Dharani
TRAI New Rules-Service Outage: టెలికాం కంపెనీల ఆటలకు చెక్ పెట్టేందుకు ట్రాయ్ రంగంలోకి దిగింది. ఇకపై సిగ్నల్ కట్ అయితే.. భారీగా నష్టపరిహారం చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది. ఆ వివరాలు..
TRAI New Rules-Service Outage: టెలికాం కంపెనీల ఆటలకు చెక్ పెట్టేందుకు ట్రాయ్ రంగంలోకి దిగింది. ఇకపై సిగ్నల్ కట్ అయితే.. భారీగా నష్టపరిహారం చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది. ఆ వివరాలు..
Dharani
టెలికాం కంపెనీలకు చెక్ పెట్టేందుకు టెలికాం నియంత్రణ ప్రాధికార సంస్థ ట్రాయ్ రంగంలోకి దిగుతోంది. ఇప్పటికే పెరిగిన రీఛార్జ్ ప్లాన్ ధరలకు కళ్లెం వేయడానికి.. డేటా, ఎస్‌ఎంఎస్‌లు, వాయిస్ కాలింగ్‌కు ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్స్ తీసుకువచ్చే యోచనలో ఉంది. దీనిపై వినియోగదారులు తమ అభిప్రాయాలను తెలపాలని ట్రాయ్ కోరింది. ఇలా ఉండగానే తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది ట్రాయ్. ఇది అమల్లోకి వస్తే.. ఇకపై టెలికాం కంపెనీలు.. వినియోగదారులకు భారీ మొత్తంలో పరిహారం చెల్లించాల్సి వస్తుంది. ఇంతకు ట్రాయ్ దేనికి సంబంధించి ఇలాంటి నిర్ణయం తీసుకుంది.. అది ఎప్పటి నుంచి అమల్లోకి రానుంది.. వంటి వివరాలు మీకోసం..
టెలికాం యూజర్లకు కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. టెలికాం నియంత్రణ ప్రాధికార సంస్థ ట్రాయ్.. టెలికాం కంపెనీల ఆట కట్టించేందుకు రెడీ అవుతోంది. సదరు కంపెనీలు తప్పనిసరిగా పాటించాల్సిన కొత్త నిబంధనలను తాజాగా విడుదల చేసింది. దీని ప్రకారం.. సిగ్నల్ సమస్యల వల్ల టెలికాం సేవల్లో అంతరాయం ఏర్పడితే.. ఆయా కంపెనీలు.. వినియోగదారులకు భారీ మొత్తంలో పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. కొత్త రూల్స్ ప్రకారం జిల్లా స్థాయిలో నెట్‌వర్క్ సేవల్లో అంతరాయం ఏర్పడితే.. పోస్ట్ పెయిడ్ కస్టమర్లకు అయితే రిబేట్ ఇవ్వాల్సి ఉంటుంది. అదే ప్రీపెయిడ్ వినియోగదారులకైతే.. కనెక్షన్ చెల్లుబాటు గడువు పెంచాల్సి ఉంటుంది. అంతేకాక నెట్‌వర్క్‌లో 24 గంలకు పైగా అంతరాయం కలిగితే.. సర్వీసు ప్రొవైడర్లు చెల్లించే ఛార్జీలపై కొత భాగాన్ని రిబేట్ ఇవ్వాలి. అంతేకాక పోస్ట్ పెయిడ్ వినియోగదారులకైతే వచ్చే బిల్లులో వాటిని చూపించాలి.
12 గంటలకు పైగా సిగ్నల్‌లో అంతరాయం ఏర్పడితే.. చెల్లించిన ఛార్జీల్లో రిబేట్ లేదా వ్యాలిడిటీ కొనసాగింపు చేయాల్సి ఉంటుంది. అంతేకాక వారం రోజుల్లోగా టెలికాం సేవలను పునరుద్దరించాలి.. లేదంటే భారీగా పరిహారం చెల్లిచాల్సి వస్తుంది. అయితే ఇందుకు కొన్ని మినహాయింపులు ఇచ్చింది ట్రాయ్. ప్రకృతి వైరీత్యాలు ఏర్పడినప్పుడు మాత్రం సిగ్నల్ సమస్యలపై పెనాల్టీ నుంచి మినహాయింపు ఉంటుంది. గతంలో నాణ్యతా ప్రమాణాలను పాటించడంలో టెలికాం కంపెనీలు విఫలం అయితే.. 50 వేల రూపాయల జరిమానా విధించేది. కొత్త నిబంధనల ప్రకారం దాన్ని రూ.లక్షలకు పెంచింది ట్రాయ్. తాజా నిబంధనల ప్రకారం ఉల్లంఘనలకు పాల్పడితే.. గ్రేడ్ ప్రకారం పరిహారం చెల్లించాల్సి వస్తుంది.
అంటే ట్రాయ్ తీసుకువచ్చిన కొత్త నిబంధనలను ఉల్లంఘిస్తే.. కంపెనీలపై గ్రేడింగ్ ప్రకారం.. రూ.లక్ష, 2, 5, 10 లక్షల వరకు పెనాల్టీలు విధిస్తారు. అంతేకాక టెలికాం కంపెనీలు తమ నెట్‌వర్క్‌లోని వైఫల్యానికి మూడు రోజుల్లోగా పరిష్కారం చూపాలి. ఇదే కాక బ్రాడ్ బ్యాండ్ సర్వీసు ప్రొవైడర్లకు సంబంధించి.. చెల్లింపు చేసిన 7 రోజుల్లోగా 98 శాతం కనెక్లన్లు యాక్టివేట్ చేయాలి. మరో ఆరు నెలల తర్వాత ఈ కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి.