Vinay Kola
Maruthi Suzuki WagonR Waltz Limited Edition: మార్కెట్లో ఎక్కువగా అమ్ముడవుతున్న కార్లలో మారుతి సుజుకీ వ్యాగన్ ఆర్ కూడా ఒకటి. ఈ కార్ బడ్జెట్ ధరకే లభించడం వల్ల డిమాండ్ ఎక్కువగా ఉంది. ఈ కార్ ని అప్ గ్రేడెడ్ గా మార్చి లిమిటెడ్ ఎడిషన్ గా మారుతీ సుజుకీ లాంచ్ చేసింది.
Maruthi Suzuki WagonR Waltz Limited Edition: మార్కెట్లో ఎక్కువగా అమ్ముడవుతున్న కార్లలో మారుతి సుజుకీ వ్యాగన్ ఆర్ కూడా ఒకటి. ఈ కార్ బడ్జెట్ ధరకే లభించడం వల్ల డిమాండ్ ఎక్కువగా ఉంది. ఈ కార్ ని అప్ గ్రేడెడ్ గా మార్చి లిమిటెడ్ ఎడిషన్ గా మారుతీ సుజుకీ లాంచ్ చేసింది.
Vinay Kola
ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్లో ఎక్కువగా అమ్ముడవుతున్న కార్లలో మారుతి సుజుకీ వ్యాగన్ ఆర్ కూడా ఒకటి. ఈ కార్ చిన్నగా ఉండటం, బడ్జెట్ ధరకే లభించడం వల్ల డిమాండ్ ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఈ కార్ ని అప్ గ్రేడెడ్ గా మార్చి లిమిటెడ్ ఎడిషన్ గా మారుతీ సుజుకీ లాంచ్ చేసింది. ఈ కొత్త వ్యాగన్ ఆర్ లిమిటెడ్ వెర్షన్ పేరు వాల్ట్జ్ లిమిటెడ్ ఎడిషన్. ఫెస్టివల్ సీజన్లో లిమిటెడ్ గా మాత్రమే ఈ కారు అందుబాటులో ఉంటుందని కంపెనీ ప్రకటించింది. ఇక ఈ సరికొత్త మారుతీ సుజుకీ వ్యాగన్ ఆర్ వాల్ట్జ్ లిమిటెడ్ ఎడిషన్ ఫీచర్లు, ధర ఇంకా పూర్తి వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈ కారు లోపల డిజైనర్ సీట్ కవర్, 6.2 అంగుళాల పయోనీర్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్, బ్లూ టూత్ కనెక్టివిటీ, రివర్స్ కెమెరా, ఆడియో కంట్రోల్ తో కూడిన 3 స్పోక్ స్టీరింగ్ వీల్, సెమీ డిజిటల్ క్లస్టర్, నాలుగు పవర్ విండోలు ఉంటాయి. సేఫ్టీ విషయానికి వస్తే ట్రాక్షన్ కంట్రోల్, ఏబీఎస్, ఈబీడీ, ఈఎస్సీ, డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్, హిల్ హోల్డ్ అసిస్ట్ వంటి ఫీచర్లు ఈ కారులో ఉంటాయి. ఇక ఈ కారు ఎక్స్‌టీరియర్ విషయానికి వస్తే.. దీనికి 14 అంగుళాల స్టీల్ వీల్స్ ఉంటాయి. రిఫ్లెక్టివ్ హాలోజెన్ హెడ్ లైట్లు, హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్స్ ఇంకా అలాగే ఫాక్స్ సిల్వర్ స్కిడ్ ప్లేట్ వంటివి ఉంటాయి.
ఈ కొత్త ఎడిషన్ కారు చూడటానికి పాత మోడల్ వ్యాగన్ఆర్ లాగానే ఉంటుంది. అయితే దీనిలో కొత్తగా ఫాగ్ ల్యాంప్, ఫాగ్ ల్యాంప్ గార్నిష్, ముందు వైపు క్రోమ్ గ్రిల్, విండో వైజర్ వంటి ఫీచర్లు ఇందులో ఉంటాయి. ఇక ఈ లిమిటెడ్ వెర్షన్ కారు వ్యాగన్ ఆర్ లో ఉన్న అన్ని ట్రిమ్స్ అయిన ఎల్ఎక్స్ఐ, వీఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ లలో సేల్ అవుతుంది. వీటి ధరలు రూ. 5.65 లక్షలు(ఎక్స్ షోరూం) నుంచి స్టార్ట్ అవుతాయి. ఈ కార్ కొనాలని ఆసక్తి ఉన్న వినియోగదారులు దగ్గరలోని డీలర్ వద్దకి వెళ్లి అడ్వాన్స్ బుకింగ్స్ చేసుకోవాలని మారుతీ కంపెనీ కోరింది. ఈ కార్ డెలివరీలు త్వరలో స్టార్ట్ అవుతాయాని కంపెనీ పేర్కొంది. ఇక ఈ సరికొత్త మారుతీ సుజుకి వేగన్ ఆర్ వాల్ట్జ్ లిమిటెడ్ వెర్షన్ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.