iDreamPost
android-app
ios-app

UIDAI: మారిన ఆధార్ రూల్స్.. ఇక అప్డేట్ చేయడం చాలా కష్టం!

  • Published Nov 26, 2024 | 5:29 PM Updated Updated Nov 26, 2024 | 5:29 PM

UIDAI: ఆధార్ అనేది చాలా ముఖ్యమైన డాక్యుమెంట్. దీన్ని కచ్చితంగా చాలా జాగ్రత్తగా వాడుకోవాలి.

UIDAI: ఆధార్ అనేది చాలా ముఖ్యమైన డాక్యుమెంట్. దీన్ని కచ్చితంగా చాలా జాగ్రత్తగా వాడుకోవాలి.

  • Published Nov 26, 2024 | 5:29 PMUpdated Nov 26, 2024 | 5:29 PM
UIDAI: మారిన ఆధార్ రూల్స్.. ఇక అప్డేట్ చేయడం చాలా కష్టం!

ఆధార్ కార్డు అనేది ఎంత ముఖ్యమైన డాక్యుమెంటో అందరికీ తెలిసిందే. అసలు ఆధార్ కార్డు లేకుండా ఏ పని జరగదు అన్నట్లుగా పరిస్థితులు మారాయి. అలాంటి ఆధార్ కార్డ్ ని కచ్చితంగా చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. అయితే గతంలో ఆధార్ కార్డులో పేరు, అడ్రస్ వంటి వివరాల్లో తప్పులు ఉంటే ఆన్‌లైన్ ద్వారానే ఇంటి నుంచే ఈజీగా అప్డేట్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు అది అంత ఈజీ కాదు. ఎందుకంటే ఇప్పుడు రూల్స్ మారాయి. ఆధార్ కార్డులోని పేరులో ఏవైనా మార్పులు చేయాలంటే రూల్స్ చాలా స్ట్రిక్ట్ గా చేసింది ఆధార్ జారీ సంస్థ UIDAI. ఇక ఆ రూల్స్ ఏంటి? పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) కొత్త రూల్స్ ప్రకారం ఆధార్ కార్డులోని పేరులో ఏవైనా తప్పులు ఉన్నా, ఇంకేమైన స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నా ఇకపై తప్పనిసరిగా గెజెట్ నోటిఫికేషన్ కావాలట. దీంతో పాటుగా ఆధార్ హోల్డర్ పూర్తి పేరును సూచించే మరో గుర్తింపు కార్డును కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అందులో పాన్ కార్డు లేదా ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, సర్వీస్ ఐడీ, పాస్‌పోర్ట్ వంటివి ఇవ్వాలి. ఆధార్ లో పేరులో చాలా మందికి తెలుగు, ఇంగ్లీష్ విషయంలో అక్షరాల్లో తప్పులు వస్తుంటాయి. దీంతో కొన్ని సార్లు కొన్నిప్రభుత్వ పథకాలని కోల్పోవాల్సి వస్తుంది. ఇలాంటి వారందరూ కూడా కచ్చితంగా అన్ని గుర్తింపు కార్డుల్లో ఒకే విధంగా, ఒకే విధమైన అక్షరాలతో కార్డులను అప్డేట్ చేసుకోవాలి. అలాగే ఆధార్ కార్డులో పేరు అప్డేట్ చేసుకోవాలంటే కచ్చితంగా గెజెట్ నోటిఫికేషన్ ఇవ్వాలి.

అయితే ఆధార్ కార్డులో పేరులో తప్పులు సరిచేసుకునేందుకు రూల్స్ స్ట్రిక్ట్ చేసిన UIDAI.. అడ్రస్‌, ఫోన్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ వంటి వాటిని అప్డేట్ చేసేందుకు రూల్స్ కొంచెం ఈజీ చేసింది. అలాగే కొత్త ఆధార్ కావాలనుకునే వారికి కూడా రూల్స్ ఈజీ చేసింది. గతంలో అడ్రస్ ప్రూఫ్‌గా ఇంటి కరెంట్ బిల్, గ్యాస్ బిల్, ఐడీ కార్డు, ఇతర ఐడీ కార్డులను అనుమతించేది. ఇక ఇప్పుడు బ్యాంక్ పాస్ బుక్ ని కూడా అడ్రస్ ప్రూఫ్‌గా ఉపయోగించుకోవచ్చని తెలిపింది. బ్యాంక్ పాస్ బుక్ లోని అడ్రస్ ద్వారా కొత్త ఆధార్ కార్డు అప్లై చేసుకోవడం లేదా, అడ్రస్ మార్చుకోవడం వంటివి చేసుకోవచ్చని తెలిపింది. ఈ విధంగా ఆధార్ అప్డేట్ రూల్స్ మార్చింది UIDAI.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetstarzbetstarzbetStarzbetjojobetgrandpashabetcasibomcasibomcasibombetcio giriş