iDreamPost
android-app
ios-app

కేంద్ర ప్రభుత్వ పథకం.. ఇంట్లో ఉంటూనే నెలకు ఫ్రీగా రూ.8 వేలు పొందండిలా

  • Published May 28, 2024 | 11:51 AM Updated Updated May 28, 2024 | 11:51 AM

PMKVY: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీసుకువచ్చిన ఓ పథకం ద్వారా.. ఇంట్లోనే ఉంటూ నెలకు 8 వేల రూపాయలు పొందే అవకాశం ఉంది. ఆ వివరాలు..

PMKVY: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీసుకువచ్చిన ఓ పథకం ద్వారా.. ఇంట్లోనే ఉంటూ నెలకు 8 వేల రూపాయలు పొందే అవకాశం ఉంది. ఆ వివరాలు..

  • Published May 28, 2024 | 11:51 AMUpdated May 28, 2024 | 11:51 AM
కేంద్ర ప్రభుత్వ పథకం.. ఇంట్లో ఉంటూనే నెలకు ఫ్రీగా రూ.8 వేలు పొందండిలా

గతంతో పోలిస్తే.. నేటి కాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదలు, సామాన్యులు, వృద్ధులు, నిరుద్యోగ యువత, మహిళలు.. ఇలా సమాజంలో అన్ని వర్గాల వారిని ఆదుకోవడం కోసం అనేక పథకాలు, కార్యక్రమాలు ప్రారంభించాయి. వీటి ద్వారా.. నేరుగా లబ్ధిదారుల ఖాతాలోనే నిధులు జమ చేస్తూ.. అవసరం ఉన్న వారికే సాయం చేస్తున్నాయి. ఇక సామాన్యులు, బడుగు, బలహీన వర్గాల కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల పథకాలు తీసుకొచ్చింది. కానీ మన సమాజంలో చాలా మందికి కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి పూర్తిగా తెలియదు.. అవగాహన కూడా లేదు. అలాంటి ఓ పథకం గురించే ఇప్పుడు మీకు చెప్పబోతున్నాం. ఈ పథకం ద్వారా మీరు ఇంట్లో కూర్చునే.. నెలకు 8 వేల రూపాయలు పొందవచ్చు. ఇంతకు ఆ పథకం ఏంటి.. ఎవరు అర్హులు అంటే..

కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగ యువత కోసం అనేక రకాల పథకాలు తీసుకువచ్చింది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌, ఉన్నత చదువుల కోసం స్కాలర్‌షిప్‌లు అందించడం వంటివి చేస్తోంది. ఈ క్రమంలో నిరుద్యోగ యువత కోసం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఓ పథకం గురించే మీకు చెప్పబోతున్నాం. దీని ద్వారా 10వ తరగతి పాసైన వారైనా సరే.. ఇంట్లోనే ఉంటూ.. నెలకు ఉచితంగా 8 వేలు సంపాదించవచ్చు. ఈ పథకం పేరు ప్రధాన మంత్రి కౌశల్ వికాస స్కీమ్‌. దీన్నే ఇంగ్లీష్‌లో పీఎం స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్ అంటున్నారు.

నిరుద్యోగ యువత తమ నైపుణ్యాలు పెంపొందించుకుని.. ఉపాధి పొందేలా చేయడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. దీని ద్వారా దేశంలోని నిరుద్యోగ యువత, వివిధ రంగాల్లో శిక్షణ (ట్రైనింగ్) తీసుకోవచ్చు. తద్వారా తమ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుని.. కోరుకున్న రంగంలో ఉద్యోగం పొందవచ్చు. ఇక ఈ పథకం ద్వారా ఉచితంగా నెలకు రూ.8,000 చొప్పున ఎలా పొందుతారు అంటే.. మెరుగైన ఉపాధి పొందాలనుకునేవారు.. వారు స్కిల్ ఇండియా డిజిటల్‌పై ప్రాక్టికల్ కోర్సు చేస్తారు. ఈ కోర్స్ చేసిన సమయంలో ప్రతి ఒక్కరికి నెలకు రూ.8 వేలు చొప్పున ఇస్తారు.

ఈ పథకానికి ఎవరు అర్హులంటే..

మీరు ఈ పథకంలో చేరాలంటే.. ఇండియన్‌ అయి ఉండాలి. నిరుద్యోగ యువత కోసమే ఈ పథకాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. దీన్ని స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది. ఈ పథకం ద్వారా దాదాపు 40 విభాగాల్లో శిక్షణ (ట్రైనింగ్) ఇస్తున్నారు. తద్వారా లక్షల మంది యువత, ఇంట్లోనే ఉంటూ తమకు నచ్చిన రంగాల్లో.. ఆన్‌లైన్‌లో శిక్షణ తీసుకుంటున్నారు.

పథకం ద్వారా ఏదైనా స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సు చేసిన వారికి, కోర్సు పూర్తైన తర్వాత కేంద్ర ప్రభుత్వం సర్టిఫికెట్ కూడా ఇస్తుంది. ఇలా రకరకాల కోర్సులు చెయ్యవచ్చు. తద్వారా లబ్ధిదారుడు.. ఇతర నిరుద్యోగుల కంటే వేగంగా ఉద్యోగం పొందేందుకు అవకాశం లభిస్తుంది. ఈ సర్టిఫికెట్ భారతదేశంలో అన్నిచోట్లా చెల్లుబాటు అవుతుంది, తద్వారా యువతకు ఏ రాష్ట్రంలోనైనా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. అంతేకాక ఈ పథకం కింద లబ్ధిదారుడికి టీషర్ట్, జాకెట్, డైరీ, ఐడీ కార్డు, బ్యాగ్ మొదలైన వాటిని కూడా ఇస్తారు. యువత ఇంట్లోనే ఉండి ఈ స్కీమ్‌లో చేరి.. తమ నైపుణ్యాలను మెరుగు పర్చుకుని.. మంచి ఉద్యోగం పొందవచ్చు. దీనికి సంబంధించి మరిన్ని వివరాల కోసం.. https://www.pmkvyofficial.org/home-page  వెళ్లి చూడండి.