iDreamPost
android-app
ios-app

పట్ట పగలు ఎంతకు తెగించారు.. సెకన్లలో 14 లక్షలు..

ఈ సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. కొద్దిరోజుల క్రితం కర్ణాటక రాజధాని బెంగళూరులోని ఓ చోట బీఎండబ్ల్యూ ఎస్‌యూవీ కారు ఆగి ఉంది.

ఈ సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. కొద్దిరోజుల క్రితం కర్ణాటక రాజధాని బెంగళూరులోని ఓ చోట బీఎండబ్ల్యూ ఎస్‌యూవీ కారు ఆగి ఉంది.

పట్ట పగలు ఎంతకు తెగించారు.. సెకన్లలో 14 లక్షలు..

ఈ మధ్య కాలంలో దొంగతనాలు బాగా పెరిగిపోతున్నాయి. దొంగలు బాగా తెలివి మీరిపోయారు. చాకచక్యంగా దొంగతనం చేసి తప్పించుకుంటున్నారు. ముఖ్యంగా కార్లలో ఉండే ఖరీదైన వస్తువుల్ని, డబ్బుల్ని కొట్టేసే దొంగల నైపుణ్యం చూస్తే.. వ్వావ్‌ అనిపిస్తుంది. ఎంతో నేర్పుతో కారు అద్దాలు పగులగొట్టి మరీ దొంగతనాలు చేస్తున్నారు. తాజాగా, బెంగళూరులో ఓ కోటి రూపాయల కారులో ఉన్న దాదాపు 14 లక్షల రూపాయల్ని దొంగలు ఎత్తుకెళ్లారు. సెకన్లలో దొంగతనం ముగించి పరారయ్యారు.

ఈ సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. కొద్దిరోజుల క్రితం కర్ణాటక రాజధాని బెంగళూరులోని ఓ చోట బీఎండబ్ల్యూ ఎస్‌యూవీ కారు ఆగి ఉంది. ఆ కారు ఆగిన ప్రదేశానికి రోడ్డు చాలా దగ్గర ఉంది. అక్కడ జనం కూడా ఉన్నారు. అయినప్పటికి దొంగలు బరి తెగించారు. బైకుపై ఆ కారు దగ్గరకు వచ్చారు. ఆ కారులో డబ్బులు ఉన్నాయని వాళ్లకు ఎలా తెలిసిందో తెలీదు కానీ.. ఓ వ్యక్తి కారు దగ్గర నిలబడ్డాడు. మరో వ్యక్తి బైకును రన్నింగ్‌ ఉంచాడు. కారు అద్దం దగ్గర ఉన్న వ్యక్తి కేవలం ఓ చిన్న కిక్‌తో కారు అద్దాని పగుల కొట్టాడు.

తర్వాత కారులోకి దూకి.. అందులో ఉన్న ఓ సూట్‌ కేసును బయటకు తీసుకువచ్చాడు. తర్వాత బైకుపై ఎక్కి వెళ్లిపోయాడు. ఆ సూట్‌ కేసులో దాదాపు 14 లక్షల రూపాయలు ఉన్నాట్లు తెలుస్తోంది. బాధితుడు ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు  దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. అందులో కారు దొంగతనం ఏ విధంగా జరిగిందో ఉంది. మరి, ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetBets10casibomgrandpashabetmarsbahis girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetPusulabetPusulabetMadridbetgrandpashabet girişgrandpashabetjojobetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabet