iDreamPost
android-app
ios-app

ఈ భారతీయ అమ్మాయి ఆచూకీ చెప్పిన వారికి రూ. 8 లక్షల నజరానా

ఇటీవల కాలంలో ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళుతున్న యువతీ యువకుల సంఖ్య పెరిగిపోయింది. అక్కడకు వెళ్లాక పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకుంటూనే.. హయ్యర్ స్టడీస్ చేస్తున్నారు స్టూడెంట్స్. కానీ ఊహించిన సంఘటనలు..

ఇటీవల కాలంలో ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళుతున్న యువతీ యువకుల సంఖ్య పెరిగిపోయింది. అక్కడకు వెళ్లాక పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకుంటూనే.. హయ్యర్ స్టడీస్ చేస్తున్నారు స్టూడెంట్స్. కానీ ఊహించిన సంఘటనలు..

ఈ భారతీయ అమ్మాయి ఆచూకీ చెప్పిన వారికి రూ. 8 లక్షల నజరానా

ఉన్నత చదువుల కోసం విదేశాలకు పయనమవుతున్నారు విద్యార్థులు. పిల్లలు హయ్యర్ స్టడీస్ కోసం అబ్రాడ్ వెళ్తామంటే తల్లిదండ్రులు కూడా కాదనడం లేదు. పైగా ఇల్లు, పొలాలు, ఆస్తులు తాకట్టు పెట్టి పంపిస్తున్నారు. వారి భవిష్యత్ కోసం పేరేంట్స్ ఎన్నో త్యాగాలు చేస్తున్నారు. కానీ అక్కడికి వెళ్లాక.. పరిస్థితి మరోలా మారుతోంది. భారతీయ విద్యార్థులపై దాడులు జరుగుతున్నాయి. ఇతర ప్రమాదాల కారణంగా మృత్యువాత పడుతున్నారు. దీంతో విదేశీ విద్య అంటే కాస్త ఆందోళన నెలకొంటోంది. ఇప్పుడు ఓ భారతీయ మహిళ కోసం పోలీసులు వెతుకుతున్నారు. ఉన్నత చదువుల కోసమని ఇండియా నుండి న్యూజెర్సీ వెళ్లిన ఓ మహిళ.. నాలుగేళ్ల క్రితం నుండి కనిపించకుండా పోయింది.

1994లో ఇండియాలో పుట్టిన మయూషి భగత్ అనే మహిళ.. 2016లో స్టూడెంట్ వీసాపై అమెరికా వెళ్లింది. అక్కడ న్యూయార్క్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదువుతుంది. 2019 మే 1 నుండి ఆమె అదృశ్యమైంది. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. 29 ఏళ్ల యువతి ఆచూకీ కోసం ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు విచారణ చేపడుతున్నారు. గత ఏడాది జులైలో తప్పిపోయిన/ కిడ్నాప్ అయిన వ్యక్తుల జాబితాలో మయూషి పేరును చేర్చింది ఎఫ్‌బీఐ. చివరి సారిగా 2019, ఏప్రిల్ 29న సాయంత్రం జెర్సీ సిటీలోని తన అపార్ట్ మెంట్ నుండి బయటకు వచ్చినట్లు గుర్తించారు పోలీసులు. రంగురంగుల పైజామా ఫ్యాంట్, బ్లాక్ టీ షర్ట్ ధరించినట్లు పేర్కొన్నారు. ఆమె జాడ కోసం ప్రజల నుండి సాయాన్ని కోరుతోంది ఎఫ్‌బీఐ.

ఆమె ఆచూకీ తెలియజేసిన వారికి 10 వేల డాలర్ల (ఇండియన్ కరెన్సీలో సుమారు రూ. 8 లక్షలు) రివార్డును కూడా ప్రకటించింది. ఆమె ఆచూకీ గురించి సమాచారం తెలిస్తే ఎఫ్‌బీఐ నెవార్క్ లేదా జెర్సీ సిటీ పోలీస్ డిపార్ట్ మెంట్‌కు కాల్ చేయాలని పేర్కొంది. ఆమెకు సంబంధించిన ఆనవాళ్లను ప్రకటించింది. మయూషి నల్లటి జుట్టు, గోధుమ వర్ణం కళ్లను కలిగి ఉంటుంది. ఆమె హైట్ 5’10గా పేర్కొంది. ఎఫ్‌బీఐ చేసిన ప్రకటన ప్రకారం.. ఆమె ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ మాట్లాడగలదు. అలాగే న్యూజెర్సీలోని సౌత్ ప్లెయిన్ ఫీల్డ్ లో ఆమెకు స్నేహితులు ఉన్నారని డిటెక్టివ్ లు చెప్పారని తన ప్రకటనలో పేర్కొంది. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఓ భారతీయ మహిళ తప్పిపోయి నాలుగు సంవత్సరాలు అవుతున్నా.. ఇంకా గుర్తించలేదంటే.. ఏమై ఉండొచ్చని భావిస్తున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.