iDreamPost

మాదాపూర్, హైటెక్ సిటీ పక్కన 25 లక్షలకే ఫ్లాట్.. మిడిల్ క్లాస్ వారికిదే మంచి ఛాన్స్!

మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి ఏరియాలకు అతి దగ్గరలో 25 లక్షలకే మిడిల్ క్లాస్ వారి కోసం అందుబాటులో మంచి మంచి ఫ్లాట్స్ ఉన్నాయి. ఈ బడ్జెట్ లో మాదాపూర్, హైటెక్ సిటీ లాంటి ఏరియాల్లో ఫ్లాట్ దొరకడమే కష్టం. కానీ వాటికి దగ్గరలో ఉన్న ఈ ఏరియాలో మాత్రం తక్కువ ధరకే ఫ్లాట్స్ దొరుకుతుండడం విశేషం.

మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి ఏరియాలకు అతి దగ్గరలో 25 లక్షలకే మిడిల్ క్లాస్ వారి కోసం అందుబాటులో మంచి మంచి ఫ్లాట్స్ ఉన్నాయి. ఈ బడ్జెట్ లో మాదాపూర్, హైటెక్ సిటీ లాంటి ఏరియాల్లో ఫ్లాట్ దొరకడమే కష్టం. కానీ వాటికి దగ్గరలో ఉన్న ఈ ఏరియాలో మాత్రం తక్కువ ధరకే ఫ్లాట్స్ దొరుకుతుండడం విశేషం.

మాదాపూర్, హైటెక్ సిటీ పక్కన 25 లక్షలకే ఫ్లాట్.. మిడిల్ క్లాస్ వారికిదే మంచి ఛాన్స్!

ఇవాళ మాదాపూర్ లో గానీ, హైటెక్ సిటీలో గానీ, గచ్చిబౌలిలో గానీ ఫ్లాట్ కొనాలంటే కనీసం 50 లక్షలు పెట్టుబడి పెట్టాలి. మాదాపూర్ లో చదరపు అడుగు స్థలం సగటున రూ. 9950గా ఉంది. అంటే ఒక మధ్యతరగతి వ్యక్తి.. 500 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన 1 బీహెచ్కే ఫ్లాట్ కొనుక్కోవాలంటే గనుక 49 లక్షల 75 వేలు అవుతుంది. ఆ తర్వాత గచ్చిబౌలిలో చదరపు అడుగు 10,650 పడుతుంది. ఇక్కడ 1 బీహెచ్కే కొనాలంటే 53 లక్షలు పైనే పెట్టాల్సి వస్తుంది. ఇక హైటెక్ సిటీలో అయితే ఏకంగా చదరపు అడుగు 12,500 ఉంది.

అంటే ఇక్కడ 1 బీహెచ్కే కొనాలంటే దాదాపు 63 లక్షలు అవుతుంది. ఈ ఏరియాల్లో సామాన్యుడు కొనాలన్నా కొనలేని పరిస్థితి. అయితే ఈ ఏరియాలకు అతి దగ్గరలో 25 లక్షల లోపే 1 బీహెచ్కే ఫ్లాట్ అందుబాటులో ఉంది. ఆ ఏరియా మల్లంపేట. ఈ ఏరియా గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీ ఏరియాలకు 18 నుంచి 20 కి.మీ. దూరంలో ఉంది. ఇక్కడ చదరపు అడుగు సగటున రూ. 4650గా ఉంది. ఈ ఏరియాలో ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి చిన్న ఫ్లాట్ కొనుక్కోవాలంటే గనుక 23 లక్షల 25 వేలు అవుతుంది. అటూ ఇటూగా పాతిక లక్షల లోపే 1 బీహెచ్కే ఫ్లాట్ వస్తుంది. 

ఈ ఏరియాలో ఎందుకు కొనాలి?:

ధరల పరంగా మధ్యతరగతి వాళ్లకి బడ్జెట్ లో అందుబాటులో ఉండడం.. అవుటర్ రింగ్ రోడ్ కి 4 కిలోమీటర్ల దూరంలో లొకేషన్ ఉండడం.. అది కూడా సిటీలోని ఇతర ప్రాంతాలకు ఈజీగా వెళ్లేలా రోడ్ కనెక్టివిటీ ఉండడం వంటి కారణాల వల్ల ఇది ఇన్వెస్టర్స్ కి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఈ ఏరియాకి దగ్గరలో పలు స్కూల్స్ ఉన్నాయి. ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ఉన్నాయి. మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ సహా పలు హాస్పిటల్స్, కాలేజీలు ఈ ఏరియాకి అతి దగ్గరలో ఉన్నాయి. పుష్పన్ స్పోర్ట్స్ అకాడమీ, ఎలైట్ స్పోర్ట్స్ అకాడమీ, స్పోర్ట్స్ కల్ట్ అకాడమీ వంటివి చాలా దగ్గరలో ఉండడం ఈ ఏరియా ప్రత్యేకత. గడిచిన పదేళ్లలో మల్లంపేట ఇన్ఫ్రాస్ట్రక్చర్, కనెక్టివిటీ బాగా డెవలప్ అయ్యాయి. ఏటేటా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది బాగా పెరుగుతుంది. మల్లంపేటలో ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశాలు ఉన్న కారణంగా రియల్ ఎస్టేట్ ఏరియాల్లో పెట్టుబడి పెట్టడం వల్ల ఎక్కువ లాభాలు ఆశించవచ్చు. మల్లంపేట ఐటీ సెక్టార్ లో కూడా బోలెడన్ని ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి.   

గమనిక: అంతర్జాలంలో దొరికిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. ధరల్లో మార్పులు ఉండవచ్చు. గమనించగలరు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి