iDreamPost
android-app
ios-app

పసిడి ప్రియులకు శుభవార్త.. వరుసగా రెండో రోజు దిగి వచ్చిన బంగారం ధర

  • Published Sep 23, 2023 | 8:14 AM Updated Updated Sep 23, 2023 | 8:14 AM
  • Published Sep 23, 2023 | 8:14 AMUpdated Sep 23, 2023 | 8:14 AM
పసిడి ప్రియులకు శుభవార్త.. వరుసగా రెండో రోజు దిగి వచ్చిన బంగారం ధర

పసిడి ప్రియులకు పండగలాంటి వార్త. గత వారం, పది రోజులుగా పెరుగుతూ వస్తోన్న బంగారం ధర క్రితం సెషన్‌లో భారీగా దిగి వచ్చిన సంగతి తెలిసిందే. ఇక నేడు కూడా అదే పంథా కొనసాగింది. శనివారం దేశీయ బులియన్‌ మార్కెట్‌లో బంగారం ధర భారీగా దిగి వచ్చింది. గోల్డ్‌ కొనాలనుకువాళ్లు.. ఇప్పుడే త్వరపడితే మంచిది.. మళ్లీ భవిష్యత్తులో బంగారం ధర పెరిగే అవకాశం ఉంది అంటున్నారు బులియన్‌ మార్కెట్‌ విశ్లేషకులు. మరి నేడు దేశీయ బులియన్‌ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఓ సారి చూద్దాం.

శనివారం హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్‌లో 22 క్యారెట్‌ బంగారం పది గ్రాముల మీద 200 రూపాయలు దిగి వచ్చింది. ఇక నేడు భాగ్యనగరంలో 22 క్యారెట్‌ గోల్డ్‌ 10 గ్రాముల ధర రూ. 54,850 వద్ద ట్రేడవుతోంది. అలానే 24 క్యారెట్‌ గోల్డ్‌ ధర కూడా తగ్గింది. మేలిమి బంగారం 10 గ్రాముల మీద రూ. 210 తగ్గి.. 59,840 రూపాయల వద్ద అమ్ముడవుతోంది. ఇక దేశ రాజధాని న్యూఢిల్లీలో సైతం బంగారం దిగి వచ్చింది. హస్తినలో 22 క్యారెట్‌ బంగారం ధర 10 గ్రాముల మీద 200 తగ్గి.. రూ. 55 వేల వద్ద ట్రేడవుతోంది. అలానే 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల మీద 210 రూపాయలు తగ్గి.. 59,940 వద్ద కొనసాగుతోంది. ఈ రెండో రోజుల్లో బంగారం ధర 10 గ్రాముల మీద 380 రూపాయల మేర దిగి వచ్చింది.

భారీగా పెరిగిన వెండి ధర..

నేడు బంగారం ధరలు తగ్గముఖం పడితే.. వెండి ధరలో మాత్రం భారీగా పెరిగింది. నేడు వెండి ధర కిలో మీద ఒకేసారి రూ. 1000 పెరిగి భారీగా షాకిచ్చింది. ఇక నేడు ఢిల్లీలో వెండి ధర కిలో మీద వెయ్యి రూపాయలు పెరిగి.. రూ. 75,500 చేరుకుంది. అలానే నేడు హైదరాబాద్‌లో కిలో వెండి రూ.1000 పెరిగి.. 79 వేల రూపాయల వద్ద ట్రేడవుతోంది.