Venkateswarlu
Venkateswarlu
వచ్చే నవంబర్ నెలలో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి వారం రోజుల క్రితమే నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. పోలీసులు వాహన తనిఖీలు ముమ్మరం చేశారు. దీంతో పెద్ద సంఖ్యలో బంగారం, నగదు పట్టుబడుతోంది. సరైన పత్రాలు లేని వాటిని పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. తాజాగా, హైదరాబాద్‌లోని మియాపూర్‌లో భారీగా నగదు పట్టుబడింది. సోమవారం మియాపూర్ ఎక్స్ రోడ్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా..
ఓ వాహనంలో భారీగా బంగారం, వెండి వస్తువులు ఉండటం పోలీసులు గుర్తించారు. వాటికి సంబంధించిన సరైన పత్రాలు చూపకపోవటంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ తనిఖీల్లో ఏకంగా 27.540 కిలీల బంగారం, 15.650 కిలోల వెండి చిక్కింది. వాటిని పోలీసులు సీజ్ చేశారు. ఆ వస్తువుల్ని తరలిస్తున్న ముగ్గురు వ్యక్తుల్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. కాగా, నల్గొండ జిల్లాలో ఆదివారం భారీగా నగదు పట్టుబడింది. కారులో తరలిస్తున్న 3 కోట్ల రూపాయల అక్రమ డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ నేపథ్యంలోనే సినిమా స్టైల్ సన్ని వేశం చోటుచేసుకుంది. ఈదులుగూడ సిగ్నల్ దగ్గర ఏర్పాటు చేసిన చెక్ పోస్టు వద్ద ఓ కారు ఆగకుండా దూసుకుపోయింది. దీంతో పోలీసులు సినిమా స్టైల్లో తమ వాహనంతో కారును ఛేజ్ చేశారు. వాడపల్లి దగ్గర ఆ కారును అడ్డగించారు. కారులో చెకింగ్ చేయగా మూడు కోట్లు దొరికాయి. మరి, త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా భారీ నగదు పట్టుబడటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.