Zomato: కస్టమర్లకు భారీ షాక్ ఇచ్చిన జొమాటో.. ఆ ఛార్జీలు 25 శాతం పెంపు.. ఇక మోత మోగాల్సిందే

ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ సంస్థ జొమాట్లో కస్టమర్లకు భారీ షాక్‌ ఇచ్చింది. ఆ ఛార్జీలను సుమారు 25 శాతం వరకు పెంచింది. ఆ వివరాలు..

ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ సంస్థ జొమాట్లో కస్టమర్లకు భారీ షాక్‌ ఇచ్చింది. ఆ ఛార్జీలను సుమారు 25 శాతం వరకు పెంచింది. ఆ వివరాలు..

ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ యాప్‌లు అందుబాటులోకి వచ్చాక.. ఇంట్లో వంట చేసుకునే వారి సంఖ్య తగ్గుతోంది. సరదాగా కొన్నిసార్లు.. పని వల్ల బిజీగా ఉండి.. వంట చేసుకోవడానికి సమయం లేకపోయినా.. భారీగా ఆకలైనా.. వెంటనే ఫుడ్‌ డెలివరీ యాప్‌ ఓపెన్‌ చేసి.. మనసుకు నచ్చిన ఫుడ్‌ను ఆర్డర్‌ పెట్టుకుని.. లాగించేస్తున్నారు. ఫుడ్‌ డెలివరీ సంస్థలు వచ్చిన ప్రారంభంలో భారీగా ఆఫర్లు ఇస్తూ.. కస్టమర్లను ఆకట్టుకున్నాయి. ఫ్రీ డెలివరీ, డిస్కౌంట్‌ ఆఫర్ల పేరుతో కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేశాయి. ఆ తర్వాత.. నుంచి ఆఫర్లు ఎత్తేయడమే కాక అనేక ఛార్జీలు వసూలు చేయడం ప్రారంభించాయి. ఈ క్రమంలో తాజాగా ఫుడ్‌ డెలివరీ సంస్థ జొమాటో కస్టమర్లకు భారీగా షాక్‌ ఇచ్చింది. ఆ ఛార్జీలను 25 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు..

గత కొంత కాలంగా ఫుడ్ డెలివరీ సంస్థలకు డిమాండ్‌ భారీగా పెరుగుతోంది. మెట్రో నగరాల్లో అయితే వాటి క్రేజ్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక రోజు రోజుకు ఆన్‌లైన్‌లో ఫుడ్‌ ఆర్డర్‌ చేసే వారి సంఖ్య పెరుగుతుండటంతో.. ఫుడ్ డెలివరీ చేసే యాప్‌లు సర్వీసు ఛార్జీలను భారీగా పెంచుతున్నాయి. ఇప్పటికే డెలివరీ ఛార్జీలు, జీఎస్టీ వంటివి బాదుతూ కస్టమర్ల జేబుకు చిల్లు పెడుతున్నాయి. ఇక కొన్ని రోజుల క్రితమే ప్లాట్‌ఫాం ఫీజును ప్రవేశపెట్టాయి. దీంతో ఫుడ్ డెలివరీ మరింత భారంగా మారింది. ఇప్పటికే ప్లాట్‌ఫామ్‌ చార్జీలను విధిస్తున్న జొమాటో.. దాన్ని మరింత పెంచేందుకు రెడీ అయ్యింది.

ఇప్పుడు మరోసారి జొమాటో ఫుడ్ డెలివరీ ఆర్డర్లకు సంబంధించి కఠిన నిర్ణయం తీసుకుంది. కస్టమర్లపై అదనపు భారం వేసింది. ఏప్రిల్ 20 నుంచే.. ఒక ఆర్డర్‌పై ప్లాట్‌ఫాం ఫీజు రూ. 5 వసూలు చేయనున్నట్లు వెల్లడించింది. ఇది అంతకుముందు రేటుతో పోలిస్తే 25 శాతం అదనం కావడం గమనార్హం. దేశ రాజధాని ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, ముంబై, లక్నో వంటి ప్రధాన నగరాల్లో ఈ ప్లాట్‌ఫాం ఫీజు పెంచినట్లు జొమాటో వెల్లడించింది.

అంతకుముందు ఈ ఏడాది జనవరి 1న కూడా ఈ కంపెనీ ప్లాట్‌ఫాం ఫీజును రూ. 3 నుంచి 4 కు పెంచిన సంగతి తెలిసిందే. బెంగళూరు ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న మరో ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ ఎప్పటి నుంచో.. ఫుడ్ డెలివరీ ఆర్డర్లపై రూ. 5 చొప్పున ప్లాట్‌ఫాం ఫీజు వసూలు చేస్తోంది. ఇప్పుడు జొమాటో కూడా ఇదే దారిలో పయనించేందుకు రెడీ అయ్యింది.

ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ యాప్స్‌.. తమ ఆర్డర్ల మీద డెలివరీ ఛార్జీలతో పాటుగా ప్లాట్‌ఫాం ఫీజు వసూలు చేస్తున్నాయి. తొలిసారిగా జొమాటో.. 2023 ఆగస్టులో ప్లాట్‌ఫాం ఫీజు వసూలు చేయడం ప్రారంభించింది. అప్పుడు ఆర్డర్‌పై రూ. 2 గా ఉండేది. కొన్ని నెలల తర్వాత అక్టోబర్‌లో దీనిని రూ. 3 కు పెంచింది. జనవరిలో రూ. 4 కు పెంచగా.. ఇప్పుడు మరో సారి 25 శాతం పెంచి అనగా.. ఒక్క రూపాయి పెంచి ఐదుకు చేర్చింది. ఇక జొమాటోకు చెందిన క్విక్ కామర్స్ ప్లాట్‌ఫాం బ్లింకిట్.. ఆర్డర్‌పై రూ. 2 ప్లాట్‌ఫాం ఫీజు వసూలు చేస్తోంది.

Show comments