iDreamPost
android-app
ios-app

Yamaha RX 100: అప్డేటెడ్ ఫీచర్లతో రాబోతున్న యమహా ఆర్ ఎక్స్ 100!

  • Published Sep 12, 2024 | 1:00 AM Updated Updated Sep 12, 2024 | 1:00 AM

Yamaha RX 100: యమహా RX 100.. ఒకప్పుడు యూత్ లో ఈ బైక్ కి మామూలు క్రేజ్ వుండేది కాదు. ఈ బైక్ ను ఇప్పుడు సరికొత్తగా తీసుకు వచ్చేందుకు యమహా కంపెనీ ప్లాన్ చేస్తుంది.

Yamaha RX 100: యమహా RX 100.. ఒకప్పుడు యూత్ లో ఈ బైక్ కి మామూలు క్రేజ్ వుండేది కాదు. ఈ బైక్ ను ఇప్పుడు సరికొత్తగా తీసుకు వచ్చేందుకు యమహా కంపెనీ ప్లాన్ చేస్తుంది.

Yamaha RX 100: అప్డేటెడ్ ఫీచర్లతో రాబోతున్న యమహా ఆర్ ఎక్స్ 100!

యమహా RX 100 గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒకప్పుడు యూత్ లో ఈ బైక్ కి మామూలు క్రేజ్ వుండేది కాదు. అప్పట్లో ఈ బైక్ కు డిమాండ్ కూడా మాములుగా ఉండదు. అదిరిపోయే స్పోర్టీ లుక్ తో, డిఫరెంట్ సౌండ్ తో కూడిన యమహా ఆర్ఎక్స్ 100 ని అప్పట్లో ఎగబడి కొనేవారు.. కాలేజీ యువత ఈ బైక్ ని ఎక్కువగా కొనేవారు. ఈ బైక్ సేల్స్ తో యమహా కంపెనీ బాగా లాభ పడింది. ఇలా ఈ యమహా ఆర్ఎక్స్ 100 భారతీయ బైకింగ్ చరిత్రలోనే సపరేట్ ఇమేజిని సంపాదించుకుంది. 1980 లలో RX 100 ని యమహా కంపనీ ఇండియన్ మార్కెట్ లో ప్రవేశ పెట్టింది. ఈ బైక్ అప్పుడే 98cc టూ-స్ట్రోక్ ఇంజిన్ కలిగి వుండేది. సూపర్ స్పీడ్ తో తేలికపాటి డిజైన్‌తో RX 100 ఒక ఊపు ఊపేది.

యమహా RX 100 బైక్ ను ఇప్పుడు సరికొత్తగా తీసుకు వచ్చేందుకు యమహా కంపెనీ ప్లాన్ చేస్తుంది. సరికొత్త ఫీచర్లు, మరింత స్పోర్టీ లుక్ తో ఆర్ఎస్ 100 ను మార్కెట్ లోకి తీసుకువచ్చేందుకు యమహా కంపెనీ సిద్దమయ్యింది. కొత్త యమహా ఆర్ఎక్స్ 100 ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, LED హెడ్‌లైట్, టర్న్ బై ఇండికేటర్, రెండు టైర్లలో డిస్క్ బ్రేకులు, అల్లాయ్ వీల్స్, USB పోర్ట్, చార్జింగ్ పోర్ట్, వైర్‌లెస్ చార్జింగ్ వంటి అప్డేటెడ్ ఫీచర్లు రానున్నాయి. ఈ ఫీచర్లన్ని నేటి యువతను ఆకట్టుకునే విధంగా యమహా కంపెనీ సరికొత్త ఆర్ఎక్స్ 100 లోకి తీసుకొచ్చింది. దీన్ని రైడర్లకు కంఫర్ట్ గా ఉండే విధంగా చాలా సౌకర్యవంతంగా కంపెనీ డిజైన్ చేసింది. ఈ సరికొత్త బైక్ కచ్చితంగా మంచి రైడింగ్ అనుభూతిని కలిగించడం ఖాయం అట. అలా ఈ బైక్ ను కంపెనీ రూపొందించినట్లు తెలుస్తోంది.

ఈ బైక్ పాత RX 100 కంటే ఇంకా మంచి స్పోర్టీ లుక్‌తో మార్కెట్లోకి విడుదల కాబోతుందట. ఈ బైక్ లో కూడా 98cc సామర్థ్యంతో కూడిన ఇంజిన్ కలిగి వుంటుందని తెలుస్తుంది. ఈ బైక్ 18 bhp పవర్, 22 Nm టార్క్ ని జనరేట్ చేస్తుందట. ఈ బైకులో 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఉంటుంది. ఈ బైక్ 35 నుండి 40 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుందని తెలుస్తుంది. ఈ బైక్ ధర 1.40 లక్షల నుండి రూ. 1.50 లక్షల దాకా ప్రారంభ ధర ఉండొచ్చని తెలుస్తుంది. 2024 చివరి నాటికి ఈ బైక్ మార్కెట్లో విడుదల అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. మరి కొత్త యమహా RX 100 పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.