Vinay Kola
Zelio LOGIX Cargo: జెలియో ఇ-బైక్స్ అప్డేటెడ్ కార్గో ఈవీ స్కూటర్ లాజిక్స్ కార్గో (Zelio LOGIX Cargo) స్కూటర్ పూర్తిగా మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్‌గా డిజైన్ చేయబడింది. ఈ స్కూటర్ ఫీచర్లు, దీని మైలేజ్ ఇంకా దీనికి సంబంధించిన పూర్తి వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Zelio LOGIX Cargo: జెలియో ఇ-బైక్స్ అప్డేటెడ్ కార్గో ఈవీ స్కూటర్ లాజిక్స్ కార్గో (Zelio LOGIX Cargo) స్కూటర్ పూర్తిగా మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్‌గా డిజైన్ చేయబడింది. ఈ స్కూటర్ ఫీచర్లు, దీని మైలేజ్ ఇంకా దీనికి సంబంధించిన పూర్తి వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Vinay Kola
దేశీయ ఎలక్ట్రిక్ టూ వీలర్ కంపెనీ జెలియో ఇ-బైక్స్ అప్డేటెడ్ కార్గో ఈవీ స్కూటర్ లాజిక్స్ కార్గోని (Zelio LOGIX Cargo) మార్కెట్‌లో ప్రవేశపెడుతోంది. ఈ స్కూటర్ పూర్తిగా మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్‌గా డిజైన్ చేయబడింది. దీన్ని కార్గో సర్వీసులు, ఇతర వ్యాపార రవాణా కోసం తయారు చేశారు. కంపెనీ దీన్ని పవర్ ఫుల్ గా ఇంకా యూజర్ ఫ్రెండ్లీ స్కూటర్‌గా తీసుకువచ్చింది. ఈ స్కూటర్ చిన్న వ్యాపారులకు, గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక ఈ స్కూటర్ ఫీచర్లు, దీని మైలేజ్ ఇంకా దీనికి సంబంధించిన పూర్తి వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈ కార్గో ఈవీ స్కూటర్ ఢిఫరెంట్ డిజైన్ తో చాలా స్టైలిష్ గా ఉంటుంది. ఇది ఆకట్టుకునే పనితీరుని కలిగి ఉంటుంది. దాంతో పాటు మీరు రోడ్లపై మంచి డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్‌ని కూడా పొందవచ్చని కంపెనీ స్పష్టం చేసింది. ఈ కొత్త కార్గో స్కూటర్ డెలివరీ బాయ్స్ లేదా ఇంకెవరైనా చిన్న వ్యాపారాలకు చాలా సులభంగా ఉంటుందని జెలియో ఇ-బైక్స్ సహ వ్యవస్థాపకుడు కునాల్ ఆర్య తెలిపారు. దీనిపై భారీ లోడ్లని కూడా వేసుకొని చాలా ఈజీగా వెళ్ళవచ్చు. ముఖ్యంగా నగరాల్లో దీన్ని నడపడం చాలా సులభం. నగరాల్లో ఈ స్కూటర్ పెర్ఫార్మన్స్ చాలా బాగుంటుందని తెలుస్తుంది. డెలివరీ బాయ్స్ కి చాలా అనుకూలంగా సౌకర్యంగా వెళ్లేందుకు ఈ స్కూటర్ చాలా బాగా ఉపయోగపడుతుంది.
ఈ స్కూటర్ స్పీడ్ విషయానికి వస్తే.. ఇది గంటకు 25 కిలోమీటర్ల మాక్సిమం వేగంతో మాత్రమే ప్రయాణిస్తుంది. ఇది చాలా పవర్ ఫుల్ స్కూటర్. ఎందుకంటే ఈ దీనిపై దాదాపు 150 కిలోల బరువును సులభంగా తీసుకెళ్లవచ్చు. రోజువారీ పనులు కోసం ఈ స్కూటర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ స్కూటర్ ని ఫుల్ గా ఛార్జ్ చేస్తే.. ఏకంగా 90 కిలోమీటర్ల దాకా ప్రయాణించవచ్చు. ఈ స్కూటర్ ని మనం కంపెనీకి చెందిన డీలర్‌షిప్స్, షోరూమ్లలో కొనుగోలు చేయవచ్చు. దీన్ని తక్కువ ఈఎంఐలో కూడా మనం కొనుగోలు చేయవచ్చు. ఇక దీని ధర 60 వేల లోపు ఉండబోతున్నట్లు తెలుస్తుంది. మరి ఈ జెలియో లాజిక్స్ కార్గో ఈ స్కూటర్ పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.