iDreamPost
android-app
ios-app

Zomato: ఆ ఉద్యోగులకు జొమాటో బంపరాఫర్.. వారి కోసం కొత్త ఫీచర్.. ఆర్డర్ మీది.. బిల్లు వాళ్లది

  • Published Aug 31, 2024 | 4:31 PM Updated Updated Aug 31, 2024 | 4:31 PM

Zomato-Corporate Orders: దిగ్గజ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో కొందరు ఉద్యోగుల కోసం ప్రత్యేక ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది. ఆ వివరాలు..

Zomato-Corporate Orders: దిగ్గజ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో కొందరు ఉద్యోగుల కోసం ప్రత్యేక ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది. ఆ వివరాలు..

  • Published Aug 31, 2024 | 4:31 PMUpdated Aug 31, 2024 | 4:31 PM
Zomato: ఆ ఉద్యోగులకు జొమాటో బంపరాఫర్.. వారి కోసం కొత్త ఫీచర్.. ఆర్డర్ మీది.. బిల్లు వాళ్లది

నేటి కాలంలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీ వ్యాపారం ఎంత బాగా విస్తరించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెల్లవారు జాము మొదలు.. అర్థరాత్రి వరకు ఫుడ్ డెలివరీ ఆప్షన్ అందుబాటులో ఉంది. దాంతో ఎప్పుడు ఏం తినాలనిపిస్తే.. ఆ ఫుడ్ ని ఆర్డర్ పెట్టుకుని లాగించేస్తున్నారు జనాలు. ఇక కస్టమర్ల కోసం జొమాట్లో రకారకాల ఆఫర్లు, ఫీచర్లు అందుబాటులోకి తెస్తోన్న సంగతి తెలిసిందే.  ఈక్రమంలో తాజాగా కొందరు ఉద్యోగుల కోసం స్పెషల్ ఫీచర్ తీసుకొచ్చింది. దీని ద్వారా ఉద్యోగులు ఆర్డర్ చేసుకుంటే.. బిల్లు కట్టేది వేరే వాళ్లు అని తెలిపింది. ఆ వివరాలు..

జొమాటో నిత్యం వేలు, లక్షల్లో ఆర్డర్స్ డెలివరీ చేస్తోంది. ఈ క్రమంలోనే కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా.. వారిని ఆకట్టుకునేందుకు రకరకాల ప్రయోగాలు చేస్తోంది. దీనిలో భాగంగా సరికొత్త తరహా సేవలకు శ్రీకారం చుట్టింది. కార్పొరేట్ ఉద్యోగులు చేసే ఆర్డర్స్ కోసం.. జొమాటో ఫర్ ఎంటర్‌ప్రైజెస్ పేరుతో కొత్త సేవలు తీసుకొచ్చింది. ఈ కొత్త సదుపాయం.. కంపెనీ ఆహార వ్యయ నిర్వహణను సులభతరం చేస్తుందని పేర్కొన్నారు జొమాటో సంస్థ ఎండీ గోయల్ చెప్పుకొచ్చారు.

జొమాటోకు వచ్చే ఆర్డర్స్ లో  ఎక్కువ సంఖ్యలో కార్పొరేట్ ఉద్యోగులు చేసే బిజినెస్ సంబంధిత ఆర్డర్సే అధికంగా  ఉంటున్నాయని తెలిపిన గోయల్.. ఈ ఆర్డర్ల విషయంలో ముందుగా ఆహారం ఖర్చును ఉద్యోగులు చెల్లించాల్సి వచ్చేంది. ఆ తర్వాత ఆ మొత్తాన్ని కంపెనీలు రీయింబర్స్ చేస్తుంటాయని చెప్పారు. దీని వల్ల కొంత గందరగోళం, పేమెంట్ చేయడంలో ఆలస్యం జరుగుతుందని చెప్పుకొచ్చారు గోయల్.

ఇలాంటి సమస్యల పరిష్కారం కోసం.. జొమాటో ఫర్ ఎంటర్‌ప్రైజెస్ ఫీచర్ ని అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే 100 టాప్ కంపెనీలు ఈ సేవల్ని వినియోగించుకుంటున్నాయని.. ఆయా సంస్థలు ఇచ్చిన ఫీడ్ బ్యాక్‌ ఆధారంగానే ఈ కొత్త సేవల్సకు మొదలు పెట్టినట్లు గోయల్ చెప్పుకొచ్చారు. జొమాటో ఫర్ ఎంటర్‌ప్రైజెస్ ద్వారా ఉద్యోగులు వారు చేసే ఆర్డర్స్‌కు ఎలాంటి మొత్తం చెల్లించాల్సిన అవసరం లేదు. సంస్థనే నేరుగా చెల్లిస్తుందని గోయల్ చెప్పుకొచ్చారు. దీనిపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.