iDreamPost
android-app
ios-app

రూ.50 బ్రాండెడ్ షూస్! ఆర్డర్ పెట్టాక కథలో అసలు ట్విస్ట్!

నేటికాలంలో మనందరికీ కావాల్సింది బ్రాండ్. మరీ ముఖ్యంగా యువతకు, కాలేజీ విద్యార్థులకి విపరీతమైన క్రేజ్. వీళ్ళనే టార్గెట్ గా చేసుకుని వివిధ బ్రాండ్స్ కూడా అదిరిపోయే డీల్స్, డిస్కౌంట్స్ తో ఆకర్షిస్తుంటాయి.

నేటికాలంలో మనందరికీ కావాల్సింది బ్రాండ్. మరీ ముఖ్యంగా యువతకు, కాలేజీ విద్యార్థులకి విపరీతమైన క్రేజ్. వీళ్ళనే టార్గెట్ గా చేసుకుని వివిధ బ్రాండ్స్ కూడా అదిరిపోయే డీల్స్, డిస్కౌంట్స్ తో ఆకర్షిస్తుంటాయి.

రూ.50 బ్రాండెడ్ షూస్! ఆర్డర్ పెట్టాక కథలో అసలు ట్విస్ట్!

ఈ కాలంలో మనందరికీ కావాల్సింది బ్రాండ్. మరీ ముఖ్యంగా యూత్, కాలేజీ స్టూడెంట్స్ కి విపరీతమైన క్రేజ్. వీళ్ళనే టార్గెట్ గా చేసుకుని బ్రాండ్స్ కూడా అదిరిపోయే డీల్స్, డిస్కౌంట్స్ తో ఆకర్షిస్తుంటాయి. అలాగే.. పలువురు ఇన్ఫ్లుయెన్సుర్స్ తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో లూట్ డీల్స్ అంటూ ప్రత్యేక కేటలాగును ఏర్పాటు చేస్తుంటారు. తాజాగా రూ.50 కే బ్రాండెడ్ షూస్ అంటూ ఓ డీల్ బాగా ట్రెండ్ అవుతోంది. అదేదో ఫేక్ వెబ్ సైట్లో కూడా కాదు. అందరికి అందుబాటులో ఉండే జియో మార్ట్ లో. యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సుర్ల టెలిగ్రామ్ ఛానెల్ నుంచి ఈ వార్త వినగానే యూత్ తెగపడి ఆర్డర్లు పెట్టారు. ముఖ్యంగా ఏషియన్ బ్రాండ్ తో పాటు .. ఇతర స్నికర్స్ ఎక్కువగా కనిపించాయి. ఆర్డర్స్ యాక్సెప్ట్ కూడా అయ్యాయి. అయితే.., తర్వాత కొన్ని ఏరియాల్లోకి నాట్ అవెలబుల్ అప్షన్ చూపెట్టింది. ఇక మిగతా ఆర్డర్లు ఆటోమేటిక్ గా క్యాన్సిల్ అయ్యాయి. దీంతో అర్దర్లు పెట్టిన వాళ్లంతా ఒక్కసారిగా కంగుతిన్నారు. రిఫండ్ పొందినా కూడా ఇది ఒక స్కామ్ గా భావించారు.

ఇక ఈ వార్తను అందించిన యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సుర్ల పై ట్రోల్స్ మొదలయ్యాయి. దీంతో.. నెక్స్ట్ డే వారు వివరణలు ఇచ్చుకోవడానికి సరిపోయింది. అలాగే ఒక్క రూపాయికే షర్ట్ అంటూ ఇటీవలే ఓ డీల్ చెక్కర్లు కొట్టింది. అదికూడా ఇలానే మాయమైపోయింది.నిజానికి ఇలాంటి డీల్స్ స్కామ్ అయినా.. అవ్వకపోయినా యూత్ ఒక అవగాహన కలిగి ఉండటం మంచిది. అసలే ఈ డిజిటల్ యుగంలో స్కామ్స్, ఫ్రాడ్స్ కి కొదవలేదు. ముఖ్యంగా మిడిల్ క్లాస్, కాలేజీ స్టూడెంట్స్ వీటికి బలవుతున్నారు. అవసరాలు, ఆశలు మితిమీరిన పోకడలకు దారితీయడమే కాక.. కొందరి మోసగాళ్ల ట్రాప్ లో పడుతున్నారు. క్రెడిబిల్ సోర్స్ ఏదో కచ్చితంగా తెలుసుకొనే బేసిక్ అవేర్నెస్ కలిగి ఉండటం తప్పని సరి. ఏ వస్తువైనా డెడ్ చీప్ గా వచ్చే అవకాశం లేదు అని తెలుసుకోవడం వెరీ ఇంపార్టెంట్.

కొందరు మన అకౌంట్లో డబ్బులు ఏమి లేవు.. మనల్ని ఎవ్వరూ చీట్ చేయలేరు అనే కాన్ఫిడెన్స్ తో ఉంటారు. నిజానికి అసలు మోసం అక్కడే జరుగుతుంది. వీళ్ళు డేటాను చోరీ చేసి మీ కొంప ముంచుతారు. మన దగ్గర ఏం డేటా ఉందిలే అనుకోవటం మరో పెద్ద పొరపాటు. చదువుకునే యువత ప్యాకెట్ మనీ, తమ పేరెంట్స్ ఫైనాన్షియల్ స్థాయిని బట్టి మెసులుకోవటం ఉత్తమం. ఈ స్థితిలో ఉండలేక కొందరు అధిక వడ్డీలకు లోన్ యాప్స్ కి బలి అవుతున్నారు. పేరెంట్స్ కూడా తమ పిల్లల అవసరాలను దృష్టిలో పెట్టుకోవడం ద్వారా మంచి బంధాలతో పాటు ఎలాంటి స్క్యామ్స్ కి గురవకుండా తమ పిల్లలను కాపాడుకోవచ్చు.