iDreamPost
android-app
ios-app

ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవాలా? ఏ బ్యాంక్ ఎంత వడ్డీ వేస్తుందో తెలుసుకోండి!

  • Published Jun 21, 2024 | 10:30 PM Updated Updated Jun 21, 2024 | 10:30 PM

Banks Wise Interest Rates On Education Loan: ఉన్నత చదువుల కోసం ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఈ విద్యా రుణాలపై ఏ బ్యాంకు ఎంత వడ్డీ వేస్తుందో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దేశంలో టాప్ బ్యాంకులు ఎడ్యుకేషన్ లోన్ పై ఎంత వడ్డీ రేటు వేస్తుందో తెలుసుకోండి.

Banks Wise Interest Rates On Education Loan: ఉన్నత చదువుల కోసం ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఈ విద్యా రుణాలపై ఏ బ్యాంకు ఎంత వడ్డీ వేస్తుందో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దేశంలో టాప్ బ్యాంకులు ఎడ్యుకేషన్ లోన్ పై ఎంత వడ్డీ రేటు వేస్తుందో తెలుసుకోండి.

  • Published Jun 21, 2024 | 10:30 PMUpdated Jun 21, 2024 | 10:30 PM
ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవాలా? ఏ బ్యాంక్ ఎంత వడ్డీ వేస్తుందో తెలుసుకోండి!

ఇంజనీరింగ్, డిగ్రీ కాలేజీల్లో జాయిన్ అవ్వాలనుకునే విద్యార్థులకు ఆ సమయం వచ్చేసింది. పెరిగిపోయిన ఫీజులకు సొంతంగా డబ్బు తెచ్చి ఫీజు కట్టే పరిస్థితి సామాన్య, మధ్యతరగతి వ్యక్తులకు లేదు. అందుకే బ్యాంకుల్లో లోన్లు తీసుకోవాలని అనుకుంటారు. పెద్ద పెద్ద విద్యాసంస్థల్లో చదువుకుని ఉన్నత శిఖరాలను అధిగమించాలని కోరుకునే ప్రతి విద్యార్థికీ ఈ ఎడ్యుకేషన్ లోన్ ఎంతగానో ప్రయోజనం చేకూరుస్తున్నాయి. అయితే ఈ లోన్ మీద బ్యాంకులు విధించే వడ్డీ రేట్లు తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఎడ్యుకేషన్ లోన్ ఇచ్చే బ్యాంకులు.. విద్యార్థులు చేరే కాలేజీ, కోర్సు, ఫీజులకు అయ్యే ఖర్చులు, అకడమిక్ రికార్డులు వంటివి చూస్తాయి. అలానే కుటుంబ వార్షిక ఆదాయం, ఆస్తులను తనిఖీ చేస్తాయి.

అర్హత ఉన్న విద్యార్థులకు ప్రభుత్వ బ్యాంకులు తక్కువ వడ్డీ రేట్లతో ఎడ్యుకేషన్ లోన్లను ఇస్తున్నాయి. ప్రభుత్వ రంగ యూనియన్ బ్యాంకులో ఎడ్యుకేషన్ లోన్ పై వార్షిక వడ్డీ 8.10 శాతం నుంచి 12.50 శాతంగా ఉంది. ఎస్బీఐలో 8.15 శాతం నుంచి 11.75 శాతంగా వడ్డీ రేటు ఉంది. బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఎడ్యుకేషన్ లోన్ పై 8.15 శాతం నుంచి 13.70 శాతం వడ్డీ రేటు పడనుంది. కెనరా బ్యాంకులో ఎడ్యుకేషన్ లోన్ పై వార్షిక వడ్డీ 9.25 శాతంగా ఉంది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో వార్షిక వడ్డీ 8.10 శాతం నుంచి 11.95 శాతంగా ఉంది. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకు 10 శాతం నుంచి 15 శాతం వరకూ వార్షిక వడ్డీతో ఎడ్యుకేషన్ లోన్ ని అందిస్తుంది.

దేశీయ దిగ్గజ ప్రైవేట్ బ్యాంకు అయిన హెచ్డీఎఫ్సీ బ్యాంకులో ఎడ్యుకేషన్ లోన్ పై 9.50 శాతం నుంచి వడ్డీ రేట్లు వసూలు చేస్తున్నాయి. ఐసీఐసీఐ బ్యాంకులో 9.85 శాతం వార్షిక వడ్డీ ఉండగా.. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో 9.75 శాతం నుంచి 13 శాతంగా ఉన్నాయి వడ్డీ రేట్లు. కర్ణాటక బ్యాంకులో ఎడ్యుకేషన్ లోన్ పై 10.48 శాతం వడ్డీ రేట్లు ఫిక్స్ చేసింది. ఇవే ఇతర బ్యాంకులతో పోలిస్తే ఉన్నత చదువులు చదివే విద్యార్థులకు కాస్త తక్కువ వడ్డీకి ఎడ్యుకేషన్ లోన్లు ఇచ్చే బ్యాంకులు. ఇంతకంటే తక్కువ వడ్డీకి లోన్లు ఇచ్చే బ్యాంకులు ఉంటాయి. లోన్ తీసుకునే ముందు ఏ బ్యాంకు తక్కువ వడ్డీ ఇస్తుందో తెలుసుకోవడం మంచిది. సిబిల్ స్కోర్ ని బట్టి కూడా వడ్డీ రేటు అనేది తగ్గుతుంది.