iDreamPost
android-app
ios-app

ఎంతోమంది తల్లుల హృదయాలు గెలుచుకున్న టప్పర్ వేర్ ఇక ఉండబోదు.. ఎందుకంటే?

  • Published Sep 18, 2024 | 6:55 PM Updated Updated Sep 18, 2024 | 6:55 PM

Tupperware: ప్లాస్టిక్ వస్తువుల్నితయారు చేసే సంస్థలు ఎన్ని ఉన్నప్పటికీ.. నాణ్యతతోపాటు.. ఆహారాన్ని నిల్వ ఉంచుకోవటానికి అత్యుత్తమ ప్లాస్టిక్ తో వస్తువుల్ని తయారు చేసే సంస్థగా టప్పర్ వేర్ కు ప్రత్యేక ప్రసిద్ధి ఉంది. అయితే దశాబ్దా కాలంగా మార్కెట్ లో ఓ వెలుగు వెలుగుతున్న ఈ టప్పర్ వేర్ కంపెనీ తాజగా దివాళా తీసిందనే నమ్మలేని నిజం ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఆ వివరాలేంటో చూద్దాం.

Tupperware: ప్లాస్టిక్ వస్తువుల్నితయారు చేసే సంస్థలు ఎన్ని ఉన్నప్పటికీ.. నాణ్యతతోపాటు.. ఆహారాన్ని నిల్వ ఉంచుకోవటానికి అత్యుత్తమ ప్లాస్టిక్ తో వస్తువుల్ని తయారు చేసే సంస్థగా టప్పర్ వేర్ కు ప్రత్యేక ప్రసిద్ధి ఉంది. అయితే దశాబ్దా కాలంగా మార్కెట్ లో ఓ వెలుగు వెలుగుతున్న ఈ టప్పర్ వేర్ కంపెనీ తాజగా దివాళా తీసిందనే నమ్మలేని నిజం ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఆ వివరాలేంటో చూద్దాం.

  • Published Sep 18, 2024 | 6:55 PMUpdated Sep 18, 2024 | 6:55 PM
ఎంతోమంది తల్లుల హృదయాలు గెలుచుకున్న టప్పర్ వేర్ ఇక ఉండబోదు.. ఎందుకంటే?

‘టప్పర్ వేర్’ కంపెనీ.. పేరుకు అమెరికన్ కంపెనీ అయినా, ఇండియాలో ఈ కంపెనీ బాక్స్ లకు ఉండే డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఈ డబ్బాలు లేని ఇల్లు అంటూ ఏదీ ఉండదు. ఎందుకంటే.. వంట ఇంటి దగ్గర మొదలు.. స్కూల్, కాలేజీ, ఆఫీసులకు వెళ్లిన వారందరూ ఈ టప్పర్ బాక్సులను ఎక్కువగా వినియోగిస్తుంటారు. పేరకు ప్లాస్టిక్ బాక్స్ అయిన ఈ టప్పర్ బాక్స్ ధర ఎక్కువే కానీ, క్వాలిటీ కి ఏమాత్రం తక్కువ కాదనీ చెప్పవచ్చు.మరి అంతలా ఐకానిక్ కిచెన్ వేర్ కు ప్రసిద్ధిగా ఈ టప్పర్ బాక్స్ నిలిచింది. అయితే దశాబ్దా కాలంగా మార్కెట్ లో ఓ వెలుగు వెలుగుతున్న ఈ టప్పర్ వేర్ కంపెనీ తాజగా దివాళా తీసిందనే నమ్మలేని నిజం ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఇంతకీ ఈ టప్పర్ వేర్ కంపెనీ నిజంగా దివాళా తీసిందా, దానిక కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్లాస్టిక్ వస్తువుల్నితయారు చేసే సంస్థలు ఎన్ని ఉన్నప్పటికీ.. నాణ్యతతోపాటు.. ఆహారాన్ని నిల్వ ఉంచుకోవటానికి అత్యుత్తమ ప్లాస్టిక్ తో వస్తువుల్ని తయారు చేసే సంస్థగా టప్పర్ వేర్ కు ప్రత్యేక ప్రసిద్ధి ఉంది. అయితే 1946లో కెమికల్ సైంటిస్టు ఎర్ల్ టప్పర్ స్థాపించిన ఈ కంపెనీ 1950లలో అధిక ప్రజాదరణ పొందింది. ఈ క్రమంలోనే.. కరోనా మహమ్మారి వరకు ఈ టప్పర్ వేర్ సంస్థ ఉత్పత్తులు సజావుగా సాగాయి. అయితే ఆ తర్వాత నుంచి ఈ సంస్థ ఉత్పత్తులు విక్రయాలు క్రమంగా తగ్గుముఖం పడ్డాయి.

ఎందుకంటే.. పెరుగుతున్న ముడిసరకుల ధరలు,అధిక వేతనాలు,రవాణా ఖర్చులు ఇలా అన్ని రకాలుగా సంస్థ ఆర్థికంగా పూర్తిగా దెబ్బతిన్నది. ఈ క్రమంలోనే.. టప్పర్‌వేర్ బ్రాండ్స్ మొదట ఉద్యోగుల తొలగింపునకు కారణమై ఆ తర్వాత ఇప్పుడు తాజాగా దివాల తీసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు టప్పర్ వేర్ కంపెనీ ఈ విషయం పై ఓ ప్రకటనను కూడా జారీ చేసింది. అయితే అందులో దివాలా తీసే ప్రక్రియ సమయంలో మా విలువైన కస్టమర్లకు అత్యుత్తమ సేవలను అందించాలనుకుంటున్నాం. ఇక ఈ వ్యాపారాన్ని విక్రయించడానికి తగిన ప్రక్రియ కోసం కోర్డు అనుమతి కోరుతామని వివరించింది. అయితే ఎన్నో ఏళ్లుగా ఇండియాలోని అత్యంత ప్రజాదరణ పొందిన బ్రాండెడ్ టాప్ కంపెనీ టప్పర్ వేర్ ఇలా దివాళా తీయడంపై నెట్టింట రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి, ఈ టప్పర్ వేర్ కంపెనీ దివాళ తీసేందుకు సిద్ధంగా ఉండటం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.