iDreamPost
android-app
ios-app

EV వినియోగదారులకు గుడ్ న్యూస్.. ఆ వాహనాలన్నిటికీ ఫ్రీ సర్వీస్!

  • Published Jun 08, 2024 | 9:00 PM Updated Updated Jun 08, 2024 | 9:00 PM

Good News To EV Users: ఎలక్ట్రిక్ వాహనాలు వాడేవారికి ప్రముఖ కంపెనీ గుడ్ న్యూస్ చెప్పింది. ఎలక్ట్రిక్ వాహనాల్లో సమస్యలు తలెత్తితే ఎలాంటి ఛార్జీలు వసూలు చేయకుండా ఉచితంగా సర్వీస్ చేస్తామని కంపెనీ హామీ ఇచ్చింది.

Good News To EV Users: ఎలక్ట్రిక్ వాహనాలు వాడేవారికి ప్రముఖ కంపెనీ గుడ్ న్యూస్ చెప్పింది. ఎలక్ట్రిక్ వాహనాల్లో సమస్యలు తలెత్తితే ఎలాంటి ఛార్జీలు వసూలు చేయకుండా ఉచితంగా సర్వీస్ చేస్తామని కంపెనీ హామీ ఇచ్చింది.

EV వినియోగదారులకు గుడ్ న్యూస్.. ఆ వాహనాలన్నిటికీ ఫ్రీ సర్వీస్!

ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ వాహనాలు వాడేవారి సంఖ్య బాగా పెరిగిపోయింది. పెరిగిపోతున్న పెట్రోల్ రేట్లు, పర్యావరణానికి జరుగుతున్న హాని కారణంగా విద్యుత్ వాహనాల వినియోగం ఎక్కువవుతుంది. చాలా కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తున్నాయి. అయితే ఎలక్ట్రిక్ వాహనాలు వాడేవారికి ప్రముఖ కంపెనీ గుడ్ న్యూస్ చెప్పింది. వాహనాల్లో సమస్యలు ఉంటే ఉచితంగా సర్వీస్ అందించనున్నట్లు ప్రకటించింది. మామూలుగా పలు కార్లు, ద్విచక్ర వాహనాల తయారీ సంస్థలు అప్పుడప్పుడు రీకాల్ చేస్తుంటాయి. ఏమైనా సాంకేతిక సమస్యలు గానీ వాహనాలకు సంబంధించి ఇతర సమస్యలు ఏవైనా ఎక్కువ వాహనాల్లో తలెత్తితే కనుక ఆయా కంపెనీలు రీకాల్ చేసి పరిష్కరిస్తుంటాయి.

రీసెంట్ గా మారుతి సుజుకీ కంపెనీ 19 వేలకు పైగా ఈకో మోడల్ కార్లను రీకాల్ చేసింది. గత ఏడాది అయితే 2 మిలియన్ కి పైగా కార్లను రీకాల్ చేసింది టెస్లా కంపెనీ. తాజాగా మరో దిగ్గజ కంపెనీ ద్విచక్ర వాహనాలను రీకాల్ చేసింది. ‘ప్రోయాక్టివ్ ఇన్స్పెక్షన్’ కోసం ఆ కంపెనీ టూవీలర్ వాహనాలను రీకాల్ చేస్తుంది. వాహనాల సామర్థ్యం ఎలా ఉందో నిర్ధారించుకోవడం కోసం బ్రిడ్జ్ ట్యూబ్ తనిఖీ చేపట్టారు. ప్రముఖ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను రీకాల్ చేస్తున్నట్లు టీవీఎస్ మోటార్ కంపెనీ ప్రకటించింది. ప్రోయాక్టివ్ ఇన్స్పెక్షన్ కోసం ఐక్యూబ్ మోడల్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ని రీకాల్ చేస్తున్నామని.. వెహికల్స్ సామర్థ్యం ఎలా ఉందో నిర్ధారించుకోవడం కోసం బ్రిడ్జ్ ట్యూబ్ తనిఖీ చేస్తున్నామని కంపెనీ తెలిపింది. ఏదైనా సమస్యలు ఉంటే ఉచితంగానే సర్వీస్ అందిస్తామని.. ఎలాంటి ఛార్జీలు వసూలు చేయమని తెలిపింది. అయితే కస్టమర్లు కంగారు పడాల్సిన అవసరం లేదని.. ఇందుకు సంబంధించి డీలర్లు పర్సనల్ గా వారిని సంప్రదిస్తారని కంపెనీ పేర్కొంది.

అయితే అన్ని వాహనాలకు కాకుండా కేవలం 2023 జూలై 10 నుంచి 2023 సెప్టెంబర్ 9 మధ్య తయారైన వాహనాలను మాత్రమే రీకాల్ చేస్తున్నట్లు టీవీఎస్ మోటార్ కంపెనీ పేర్కొంది. ఈ నెలల మధ్య తయారైన ఎలక్ట్రిక్ వాహనాల్లో ప్రోయాక్టివ్ ఇన్స్పెక్షన్ కోసం రీకాల్ చేస్తుంది టీవీఎస్ కంపెనీ. ఏమైనా సమస్యలు ఉంటే ఉచితంగానే రిపేర్ చేసి ఇస్తుంది. వాహనం యొక్క రైడ్ హ్యాండ్లింగ్ బాగుంది అని నిర్ధారించుకోవడం కోసమే కంపెనీ రీకాల్ ప్రకటించింది. ఇక గత నెలలో టీవీఎస్ కంపెనీ ఐక్యూబ్ కొత్త వెర్షన్ ని లాంఛ్ చేసింది. దీని ధర రూ. 94,999. టీవీఎస్ ఐక్యూబ్ మొత్తం మూడు మోడల్స్ లో వచ్చింది. ఐక్యూబ్, ఐక్యూబ్ ఎస్, ఐక్యూబ్ ఎస్టీ. ఇందులో 5 రకాలు ఉన్నాయి. టీవీఎస్ ఐక్యూబ్ 2.2 కిలోవాట్, టీవీఎస్ ఐక్యూబ్ ఎస్, ఐక్యూబ్ ఎస్టీ 3.4 కిలోవాట్ సామర్థ్యంతో వస్తుండగా.. టీవీఎస్ ఐక్యూబ్ 5.1 కిలోవాట్, టీవీఎస్ ఐక్యూబ్ 3.4 కిలోవాట్ సామర్థ్యంతో వస్తున్నాయి.