Keerthi
తాజాగా బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఓ బ్యాడ్‌న్యూస్. ఎందుకంటే గత పది రోజులుగా వరుసగా దిగివచ్చిన బంగారం ధరలు ఇవాళ మళ్లీ పెరిగాయి. అయితే నేడు తులం బంగారం ధర ఎంతంటే..
తాజాగా బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఓ బ్యాడ్‌న్యూస్. ఎందుకంటే గత పది రోజులుగా వరుసగా దిగివచ్చిన బంగారం ధరలు ఇవాళ మళ్లీ పెరిగాయి. అయితే నేడు తులం బంగారం ధర ఎంతంటే..
Keerthi
ఇటీవల కాలంలో బంగారం కొనుగోలు చేయాలనుకునే పసిడి ప్రియులకు ధరలు ఏ స్థాయిలో కొండెక్కి కూర్చుంటున్నయో అందరికి తెలిసిందే. ముఖ్యంగా ఈ ఏడాది మార్చి, ఏపప్రిల్ నుంచి బంగారం ధరలు క్రమంగా పెరుగుతూ సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఈ క్రమంలోనే తగ్గుతూ పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. అయితే గత పది రోజులుగా బంగారం ధరలు భారీగా దిగివచ్చి పసిడి ప్రియులకు ఊరటనిచ్చిన విషయం తెలిసిందే. కానీ, తాజాగా బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఓ బ్యాడ్ న్యూస్ అనే చెప్పవచ్చు. ఎందుకంటే నేడు బంగారం ధర ఒక్కసారిగా పెరిగిపోయింది. కాగా, నేడు తులం బంగారం ధర ఎంతో తెలుసుకుందాం.
తాజాగా బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఓ బ్యాడ్‌న్యూస్. ఎందుకంటే.. గత పది రోజులుగా వరుసగా దిగివచ్చిన బంగారం ధరలు ఇవాళ మళ్లీ పెరిగాయి. పైగా నేడు తులం బంగారం రేటు రూ.250 వరకు పెరిగింది. అయితే అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు పెరగడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.ఇలా వరుసగా ధరలు తగ్గడంతో గిరాకీ సైతం పెరిగినట్లు సమాచారం. ఈ క్రమంలోనే నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.200 పెరగ్గా, 24 క్యారెట్లపై రూ.220కు పెరిగింది. అయితే అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు మళ్లీ రికార్డ్ స్థాయికి పరుగులు పెడుతున్నాయి. కాగా, నేడు బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,850గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,930 వద్ద కొనసాగుతోంది.
ఇక తెలుగు రాష్ట్రాల్లో నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.66,850 వద్ద ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,930గా నమోదైంది. అలాగే ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,000గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.73,080గా కొనసాగుతుంది. దీంతో పాటు ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.66,850 కొనసాగగా.. 24 క్యారెట్ల ధర రూ.72,930గా నమోదైంది. అయితే బెంగళూరు, కోల్‌కతా, కేరళలలో 22 క్యారెట్ల ధర రూ.66,850 వద్ద ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.72,930గా నమోదైంది.
వీటితో పాటు మరోవైపు వెండి ధరలు కూడా నేడు భారీగా పెరిగాయి.అయితే నేడు కిలో వెండిపై ఏకంగా రూ.3,500 పెరిగింది. ఇక బులియన్ మార్కెట్‌లో నేడు కిలో వెండి ధర రూ.96,500గా ఉంది. అలాగే ఢిల్లీలో నేడు కిలో వెండి ధర రూ.96,500 ఉండగా.. ముంబైలో రూ.96,500గా ఉంది. వీటితో పాటు చెన్నైలో కిలో వెండి రూ.1,01,000లుగా నమోదుకాగా, అత్యల్పంగా బెంగళూరులో రూ.93,250గా ఉంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో (హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం) కిలో వెండి ధర రూ.1,01,000లుగా నమోదైంది.