iDreamPost
android-app
ios-app

Budget 2024 Analysis: అంగన్వాడీ, ఆశా కార్యకర్తలకు గుడ్‌ న్యూస్‌ చెప్పిన నిర్మలమ్మ

  • Published Feb 01, 2024 | 2:03 PM Updated Updated Feb 01, 2024 | 2:03 PM

Union Budget 2024 Highlights & Analysis in Telugu: మధ్యంతర బడ్జెట్‌లో అంగన్వాడీ, ఆశా కార్యకర్తలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ శుభవార్త చెప్పారు. ఆ వివరాలు..

Union Budget 2024 Highlights & Analysis in Telugu: మధ్యంతర బడ్జెట్‌లో అంగన్వాడీ, ఆశా కార్యకర్తలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ శుభవార్త చెప్పారు. ఆ వివరాలు..

  • Published Feb 01, 2024 | 2:03 PMUpdated Feb 01, 2024 | 2:03 PM
Budget 2024 Analysis: అంగన్వాడీ, ఆశా కార్యకర్తలకు గుడ్‌ న్యూస్‌ చెప్పిన నిర్మలమ్మ

రానున్న 2024 లోక్‌సభ ఎన్నికల ముందు.. మధ్యంతర బడ్జెట్‌ ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌. ఫిబ్రవరి 1, గురువారం ఉదయం 11 గంటలకు లోక్‌సభలో బడ్జెట్‌ సమర్పించారు నిర్మలా సీతారామన్‌. పద్దు సమర్పణలో కొత్త అంశాలేవి పెద్దగా లేదు. గతంలో తమ ప్రభుత్వం చేపట్టిని కార్యక్రమాల గురించే వివరించారు. ఏ ఏ వర్గాల వారికి ఎంత సాయం చేశామన్నది చెప్పుకొచ్చారు. ట్యాక్స్‌ పేయర్స్‌కు నిరాశ మిగిల్చిన నిర్మలా సీతారామన్‌.. అంగన్వాడీ, ఆశ కార్యకర్తలకు మాత్రం గుడ్‌ న్యూస్‌ చెప్పారు. ఆ వివరాలు..

కేంద్రం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో అంగన్వాడీ, ఆశా కార్యకర్తలకు శుభవార్త చెప్పారు నిర్మలా సీతారామన్‌. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆయుష్మాన్‌ భారత్‌ పథకంలో వీరందరిని అర్హులుగా చేరుస్తామని ప్రకటించారు. అయితే ఇందుకోసం బడ్జెట్‌లో ఎంత మొత్తం కేటాయిస్తున్నారు అనే దానికి సంబంధించి నిర్మలా సీతారామన్‌ ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే గత డబ్జెట్‌లో మాత్రం ఆయుష్మాన్‌ భారత్‌ పథకం కోసం 7200 కోట్ల రూపాయలు కేటాయించారు. గతేడాది మొత్తం మీద చూసుకుంటూ ఆయుష్మాన్‌ భారత్‌ పథకం కోసం కేంద్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ కింద ఏకంగా 88,956 కోట్ల రూపాయల కేటాయింపులు జరిగాయి.

good news for anganwadi teachers

ఆయుష్మాన్‌ భారత్‌ పథకం కింద అర్హులైన వారందరికీ.. 5 లక్షల రూపాయల మేర ఆరోగ్య బీమా అందిస్తారు. ఇందుకోసం ఓ కార్డు ఇస్తారు. దీని ద్వారా వైద్యం చేయించుకునే అవకాశం ఉంటుంది. ఇది క్యాష్‌లెస్‌ సర్వీస్‌. ప్రస్తుతం ఈ పథకం కింద.. దేశవ్యాప్తంగా 30.6 కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని కేంద్రం ప్రకటించింది. ఈ పథకం ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 6.2 కోట్ల ఆస్పత్రుల్లో అడ్మిషన్స్‌ జరిగినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ పథకం ద్వారా ఎలాంటి నగదు చెల్లించాల్సిన అవసరం లేకుండా.. 5 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం పొందే అవకాశం కల్పిస్తోంది కేంద్ర ప్రభుత్వం.

తాజాగా ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో యువతకు శుభవార్త చెప్పారు నిర్మలా సీతారామన్‌. వారికి నామమాత్ర వడ్డీ లేదా అసలు వడ్డీ లేకుండానే రుణాలు ఇస్తామని ప్రకటించారు. ఇందుకోసం లక్ష కోట్ల రూపాయలతో కార్పస్‌ ఫండ్‌ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. స్టార్టప్‌ ఇండియా, స్టార్టప్‌ క్రెడిట్‌ గ్యారంటీతో యువతకు ఉద్యోగాలు కల్పిస్తామన్నారు.