iDreamPost
android-app
ios-app

హామీ లేకుండా రూ.50 వేల లోన్.. వడ్డీపై రాయితీ.. త్వరగా అప్లై చేసుకోండి

  • Published Apr 27, 2024 | 8:10 PM Updated Updated Apr 27, 2024 | 8:10 PM

తక్కువ వడ్డీతో ఎలాంటి హామీ లేకుండా 50 వేల లోన్ ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. పైగా వడ్డీలో రాయితీ కూడా కల్పిస్తుంది. మరి ఈ లోన్ గురించి పూర్తి వివరాలు మీ కోసం. 

తక్కువ వడ్డీతో ఎలాంటి హామీ లేకుండా 50 వేల లోన్ ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. పైగా వడ్డీలో రాయితీ కూడా కల్పిస్తుంది. మరి ఈ లోన్ గురించి పూర్తి వివరాలు మీ కోసం. 

హామీ లేకుండా రూ.50 వేల లోన్.. వడ్డీపై రాయితీ.. త్వరగా అప్లై చేసుకోండి

కేంద్ర ప్రభుత్వం పేదల కోసం అనేక రకాల సంక్షేమ పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటిలో పీఎం స్వనిధి పథకం ఒకటి. ఈ పథకంలో భాగంగా వీధి వ్యాపారులకు ఆర్థిక సహాయం అందజేస్తుంది. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వీధి వ్యాపారుల కోసం 2020లో ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా వడ్డీ రాయితీతో 50 వేల వరకూ లోన్ అందజేస్తుంది. ఎలాంటి హామీ లేకుండా ఈ లోన్ ని ఈజీగా పొందవచ్చు. నిజానికి ఈ పథకం 2022 మార్చి నెలతోనే ముగిసింది. అయితే మరింత మందికి ఆర్థిక సహాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ స్కీంని 2024 డిసెంబర్ వరకూ పొడిగించింది. ఈ పథకం ద్వారా తక్కువ వడ్డీకే హామీ లేకుండా 50 వేల లోన్ పొందవచ్చు.

లోన్ తీసుకున్న ఏడాది లోపు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. అయితే విడతల వారీగా మాత్రమే లోన్ పొందే అవకాశం అది. వీధి వ్యాపారులు తొలి పెట్టుబడి కింద 10 వేల రూపాయల లోన్ పొందవచ్చు. ఆ లోన్ సమయానికి తిరిగి చెల్లిస్తే రెండో విడత కింద 20 వేలు లోన్ వసుంది. ఈ లోన్ కూడా టైంకి చెల్లిస్తే మూడో విడత కింద 50 వేల రూపాయలు వస్తాయి. ఈ లోన్ ని ఆన్ లైన్ పేమెంట్ ద్వారా క్లియర్ చేస్తే 1200 రూపాయల క్యాష్ బ్యాక్ అనేది వర్తిస్తుంది. లోన్ పీరియడ్ కి ముందే రుణాన్ని క్లియర్ చేసినట్లయితే అసలు వడ్డీపై 7 శాతం వడ్డీ అనేది సబ్సిడీ ఉంటుంది. అంటే మీకు 7 శాతం వడ్డీ అనేది తగ్గుతుంది. నేరుగా బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ఈ వడ్డీ రాయితీ అనేది లోన్ తీసుకున్నవారి ఖాతాల్లో జమ అవుతుంది. అయితే వడ్డీ అనేది ఆయా గ్రామీణ ప్రాంతీయ బ్యాంకులు విధించే దాని ప్రకారం ఉంటుంది.

ఈ లోన్ పొందాలంటే వీధి వ్యాపారులకు ఇచ్చే వెండింగ్ సర్టిఫికెట్ ఉండాలి. లేదా వీధి వ్యాపారులమే అనడానికి గుర్తింపు కార్డు ఉండాలి. ఒకవేళ గుర్తింపు కార్డు లేకపోయినా.. లోన్ తీసుకున్న 30 రోజుల్లోగా సబ్మిట్ చేయవచ్చు. అలానే ఓటర్ ఐడీ, ఆధార్ కార్డు కూడా ఉండాలి. ఈ పథకానికి 2022 మార్చి 24 నుంచి వీధి వ్యాపారం చేసుకునేవారంతా అర్హులే. ఇప్పటి వరకూ ఈ పథకానికి తొలి విడత కింద 79,75,216 మంది అప్లై చేయగా.. అందులో 66,64,873 మందికి లోన్ మంజూరు అయ్యింది. ఇందులో 63,83,468 మందికి లోన్ అనేది వారి ఖాతాల్లో పడింది. రెండో విడత కింద 23,83,613 మంది అప్లై చేయగా.. 18,73,932  మందికి లోన్ మంజూరు అయ్యింది. ఇందులో 17,86,593 మంది ఖాతాల్లో లోన్ జమ అయ్యింది. మూడో విడత కింద 3,86,999 మంది అప్లై చేసుకోగా.. 3,06,747 మందికి లోన్ మంజూరు అయ్యింది. వీరిలో 2,89,790 మందికి లోన్ జమ అయ్యింది. ఇంకా అప్లై చేయాల్సిన వారు ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చు. కాబట్టి వెంటనే అధికారిక వెబ్ సైట్ కి వెళ్లి అప్లై చేసుకుని ఈజీగా 50 వేల లోన్ పొందండి.