iDreamPost
android-app
ios-app

35 స్మార్ట్ ఫోన్లలో నిలిచిపోనున్న వాట్సాప్.. మీ ఫోన్ ఉందేమో చూసుకోండి!

  • Published Aug 06, 2024 | 3:00 AM Updated Updated Aug 06, 2024 | 7:12 AM

Reports Says That WhatsApp Stopped Working On These 35 Smartphone Models: సెక్యూరిటీ నిమిత్తం వాట్సాప్ కొత్త కొత్త అప్డేట్స్ ని, ఫీచర్స్ ని తీసుకొస్తుంటుంది. ఈ క్రమంలో కొన్ని ఫోన్లు ఆ ఫీచర్స్ ని సపోర్ట్ చేయవు. దీంతో కొన్ని ఫోన్లలో వాట్సాప్ తన సేవలను నిలిపివేస్తుంది. మరి వాట్సాప్ నిలిచిపోనున్న ఫోన్ల జాబితాలో మీ ఫోన్ ఉందేమో చూసుకోండి.

Reports Says That WhatsApp Stopped Working On These 35 Smartphone Models: సెక్యూరిటీ నిమిత్తం వాట్సాప్ కొత్త కొత్త అప్డేట్స్ ని, ఫీచర్స్ ని తీసుకొస్తుంటుంది. ఈ క్రమంలో కొన్ని ఫోన్లు ఆ ఫీచర్స్ ని సపోర్ట్ చేయవు. దీంతో కొన్ని ఫోన్లలో వాట్సాప్ తన సేవలను నిలిపివేస్తుంది. మరి వాట్సాప్ నిలిచిపోనున్న ఫోన్ల జాబితాలో మీ ఫోన్ ఉందేమో చూసుకోండి.

35 స్మార్ట్ ఫోన్లలో నిలిచిపోనున్న వాట్సాప్.. మీ ఫోన్ ఉందేమో చూసుకోండి!

వాట్సాప్ ని ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల కంటే ఎక్కువ మంది వినియోగిస్తున్నారు. వాట్సాప్ లేకపోతే రోజు గడవని పరిస్థితి. వ్యక్తిగత అవసరాలకైనా, ఉద్యోగ అవసరాల కోసం, వ్యాపార అవసరాల కోసం ఇలా వాట్సాప్ మనిషి జీవితంలో ఒక భాగం అయిపోయింది. వాట్సాప్ యూజర్స్ అవసరాలకు తగ్గట్టు సౌకర్యాలను తీసుకొస్తూనే భద్రత విషయంలోనూ కీలక అప్డేట్స్ ని తీసుకొస్తుంటుంది. ముఖ్యంగా సెక్యూరిటీ పరంగా కొత్త టెక్నాలజీతో ఫీచర్స్ ని యాడ్ చేస్తుంటుంది. ఈ క్రమంలో అవుట్ డేటెడ్ డివైజ్ లు ఏమైనా ఉంటే వాట్సాప్ పని చేయదు. కొన్ని స్మార్ట్ ఫోన్లు కొన్ని వెర్షన్ల వరకే పని చేస్తుంటుంది. తాజాగా వాట్సాప్ నిర్ణయంతో ఇప్పుడు 35 రకాల స్మార్ట్ ఫోన్లపై తీవ్ర ప్రభావం పడనుంది. కాబట్టి ఎవరి దగ్గరైనా ఈ ఫోన్లు ఉంటే కనుక వాట్సాప్ కావాలంటే వేరే ఫోన్ కొనుక్కోవాల్సిందే. ఓ మీడియా నివేదిక ప్రకారం.. 35 స్మార్ట్ ఫోన్ మోడల్స్ లో వాట్సాప్ పని చేయదు. ఈ జాబితాలో శాంసంగ్, యాపిల్, సోనీ, ఎల్జీ సహా అనేక స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి.   

వాట్సాప్ నిలిచిపోనున్న ఫోన్ల జాబితా ఇదే:

  • యాపిల్: ఐఫోన్ 5, ఐఫోన్ 6, ఐఫోన్ 6ఎస్, ఐఫోన్ 6ఎస్ ప్లస్, ఐఫోన్ ఎస్ఈ
  • శాంసంగ్: శాంసంగ్ గెలాక్సీ ఏస్ ప్లస్, గెలాక్సీ కోర్, గెలాక్సీ ఎక్స్ ప్రెస్ 2, గెలాక్సీ గ్రాండ్, గెలాక్సీ నోట్ 3, గెలాక్సీ ఎస్ 3 మినీ, గెలాక్సీ ఎస్ 4 యాక్టివ్, గెలాక్సీ ఎస్4 మినీ, గెలాక్సి ఎస్4 జూమ్
  • మోటోరోలా: మోటో జీ, మోటో ఎక్స్
  • లెనోవో: లెనోవో 46600, ఏ858టీ, పీ70, ఏ820
  • హువాయి: హువాయి కంపెనీకి చెందిన అసెండ్ పీ6 ఎస్, అసెండ్ జీ525, సీ199, జీఎక్స్1ఎస్, వై625
  • సోనీ:సోనీ ఎక్స్ పీరియా జడ్1, ఎక్స్ పీరియా ఈ3, ఎక్స్ పీరియా ఎం
  • ఎల్జీ: ఎల్జీ ఆప్టిమస్ 4ఎక్స్ హెచ్డీ, ఆప్టిమస్ జీ, ఆప్టిమస్ జీ ప్రో, ఆప్టిమస్ ఎల్7

ఆండ్రాయిడ్ 5.0 లేదా ఆపై వెర్షన్ ఉన్న ఫోన్లలో మాత్రమే వాట్సాప్ పని చేస్తుంది. ఐఓఎస్ 12 లేదా ఆపై వెర్షన్ లో మాత్రమే వాట్సాప్ సపోర్ట్ చేస్తుంది. పాత ఫోన్లు కొత్త ఫీచర్స్ ని సపోర్ట్ చేయవు. సెక్యూరిటీ మెయింటెనెన్స్ కి పాత ఫోన్లు సపోర్ట్ చేయవు. అందుకే వాట్సాప్ ని కొనసాగించాలంటే ఫోన్లలో ఓఎస్ ని అప్డేట్ చేసుకోవాలి. ఒకవేళ ఫోన్ కి ఆ అప్డేట్ లేకపోతే ఫోన్ ని మార్చాల్సిందే. మరి ఈ జాబితాలో మీ ఫోన్ ఉందో లేదో చూసుకోండి.