iDreamPost
android-app
ios-app

Zomato Cash On Delivery: జొమాటోలో క్యాష్ ఆన్ డెలివరీ ఫీచర్! ఇక కస్టమర్స్ కష్టాలు తీరినట్టే!

  • Published Aug 08, 2024 | 10:14 PM Updated Updated Aug 08, 2024 | 10:14 PM

Zomato Good News To Customers: జొమాటో కంపెనీ తమ కస్టమర్స్ కి గుడ్ న్యూస్ చెప్పింది. సరికొత్త ఫీచర్ ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫీచర్ తో ఇక నుంచి అతి పెద్ద సమస్య తీరిపోనుంది.

Zomato Good News To Customers: జొమాటో కంపెనీ తమ కస్టమర్స్ కి గుడ్ న్యూస్ చెప్పింది. సరికొత్త ఫీచర్ ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫీచర్ తో ఇక నుంచి అతి పెద్ద సమస్య తీరిపోనుంది.

  • Published Aug 08, 2024 | 10:14 PMUpdated Aug 08, 2024 | 10:14 PM
Zomato Cash On Delivery: జొమాటోలో క్యాష్ ఆన్ డెలివరీ ఫీచర్! ఇక కస్టమర్స్ కష్టాలు తీరినట్టే!

జొమాటో ఫుడ్ డెలివరీ సంస్థ కస్టమర్స్ కి పలు ఆఫర్లతో గుడ్ న్యూస్ చెప్తుంటుంది. తాజాగా మరోసారి జొమాటో తమ కస్టమర్స్ కి గుడ్ న్యూస్ చెప్పింది. జొమాటోలో సరికొత్త ఫీచర్ ని తీసుకొచ్చినట్లు కంపెనీ వెల్లడించింది. చాలా మంది దగ్గర అకౌంట్లలో డబ్బులు ఉండవు. ఇంట్లో క్యాష్ ఉంటాయి. అలాంటివారు ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేయాలంటే ‘క్యాష్ ఆన్ డెలివరీ’ ఆప్షన్ ఉండేది కాదు. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లాంటి వాటికి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది. దీంతో కస్టమర్లు తమకు కావాల్సిన వస్తువులను ముందు ఆర్డర్ పెట్టుకుని ఆ తర్వాత అమౌంట్ సిద్ధం చేసుకునేవారు. అయితే జొమాటోలో అలాంటి సదుపాయం లేక ఇన్నాళ్లు చాలా మంది కస్టమర్లు ఫుడ్ ఆర్డర్ చేసుకోలేకపోయారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని జొమాటో కంపెనీ ఈ సమస్యకు పరిష్కారం తీసుకొచ్చింది.

ఈ మేరకు జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ పెట్టారు. జొమాటో తాజాగా క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ని తీసుకొచ్చినట్లు వెల్లడించారు. క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్స్ కోసం కరెక్ట్ చిల్లర దొరకడం కొన్నిసార్లు ఇబ్బందిగా ఉంటుందని అన్నారు. అయితే ఈరోజు నుంచి జొమాటో కస్టమర్లు డెలివరీ పార్టనర్స్ కి క్యాష్ చెల్లించవచ్చునని అన్నారు. చిల్లర ఇవ్వాల్సి వచ్చినప్పుడు బ్యాలన్స్ డబ్బులు జొమాటో మనీ అకౌంట్ లో జమ అవుతాయని అన్నారు. ఈ బ్యాలన్స్ అమౌంట్ తో భవిష్యత్తులో వేరే ఫుడ్ ఆర్డర్స్ కి వినియోగించుకోవచ్చునని అన్నారు. ఈ సమస్యకు పరిష్కారం కనుగొనేలా ఇన్స్పైర్ చేసిన బిగ్ బాస్కెట్ కి జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ కృతజ్ఞతలు తెలియజేశారు.

అంటే మీరు ఇక నుంచి మీ దగ్గర చేతిలో క్యాష్ ఉండి.. బ్యాంకు ఖాతాలో డబ్బులు లేకుంటే కూడా క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ని ఎంచుకుని ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఉదాహరణకు మీరు ఫుడ్ ఆర్డర్ పెట్టిన దానికి బిల్ 530 రూపాయలు అయ్యిందనుకుందాం. మీరు క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ని ఎంచుకున్నారు. డెలివరీ పార్టనర్ మీకు ఫుడ్ ఆర్డర్ డెలివర్ చేశారు. మీరు చేతికి 600 రూపాయలు ఇచ్చారు. మిగతా 70 రూపాయలు మీ జొమాటో మనీ వాలెట్ లో జమ అవుతాయి. ఆ మనీతో మీరు ఎప్పుడైనా వేరే ఆర్డర్స్ పెట్టుకోవచ్చు. ఇలా మీరు చిల్లర సమస్య లేకుండా సులువుగా ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు.