iDreamPost
android-app
ios-app

యువకుడి ప్రాణాలు తీసిన తిండి పోటీ.. ఒక్కసారే 150 తినే సరికి..

లా ఏదో ఒక తిండి పోటీ పెట్టుకుంటూ ఉంటారు. అయితే, ఒక్కోసారి అతిగా తినటం అన్నది ప్రాణాలు తీసే అవకాశం కూడా ఉంది.

లా ఏదో ఒక తిండి పోటీ పెట్టుకుంటూ ఉంటారు. అయితే, ఒక్కోసారి అతిగా తినటం అన్నది ప్రాణాలు తీసే అవకాశం కూడా ఉంది.

యువకుడి ప్రాణాలు తీసిన తిండి పోటీ.. ఒక్కసారే 150 తినే సరికి..

ఫ్రెండ్స్‌తో కలిసి తిండి పోటీలు పెట్టుకోవటం సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. పానీ పూరీనో.. ఫుల్‌ బిర్యానీనో.. ఇలా ఏదో ఒక తిండి పోటీ పెట్టుకుంటూ ఉంటారు. అయితే, ఒక్కోసారి అతిగా తినటం అన్నది ప్రాణాలు తీసే అవకాశం కూడా ఉంది. ఇందుకు బిహార్‌లో చోటు చేసుకున్న తాజా సంఘటనే ప్రత్యక్ష ఉదాహరణ. ఓ యువకుడు తన మిత్రులతో కలిసి మోమోలు తినే పోటీ పెట్టుకున్నాడు. అతి కష్టం మీద 150 మోమోలు తిన్నాడు. ఆ తర్వాత అనారోగ్యం పాలై చనిపోయాడు. ఈ సంఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బిహార్‌ చంపారన్‌ జిల్లా, సిహోర్వా గ్రామానికి చెందిన 25 ఏళ్ల విపిన్‌ కుమార్‌ సెల్‌ఫోన్‌ రిపేర్‌ దుకాణం నిర్వహిస్తున్నాడు.

తాజాగా, అతడు తన స్నేహితులతో ఓ పందెం కాశాడు. ఎక్కువ మోమోలు తింటానని వారితో చెప్పాడు. తిండిపోటీలో ఏ మాత్రం వెనక్కు తగ్గకుండా ఏకంగా 150 మోమోలు తిన్నాడు. దీంతో అతడి పొట్ట బాగా ఉబ్బిపోయింది. ఆ తర్వాత అతడు అక్కడినుంచి వెళ్లిపోయాడు. రోడ్డుపై వెళుతూ ఉండగా.. తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. రోడ్డు పక్కన పడిపోయి ప్రాణాలు విడిచాడు. అతడి శవాన్ని చూసిన వాహనదారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం పంపించారు.

అనుమానాస్పద మృతి కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. విచారణలో అతడి పేరు, ఇతర వివరాలు తెలిశాయి. స్నేహితులతో అతడు మోమోలు తినే పందెం కాసిన సంగతి కూడా వెలుగుచూసింది. అయితే, విపిన్‌ను అతడి స్నేహితులే చంపేశారని అతడి తండ్రి ఆరోపిస్తున్నాడు. తినే మోమోల్లో విషం పెట్టి చంపేశారని అంటున్నాడు. పోలీసులు పోస్టు మార్టం రిపోర్టు కోసం వేచి చూస్తున్నారు. మరి, మోమోలు తిని ప్రాణాలు పోగొట్టుకున్న విపిన్‌ ఉదంతంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.