iDreamPost
android-app
ios-app

విప్రోకి వేల కోట్ల కాంట్రాక్ట్.. ఐటీ ఉద్యోగులకిది సూపర్ గుడ్ న్యూస్!

  • Published Jun 06, 2024 | 9:03 PM Updated Updated Jun 06, 2024 | 9:03 PM

Huge Deal For Wipro: ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగం లబోదిబోమంటుంటే భారత ఐటీ దిగ్గజ కంపెనీ మాత్రం భారీ ప్రాజెక్టుని దక్కించుకుని ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఐటీ ఉద్యోగులకు ఇది సూపర్ గుడ్ న్యూస్ అనే చెప్పాలి.

Huge Deal For Wipro: ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగం లబోదిబోమంటుంటే భారత ఐటీ దిగ్గజ కంపెనీ మాత్రం భారీ ప్రాజెక్టుని దక్కించుకుని ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఐటీ ఉద్యోగులకు ఇది సూపర్ గుడ్ న్యూస్ అనే చెప్పాలి.

  • Published Jun 06, 2024 | 9:03 PMUpdated Jun 06, 2024 | 9:03 PM
విప్రోకి వేల కోట్ల కాంట్రాక్ట్.. ఐటీ ఉద్యోగులకిది సూపర్ గుడ్ న్యూస్!

ప్రపంచవ్యాప్తంగా ఐటీ పరిశ్రమ ఆర్థిక అనిశ్చితి లేక అనేక ఇబ్బందులను ఎదుర్కుంటున్న విషయం తెలిసిందే. చాలా ఐటీ కంపెనీలు లేఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. లేఆఫ్స్ కారణంగా చాలా మంది ఉద్యోగాలను కోల్పోయి రోడ్డున పడుతున్నారు. కొంతమంది అయితే ఉద్యోగాలు పోతాయేమో అని బిక్కుబిక్కున గడుపుతున్నారు. అయితే ఇంతటి దయనీయ పరిస్థితిలో ఐటీ దిగ్గజ కంపెనీ విప్రో.. తమ సంస్థ ఉద్యోగులకు సూపర్ గుడ్ న్యూస్ చెప్పింది. వేల కోట్ల విలువైన భారీ ప్రాజెక్ట్ ని దక్కించుకుని ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది.ఉద్యోగాలు ఉంటాయో, ఊడతాయో తెలియని పరిస్థితిలో ఇంత పెద్ద కాంట్రాక్ట్ దక్కించుకుందంటే అది వాళ్లకి శుభవార్త కాక ఇంకేమవుతుంది.

ప్రపంచమంతా ఐటీ రంగం కుదేలవుతుంటే.. భారత ఐటీ దిగ్గజ కంపెనీ విప్రో మాత్రం భారీ కాంట్రాక్ట్ ని దక్కించుకుని ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రముఖ అమెరికా కమ్యూనికేషన్ సర్వీస్ ప్రొవైడర్ నుంచి భారీ కాంట్రాక్ట్ ని పొందినట్లు కంపెనీ తెలిపింది. ఐదేళ్ల కాలానికి సుమారు 4,175 కోట్ల రూపాయల భారీ డీల్ ని పొందినట్లు కంపెనీ ఎక్స్ ఛేంజీలకు సమర్పించిన ఫైలింగ్ లో తెలిపింది. ఈ డీల్ లో భాగంగా ఉత్పత్తులు, పరిశ్రమకు సంబంధించిన పరిష్కారాల కోసం అమెరికన్ సంస్థకు నిర్వహణ సేవలను అందించనున్నట్లు విప్రో కంపెనీ తెలిపింది. కాగా 2024 ఆర్థిక ఏడాదిలో విప్రో కమ్యూనికేషన్ విభాగం వార్షిక ప్రాతిపదికన 14.7 శాతం క్షీణించింది. మొత్తం ఆదాయంలో ఈ విప్రో కమ్యూనికేషన్ విభాగం నుంచి కంపెనీకి 4.2 శాతం ఆదాయం వచ్చింది.

అగ్రశ్రేణి ఐటీ సంస్థలకు 500 మిలియన్ డాలర్ల నుంచి 1 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాలు అనేవి చాలా కీలకం. ఎందుకంటే ఈ ఒప్పందాలే నేరుగా ఆదాయ వృద్ధిని ప్రభావితం చేస్తాయి. నాలుగో త్రైమాసికంలో విప్రో డీల్ బుకింగ్స్ 9.5 శాతం పెరిగి 1.2 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని.. వృద్ధిని వేగవంతం చేయడమే సంస్థ తక్షణ కర్తవ్యం అని కొత్త సీఈఓ శ్రీనివాస్ పలియా గత ఎర్నింగ్స్ కాల్ లో వెల్లడించారు. మొత్తానికి ఐటీ పరిశ్రమ ప్రపంచవ్యాప్తంగా లబోదిబోమంటుంటే.. ఐటీ దిగ్గజ కంపెనీ విప్రో మాత్రం భారీ కాంట్రాక్ట్ ని దక్కించుకుంది.          

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss