iDreamPost
android-app
ios-app

Flipkartలో కేవలం రూ. 11కే ఐఫోన్‌.. సోషల్ మీడియాలో ట్రోల్స్

  • Published Sep 26, 2024 | 2:14 PM Updated Updated Sep 26, 2024 | 2:14 PM

Flipkart Big Billion Days 2024: ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ ఇటీవలే రూ.11 రూపాయలకే ఐఫోన్ 13 మోడల్ ఫోన్ పొందే సేల్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ సేల్ పై సోషల్ మీడియాలో నెటిజన్స్ తీవ్ర స్థాయిలో ట్రోల్స్ చేస్తున్నారు. కారణమేమిటంటే..

Flipkart Big Billion Days 2024: ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ ఇటీవలే రూ.11 రూపాయలకే ఐఫోన్ 13 మోడల్ ఫోన్ పొందే సేల్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ సేల్ పై సోషల్ మీడియాలో నెటిజన్స్ తీవ్ర స్థాయిలో ట్రోల్స్ చేస్తున్నారు. కారణమేమిటంటే..

  • Published Sep 26, 2024 | 2:14 PMUpdated Sep 26, 2024 | 2:14 PM
Flipkartలో కేవలం రూ. 11కే ఐఫోన్‌.. సోషల్ మీడియాలో ట్రోల్స్

ప్రస్తుతం పండగల సీజన్ వచ్చేసింది. దీంతో ప్రముఖ ఈ కామర్స్ కంపెనీలైన ఫ్లిప్కార్ట్, అమెజాన్ సంస్థలు ఇప్పటికే బిగ్ బిలియన్ డేస్ అని, గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అంటూ భారీ డిస్కౌంట్లతో సేల్స్ ను ప్రకటించాయి. అయితే కస్టమర్స్ ను ఆకర్షించే విధంగా బ్రాండెడ్ వస్తువులను కూడా అతి తక్కువ ధరకు సేల్ అందిచడంలో ఫ్లిప్కార్ట్ ఎప్పుడు ముందుంటుదనే చెప్పవచ్చు.ఈ క్రమంలోనే దసరా పండుగ సందర్భంగా ఫ్లిప్కార్ట్ వినియోగదారులను ఆకర్షించేందుకు భారీగా ప్రమోషన్స్ చేపట్టింది. ఇక ఈ ప్రమోషన్స్ లో భగంగా ఐఫోన్ 13 మోడల్ ఫోన్ కేవలం రూ.11 రూపాయలకే పొందే అవకాశం ఉందని ఆఫర్ ను ప్రకటించింది.

అయితే ఈ ఆఫర్ సెప్టెంబర్ 22న రాత్రి 11 గంటలకు ఈ సేల్ లైవ్ లో అందుబాటులో ఉంటుందని ఫ్లిప్కార్ట్ చెప్పింది. అసలే ఐఫోన్.. అది కూడా రూ.11లకు కావడంతో కస్టమర్లు నిజంగానే ఆకర్షితులైయ్యారు. వెంటనే దానిని కొనుగోలు చేసేందుకు భారీగా పోటి పడ్డారు. కానీ, ఊహించని విధంగా కస్టమర్లకు నిరాశ మిగిలింది. దీంతో ఫ్లిప్కార్ట్పై అసహనాన్ని సోషల్ మీడియా వేదికగా మార్చుకొని తీవ్ర విమర్శల వర్షం కురిపించారు. ఆ వివరాళ్లోకి వెళ్తే..

ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ రూ.11 రూపాయలకే ఐఫోన్ 13 మోడల్ ఫోన్ పొందే సేల్ ప్రకటించడంతో చాలామంది కస్టమర్లు దానిని దక్కించేందుకు తెగ ప్రయత్నించారు. కానీ,  ఈ ఐఫోన్ మాత్రం కస్టమర్లకు  అందని ద్రాక్షనిగానే మిగిలిపోయింది. ముఖ్యంగా  అలా సేల్ పెట్టిన వెంటనే  సోల్డ్ అవుట్ అని కనిపించే సరికి చాలామంది తీవ్ర నిరాశకు గురైయ్యారు. దీంతో ఐఫోన్ అంటూ ఊరించి ఇప్పుడు నిరాశకు గురిచేసిన ఫ్లిప్కార్ట్పై తీవ్ర అసహనానికి లోనైయ్యారు. ఇక ఆ కోపం ఎక్కడ చూపించాలో తెలియక కొందురు ఎక్స్ వేదిగా ఆ ఈ కామర్స్ సంస్థ పై తీవ్ర స్థాయిలో విమర్శలతో దుమ్మెత్తిపోశారు.

కేవలం బజ్ క్రియేట్ చేయడానికే ఫ్లిప్కార్ట్  ఇలా వినియోగదారులను వెర్రివాళ్లను చేస్తున్నారని, ఇలాంటి ఫేక్ ప్రచారాలు చేస్తున్నందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కొందరు డిమాండ్ చేశారు. మరి కొందరు వినియోగదారులు మాత్రం ఐఫోన్ 13ను ఫ్లిప్కార్ట్ ప్రచారం చేసినట్టుగానే 11 రూపాయలకే పొందామని స్క్రీన్షాట్లు షేర్ చేసి మరీ చెబుతున్నారు. అయితే ఫ్లిప్కార్ట్ ఈ ఐఫోన్ ఆఫర్ కొద్ది మందికి మాత్రమే పెట్టిందని,  ఏదీ ఏమైనా  ఈ కామర్స్ సంస్థ ఇలా ఫెస్టివల్ సీజన్ లో కస్టమర్లను ఆకర్షించడానికి ఇలాంటి బిజినెస్ స్ట్రాటెజీని వినియోగిస్తారంటూ నెటిజన్స్ మండిపడుతున్నారు. మరి, ఫ్లిప్కార్ట్ లో రూ.11 రూపాయలకే ఐఫోన్ ప్రకటనపై నెటిజన్స్ ట్రోల్స్ చేయడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.