Triumph 400: రెండు కొత్త ట్రయంఫ్ 400 బైక్స్‌ని లాంచ్ చేయనున్న బజాజ్ కంపెనీ!

Bajaj To Launch Triumph Speed 400, Triumph Scrambler 400 X Bikes: బజాజ్ కంపెనీ, ట్రయంఫ్ కంపెనీ భాగస్వామ్యంతో రెండు సరికొత్త బైక్స్ ని లాంచ్ చేసింది. ఇన్నాళ్లు మామూలు మధ్యతరగతి వ్యక్తులకు అందని ద్రాక్షలా ఉన్న ట్రయంఫ్ బైక్ ఇప్పుడు అందరికీ అందుబాటు ధరకే వస్తుంది. 3 లక్షల లోపు ధరకే వస్తుండడం ఇప్పుడు ట్రయంఫ్ ఫ్యాన్స్ అనందానికి హద్దులు లేకుండా పోయింది.

ట్రయంఫ్ మోటార్ సైకిల్ చాలా స్టైలిష్ గా, రాయల్ గా ఉంటుంది. దీన్ని నడపాలని ఎంతోమందికి ఉంటుంది. కానీ దీన్ని అందరూ నడపలేరు. ఎందుకంటే ఇది ప్రీమియం బైక్. దీని ధర లక్షల్లో ఉంటుంది. దీనికి పెట్టే బడ్జెట్ తో టాటా నెక్సాన్, మహీంద్రా థార్ వంటి కార్లు కొనుక్కోవచ్చు. 10 లక్షల నుంచి 20 లక్షల వరకూ ఉంటాయి. అంత ఖరీదైన బైక్ ఇప్పుడు సాధారణ ఫ్యాన్స్ కోసం బడ్జెట్ ధరకే అందుబాటులోకి వచ్చింది. బజాజ్ ఆటో కంపెనీ ట్రయంఫ్ మోటార్ సైకిల్స్ కంపెనీతో జతకట్టిన తర్వాత ఈ ప్రీమియం బైక్ ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వస్తుంది. ముఖ్యంగా మిడిల్ క్లాస్ వారికి. 

బజాజ్ ఆటో, ట్రయంఫ్ మోటార్ సైకిల్స్ కంపెనీల మధ్య జరిగిన వ్యూహాత్మక భాగస్వామ్యంలో భాగంగా కొత్త 400 ప్లాట్ ఫార్మ్ కి దారి తీసింది. ఈ ప్లాట్ ఫార్మ్ మీద ట్రయంఫ్ సరసమైన ధరలకే రెండు కొత్త సింగిల్ సిలిండర్ బైక్స్ ని లాంఛ్ చేసింది. స్పీడ్ 400, స్క్రాంబ్లర్ 400 ఎక్స్ బైక్స్ ని లాంచ్ చేసింది. నెలకు 10 వేల యూనిట్లను అమ్మే ప్రణాళికతో బజాజ్, ట్రయంఫ్ కంపెనీలు సిద్ధమయినట్లు తెలుస్తోంది. అక్టోబర్ 2024 నాటికి 10 వేల ట్రయంఫ్ బైక్స్ ని తయారు చేసేలా ప్రణాళికలు చేస్తున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి.ట్రయంఫ్ స్పీడ్ 400 ఎక్స్ షోరూం ధర రూ. 2,24,496 కాగా.. ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 400 ఎక్స్ ఎక్స్ షోరూం ధర రూ. 2,54,495గా కంపెనీ నిర్ణయించింది. 

ట్రయంఫ్ స్పీడ్ 400 స్పెసిఫికేషన్స్:

  • ఇంజన్ టైప్: లిక్విడ్ కూల్డ్, 4 వాల్వ్, డీఓహెచ్సీ, సింగిల్ సిలిండర్
  • ఇంజన్ సామర్థ్యం: 398.15 సీసీ ఇంజిన్ 
  • బోర్: 89.0 ఎంఎం 
  • స్ట్రోక్: 64.0 ఎంఎం 
  • కంప్రెషన్: 12:1
  • మ్యాక్స్ పవర్ ఈసీ: 40 పీఎస్/ 39.5 బీహెచ్పీ (29.4 కేడబ్ల్యూ) @ 8000 ఆర్పీఎం 
  • మ్యాక్స్ టార్క్ ఈసీ: 37.5 ఎన్ఎం @ 6,500 ఆర్పీఎం 
  • ఫైనల్ డ్రైవ్: ఎక్స్-రింగ్ చైన్
  • క్లచ్: వెట్, మల్టీ-ప్లేట్, స్లిప్
  • గేర్ బాక్స్: 6 స్పీడ్

ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 400 ఎక్స్ స్పెసిఫికేషన్స్:

  • ఇంజన్ టైప్: లిక్విడ్ కూల్డ్, 4 వాల్వ్, డీఓహెచ్సీ, సింగిల్ సిలిండర్
  • ఇంజన్ సామర్థ్యం: 398.15 సీసీ ఇంజిన్ 
  • బోర్: 89.0 ఎంఎం 
  • స్ట్రోక్: 64.0 ఎంఎం 
  • కంప్రెషన్: 12:1
  • మ్యాక్స్ పవర్ ఈసీ: 40 పీఎస్/ 39.5 బీహెచ్పీ (29.4 కేడబ్ల్యూ) @ 8000 ఆర్పీఎం 
  • మ్యాక్స్ టార్క్ ఈసీ: 37.5 ఎన్ఎం @ 6,500 ఆర్పీఎం 
  • ఫైనల్ డ్రైవ్: ఎక్స్-రింగ్ చైన్
  • క్లచ్: వెట్, మల్టీ-ప్లేట్, స్లిప్
  • ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ: 13 లీటర్లు 
  • బరువు: 185 కిలోలు
  • గేర్ బాక్స్: 6 స్పీడ్

ఈ రెండు మోడల్స్ ఒకే స్పెసిఫికేషన్స్ తో వస్తున్నాయి. డిజైన్ లు డిఫరెంట్ గా ఉన్నాయి. ఈ బైక్స్ మీద కంపెనీ ప్రత్యేక ఆఫర్ ని కూడా ఇస్తుంది. ఈ బైక్ ని ఆన్ లైన్ లో బుక్ చేసుకుంటే ప్రత్యేక యానివర్సరీ ఆఫర్ కింద ఎక్స్ షోరూం ధర మీద 10 వేల రూపాయలు తగ్గుతుంది. ఈ బైక్ ని 10 వేల రూపాయలతో బుక్ చేసుకోవచ్చు. ఈ బైక్ ని ఆగస్టు 31 లోపు బుక్ చేసుకోవాలి. ఆ తర్వాత బుకింగ్ క్లోజ్ అయిపోతుంది. 

Show comments