Dharani
Union Budget 2024-Pradhan Mantri Awas Yojan: సొంతింటి కల కనే వారికి కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఏకంగా 3 కోట్ల ఇండ్లు మంజూరు చేయనున్నట్లు ప్రకటించింది.
Union Budget 2024-Pradhan Mantri Awas Yojan: సొంతింటి కల కనే వారికి కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఏకంగా 3 కోట్ల ఇండ్లు మంజూరు చేయనున్నట్లు ప్రకటించింది.
Dharani
మూడోసారి అధికారంలోకి వచ్చిన కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాదికి సంబంధించి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఎన్‌డీఏ ప్రభుత్వం తరఫున కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏడో సారి బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో రైతులు, పేదలు, విద్యార్థులు, నిరుద్యోగులకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. వారు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా బడ్జెట్‌లో కేటాయింపులు చేశారు. ఇక పేదవారి కోసం అనేక కీలక ప్రకటనలు చేశారు. ప్రస్తుతం అమలు చేస్తోన్న ఉచిత రేషన్ పథకాన్ని మరో ఐదేళ్ల పాటు పొడగించారు. అలానే పేదల సొంతింటి కల సాకారం కోసం కేంద్రం బడ్జెట్‌లో ప్రత్యేక నిధులు కేటాయించింది. రానున్న ఐదేళ్లలో కొత్తగా 3 కోట్ల ఇళ్లు మంజూరు చేయనున్నట్లు ప్రకటించింది.
పేదలు, మధ్యతరగతి వారి సొంతింట కల సాకారం కోసం కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన-అర్బన్ 2.0 పథకం కింద ఏకంగా కోటి మందికి ఇంటి నిర్మాణం కోసం రుణాలు ఇవ్వడానికి ముందుకు వచ్చింది. మొత్తం రూ.10 లక్షల కోట్ల పెట్టుబడితో 1 కోటి పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఈ ప్రయోజనాన్ని అందించనునన్నట్టు వివరించారు. పట్టణ ప్రజల గృహ అవసరాలను గుర్తించామని, ఈ మేరకు అర్బన్ హౌసింగ్ ద్వారా సమస్యను పరిష్కరించనున్నట్టు వివరించారు. ఈ పథకం కింద రానున్న ఐదు సంవత్సరాల కాలంలో మరో రూ. 2.2 లక్షల కోట్లు కేంద్ర సాయం అందుతుందని ఆమె తెలిపారు.
పేదల సొంతింటి నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం.. 2015లో పీఎం ఆవాస్ యోజన అనే పథకాన్ని ప్రారంభించింది. ఈ స్కీమ్ కింద ఇళ్లు లేని పేదలు ఇంటి నిర్మాణం చేసుకోవడానికి.. లేద కొనుక్కోవడానికి ఆర్థిక సాయం అందజేస్తుంది. అయితే ఈ పథకానికి అర్హులు కావాలంటే.. ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో పీఎంఏఐ కోసం రూ. 80,671 కోట్లు కేటాయించారు. గత అంచనాలలో రూ. 54,103 కోట్లుగా సవరించారు. అంతేకాక అర్బన్ హౌసింగ్ ప్రాజెక్ట్‌లకు సరసమైన ధరలకు రుణాలను అందించడానికి వడ్డీ రాయితీ పథకం ప్రవేశపెట్టబోతున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటనతో పేద, మధ్యతరగతి వారి సొంతింట కల సాకారానికి భారీ రాయితీ లభించనుంది.