iDreamPost
android-app
ios-app

Wings EV Robin: తొలి మైక్రో ఎలక్ట్రిక్ కారుని లాంఛ్ చేసిన వింగ్స్ ఈవీ కంపెనీ!

  • Published Aug 17, 2024 | 3:36 PM Updated Updated Aug 17, 2024 | 3:36 PM

Wings EV Robin Electric Car: ఎండకి, వర్షానికి చెక్ పెట్టేలా బైక్ సైజులో సరికొత్త ఎలక్ట్రిక్ కారు మార్కెట్లోకి వస్తుంది. ఇండియాలోనే తొలి మైక్రో ఎలక్ట్రిక్ కారుగా ఉన్న రాబిన్ ఈవీ కారుని హైదరాబాద్ మార్కెట్లోకి తీసుకొచ్చే ప్లాన్ లో కంపెనీ ఉంది. ఇక ఈ కారు మార్కెట్లో ఎప్పుడు లాంచ్ అవుతుందో అనే విషయాన్ని కంపెనీ ప్రకటించింది.

Wings EV Robin Electric Car: ఎండకి, వర్షానికి చెక్ పెట్టేలా బైక్ సైజులో సరికొత్త ఎలక్ట్రిక్ కారు మార్కెట్లోకి వస్తుంది. ఇండియాలోనే తొలి మైక్రో ఎలక్ట్రిక్ కారుగా ఉన్న రాబిన్ ఈవీ కారుని హైదరాబాద్ మార్కెట్లోకి తీసుకొచ్చే ప్లాన్ లో కంపెనీ ఉంది. ఇక ఈ కారు మార్కెట్లో ఎప్పుడు లాంచ్ అవుతుందో అనే విషయాన్ని కంపెనీ ప్రకటించింది.

Wings EV Robin: తొలి మైక్రో ఎలక్ట్రిక్ కారుని లాంఛ్ చేసిన వింగ్స్ ఈవీ కంపెనీ!

ఇండోర్ రాష్ట్రానికి చెందిన వింగ్స్ ఈవీ కంపెనీ భారతీయ ఆటోమొబైల్ మార్కెట్ కి సరికొత్త కేటగిరీని పరిచయం చేస్తుంది. రాబిన్ పేరుతో ఒక బైక్ సైజులో బైక్ లాంటి టూ సీటర్ ఎలక్ట్రిక్ మైక్రో కారుని తీసుకొస్తుంది. వింగ్స్ ఈవీ కంపెనీని తండ్రీకొడుకుల ద్వయం కలిసి స్థాపించారు. జీరో పొల్యూషన్, తక్కువ రద్దీతో, తక్కువ రోడ్డు స్పేస్ లో వ్యక్తిగత రాకపోకలకు ఉపయోగపడే కారుని తయారుచేయాలన్న లక్ష్యంతో రాబిన్ ఈవీ కారుని తయారు చేశారు.    

ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఆర్ఏఐ) నిర్వహించిన అన్ని టెస్టుల్లోనూ రాబిన్ ఈవీ పాసయ్యింది. పుణెలో నిర్వహించిన అన్ని సేఫిటీ టెస్టుల్లో ఈ కారు పాస్ అయినట్లు వింగ్స్ ఈవీ కంపెనీ సహ వ్యవస్థాపకుడు ప్రణవ్ దండేకర్ వెల్లడించారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న టూ వీలర్ లేదా త్రీ వీలర్ తో పోలిస్తే ఇది చాలా సురక్షితమని టెస్టుల్లో తేలింది. ఏడాదికి 10 వేల కార్ల యూనిట్స్ ని తయారు చేసే సామర్థ్యం ఇండోర్ ప్లాంట్ కి ఉందని ప్రణవ్ తెలిపారు. తొలి ఏడాదిలో 3 వేల యూనిట్స్ ని విక్రయించాలన్న లక్ష్యంతో ఉన్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా ఆరు నగరాల్లో వింగ్స్ ఈవీ కంపెనీ వినియోగదారుల పరిశోధనను నిర్వహించింది. ఇందులో భాగంగా బెంగళూరులో ఏకంగా 300కి పైగా టెస్ట్ డ్రైవ్ లని నిర్వహించినట్లు ప్రణవం వెల్లడించారు.

తొలి ఈవీ కారుని ఏప్రిల్ 2025లో బెంగళూరులో ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా వింగ్స్ ఈవీ కంపెనీని విస్తరించే ముందు చెన్నై, హైదరాబాద్ లేదా పుణెకి రాబిన్ ఈవీ కారుని పరిచయం చేస్తామని ప్రణవ్ తెలిపారు. ఏప్రిల్ 2025 నుంచి డెలివరీలు ప్రారంభిస్తామని అన్నారు. దక్షిణాదిన ఉన్న డిమాండ్ ని బట్టి ఇక్కడ ప్రొడక్షన్ యూనిట్ ని ప్రారంభిస్తామని అన్నారు. ఇక ఈ రాబిన్ ఈవీ కారు మూడు వేరియంట్లలో వస్తుంది. బేసిక్ వెర్షన్ నాన్ ఏసీ మోడల్ 65 కి.మీ. రేంజ్ నిస్తుంది. దీని ధర రూ. 2 లక్షలుగా ఉంది. మిడ్ వేరియంట్ ఫ్యాన్ తో వస్తుంది. ఇది సింగిల్ ఛార్జ్ తో 90 కి.మీ. ప్రయాణిస్తుంది. దీని ధర రూ. 2,50,000గా ఉంది. ఇక ప్రీమియం వేరియంట్ 90 కి.మీ. రేంజ్ తో వస్తుంది. ఇందులో ఏసీతో పాటు భద్రత కోసం పేటెంట్ పొందిన ఆడియో అలర్ట్ సిస్టమ్స్ ఫీచర్స్ ఉన్నాయి. దీని ధర రూ. 3 లక్షలుగా ఉంది.