPost
android-app
ios-app

ఒంటరి మహిళపై దారుణం.. నలుగురు ముసుగులు ధరించి!

  • Published Dec 26, 2023 | 4:50 PM Updated Updated Dec 26, 2023 | 4:50 PM

నిత్యం సమాజంలో ప్రతిరోజు ప్రతిక్షణం ఏదో ఒక చోట అనేక దారుణలు జరుగుతునే ఉన్నాయి. వరుసగా ఘోరమైన హత్యలు చోటుచేసుకోవడంతో ప్రజలు భయందోళనకు గురవుతున్నారు. తాజాగా బంధువుల అంత్యక్రియలకు వెళ్లిన ఓ యువతిని అత్యంత దారుణంగా నరికి చంపారు.

నిత్యం సమాజంలో ప్రతిరోజు ప్రతిక్షణం ఏదో ఒక చోట అనేక దారుణలు జరుగుతునే ఉన్నాయి. వరుసగా ఘోరమైన హత్యలు చోటుచేసుకోవడంతో ప్రజలు భయందోళనకు గురవుతున్నారు. తాజాగా బంధువుల అంత్యక్రియలకు వెళ్లిన ఓ యువతిని అత్యంత దారుణంగా నరికి చంపారు.

  • Published Dec 26, 2023 | 4:50 PMUpdated Dec 26, 2023 | 4:50 PM
ఒంటరి మహిళపై దారుణం.. నలుగురు ముసుగులు ధరించి!

ప్రతిఒక్కరికి మరణం అనేది సహజం. దానికి చిన్న, పెద్ద అనే బేధం కూడా ఉండదు. అసలు మృత్యువు ఎప్పుడు ఎటునుంచి ఎలా కబాలిస్తోందో ఎవ్వరికి తెలియని రోజులు ఇవి. ఇలాంటి సమయంలో వరుస హత్యలు అనేవి దేశాన్ని హడలెత్తిస్తున్నాయి. రోజు రోజుకి మానవత్వం అనేది అంతరించి పోతోంది. ఒక వ్యక్తిని మరో వ్యక్తి అత్యంత క్రూరాతి క్రూరంగా హత్య చేయడం కూడా ఫ్యాషన్ గా మారిపోయింది. ఇటువంటి క్రూరమైన ఆలోచనలతో కూడిన వ్యక్తుల మధ్య బ్రతుకుతున్న పరిస్థితి ఏర్పాడింది. కాగా, ఇటీవల కాలంలో పరువు, ప్రేమ, ఆస్తి, అక్రమ సంబంధాలు వంటి కారణాలతో వరుస హత్యలు జరుగుతునే ఉన్నాయి. తాజాగా చైన్నై లో ఓ యువతిని 4గురు కిరాతకులు అత్యంత దారుణంగా నరికి చంపారు. ఆ వివరాళ్లోకి వెళ్తే..

చెన్నైలోని అంబత్తూర్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ యువతిని నలుగురు వ్యక్తులు ముసుగులు ధరించి అత్యంత దారుణంగా నరికి చంపిన ఘటన తీవ్ర కలకలం రేపింది. చెన్నైలోని విల్లివాకంకు చెందిన సతీష్ అతని భార్య నందిని(27) స్థానికంగా నివాసం ఉంటున్నారు. అయితే గత కొంతకాలంగా సతీష్ బాలాజీ అనే వ్యకిని హత్య చేసిన కేసులో జైల్లో ఉన్నాడు. అయితే భర్త జైల్లో ఉండటంతో నందిని ఒంటరిగా ఉంటుంది. కాగా, ఇంతలోనే నందినికి సంబంధించిన దగ్గర బంధువులో ఒకరు మరణించారు. ఈ క్రమంలోనే వారి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు నిన్న సాయంత్రం అంబత్తూరు పారిశ్రామికవాడ పక్కనే ఉన్న ఐసీఎఫ్ కాలనీకి వెళ్లింది.

బంధువుల ఇంటికి వెళ్తున్న నందినిని మార్గ మధ్యంలో 4గురు వ్యక్తులు మాస్కులు ధరించి చుట్టుముట్టారు. అనంతరం ఒక్కసారిగా ఆమె పై దాడి చేసారు. కాగా, తీవ్రంగా గాయపడిన నందిని గట్టిగా కేకలు వేస్తు రక్తపుమడుగులో అక్కడికక్కడే మృతి చెందింది. అత్యంత దారుణంగా నరికి చంపిన ఆ నాలుగురు కిరాతకులు ఆ తర్వాత ఘటన స్థలం నుంచి పారిపోయారు.

అయితే ఈ ఘటన పై సమాచారం అందుకున్న అంబత్తూరు పారిశ్రామికవాడ పోలీసులు హత్యకు గురైన నందిని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్టాన్లీ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం కేసును నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, బాలాజీని నరికి చంపిన కేసులో నందిని భర్త సతీష్ అరెస్టయి పుజల్ జైలులో ఉన్నాడు. ఇక బాలాజీ హత్యకు ప్రతీకారం తీర్చుకునేందుకు అతడి సహచరులే సతీష్ భార్య నందిని తల నరికి చంపారా? లేక మరేదైనా కారణమా? అనేది ఇంక తెలియలేదు. మరి, ఆ యువతిని అతి దారుణంగా చంపిన ఘటన పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

gamdomCasibomJojobet Girişmarsbahis girişJojobet GirişMarsbahisHoliganbetJojobet