iDreamPost
android-app
ios-app

తక్కువ ధరకే 120 కి.మీ రేంజ్ కావాలా? అయితే ZELIO ఈ-స్కూటర్లపై ఓ లుక్కేయండి.

  • Published Aug 29, 2024 | 1:36 PM Updated Updated Aug 29, 2024 | 1:36 PM

ZELIO Eeva Series: జెలియో కంపెనీ తక్కువ ధరలో అదిరిపోయే స్కూటర్లని ప్రవేశపెట్టింది. Eeva సిరీస్‌లో Eeva, Eeva ZX మోడల్‌లని తక్కువ ధర, ఎక్కువ రేంజ్ తో విడుదల చేసింది కంపెనీ. వీటి ధరలు రూ. 54 వేల (ఎక్స్-షోరూమ్) నుంచి స్టార్ట్ అవుతాయి.

ZELIO Eeva Series: జెలియో కంపెనీ తక్కువ ధరలో అదిరిపోయే స్కూటర్లని ప్రవేశపెట్టింది. Eeva సిరీస్‌లో Eeva, Eeva ZX మోడల్‌లని తక్కువ ధర, ఎక్కువ రేంజ్ తో విడుదల చేసింది కంపెనీ. వీటి ధరలు రూ. 54 వేల (ఎక్స్-షోరూమ్) నుంచి స్టార్ట్ అవుతాయి.

తక్కువ ధరకే 120 కి.మీ రేంజ్ కావాలా? అయితే  ZELIO ఈ-స్కూటర్లపై ఓ లుక్కేయండి.

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు రాను రాను ఆదరణ పెరిగిపోతుంది. చాలా చోట్ల ఎలక్ట్రిక్ స్కూటర్లు కొనుగోలు చేసే వారి సంఖ్య వేగంగా పెరుగుతుంది. ముఖ్యంగా సిటీలలో ఎలక్ట్రిక్ స్కూటర్లు కొనుగోలు చేసేవారు ఎక్కువయ్యారు. బెడ్జెట్‌ ధరలో లభించే స్కూటర్లకు ప్రస్తుతం డిమాండ్ పెరుగుతుంది. మధ్య తరగతి ప్రజలు తక్కువ ధరలో లభించే ఎలక్ట్రిక్ స్కూటర్ల వైపు ఆసక్తి చూపిస్తున్నారు. వారి కోసం జెలియో కంపెనీ అదిరిపోయే స్కూటర్లని ప్రవేశపెట్టింది. Eeva సిరీస్‌లో భాగంగా Eeva, Eeva ZX మోడల్‌లని తక్కువ ధర, ఎక్కువ రేంజ్ తో విడుదల చేసింది కంపెనీ. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు రూ. 54 వేల (ఎక్స్-షోరూమ్) నుంచి స్టార్ట్ అవుతాయి. ఇక వీటి ఫీచర్లు, రేంజ్ ఇంకా ధరల గురించి తెలుసుకుందాం.

ముందుగా ఈవా స్కూటర్ ఫీచర్ల విషయానికి వస్తే.. దీన్ని ప్రజల యొక్క రోజువారీ అవసరాల కోసం డిజైన్ చేశారు. దీన్ని ఛార్జ్ చెయ్యాలంటే.. 6 నుంచి 8 గంటల సమయం పడుతుంది. బ్యాటరీ ఆప్షన్స్ ని బట్టి ఇది సింగిల్ ఛార్జ్‌లో 60 నుంచి 120 కిలోమీటర్ల రేంజ్ ని ఇస్తుంది. దీని ప్రారంభ ధర రూ.54 వేల నుండి ఉంటుంది. టాప్ వేరియంట్ 58 వేల దాకా ఉంటుంది. ఈ బైక్ లో డ్రమ్ బ్రేక్‌లు, హైడ్రాలిక్ షాక్ అబ్జార్బర్‌లు వంటి సూపర్ ఫీచర్లు ఉన్నాయి. అలాగే యాంటీ థెఫ్ట్ అలారం, డిజిటల్ డిస్‌ప్లే వంటి అప్డేటెడ్ ఫీచర్లు కూడా ఈ బైక్ లో ఉంటాయి. ఇది బ్లూ, గ్రే, వైట్, బ్లాక్ వంటి నాలుగు కలర్స్‌లో అందుబాటులో ఉంటుంది. మంచి డిజైన్ తో చూడ్డానికి చాలా స్టైలిష్ గా ఉంటుంది. బడ్జెట్ ధరలో ఇది మంచి ఆప్షన్.

ఈవా ZX ఫీచర్ల విషయానికి వస్తే .. కంపెనీ ఈ మోడల్ ని స్టైలిష్ డిజైన్ తో తయారు చేసింది. ఈ స్కూటర్ మంచి పవర్ ఫుల్ పర్పామెన్స్ అందిస్తుంది. ఈ మోడల్ మెరుగైన సేఫ్టీ ఫీచర్లని ఉంది. ఈ స్కూటర్ వెనుక డ్రమ్ బ్రేక్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్‌తో వస్తుంది. ఈ స్కూటర్ ధర రూ.59,000 నుంచి రూ.62,000 దాకా ఉంటుంది. దీని బ్యాటరీ ప్యాక్ విషయానికి వస్తే.. దీన్ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 60 నుంచి 120 కిలో మీటర్ల రేంజ్ ఇస్తుంది. దీన్ని ఛార్జ్ చెయ్యడానికి 4 నుంచి 8 గంటల సమయం పడుతుంది. ఇందులో రివర్స్ గేర్, పార్కింగ్ స్విచ్, ఆటో రిపేర్ స్విచ్, USB ఛార్జర్, హైడ్రాలిక్ షాక్ అబ్జార్బర్‌లు, డిజిటల్ డిస్‌ప్లే, సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఫీచర్లు ఉన్నాయి. తక్కువ ధరలో ఎక్కువ కిలోమీటర్లు రేంజ్ కోరుకునేవారికి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు మంచి ఆప్షన్ గా చెప్పవచ్చు.