iDreamPost
android-app
ios-app

పసిడి ప్రియలుకు శుభవార్త.. మళ్లీ పడిపోయిన బంగారం ధర

  • Published Aug 01, 2023 | 9:05 AMUpdated Aug 01, 2023 | 9:05 AM
  • Published Aug 01, 2023 | 9:05 AMUpdated Aug 01, 2023 | 9:05 AM
పసిడి ప్రియలుకు శుభవార్త.. మళ్లీ పడిపోయిన బంగారం ధర

పసిడి ప్రియులకు పండగలాంటి వార్త ఇది. బంగారం కొనాలని భావించి వెనకడుగు వేస్తోన్న వారు.. ఇప్పుడు గోల్డ్‌ కొనుగోలు చేయడం బెటర్‌ అంటున్నారు బులియన్‌ మార్కెట్‌ విశ్లేషకులు. గత కొన్ని రోజులుగా పైపైకి ఎగబాకుతోన్న పసిడి ధర.. రెండు రోజులుగా దిగి వస్తోంది. దాంతో బంగారం కొనాలనుకునేవారు.. ఇప్పుడే త్వరపడితే మంచిది అంటున్నారు. త్వరలోనే శ్రావణ మాసం ప్రారంభం అవుతంది.. శుభకార్యాలు మొదలవుతాయి. దాంతో బంగారానికి గిరాకి పెరిగి.. ధర పెరిగే ఛాన్స్‌ ఉందని అంటున్నారు బులియన్‌ మార్కెట్‌ విశ్లేషకులు. నేడు అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగినప్పటికీ దేశీయ మార్కెట్లో మాత్రం ధరలు దిగిరావడం గమనార్హం. మరి నేడు మన దేశ రాజధాని ఢిల్లీ, మన భాగ్యనగరంలో ఇవాళ గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం.

నేడ హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్‌లో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. నేడు భాగ్యనగరంలో 22 క్యారెట్‌ 10 గ్రాముల బంగారం ధర రూ. 100 దిగివచ్చింది. దాంతో ప్రస్తుతం నేడు హైదరాబాద్‌ మార్కెట్‌లో 22 క్యారెట్‌ బంగారం పది గ్రాముల ధర రూ. 55,250 వద్ద కొనసాగుతోంది. అలానే 24 క్యారెట్‌ గోల్డ్‌ 10 గ్రాముల ధర రూ.100 పడిపోయి రూ. 60,280 వద్ద ట్రేడ్‌ అవుతోంది. అలానే దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో కూడా నేడు బంగారం ధర దిగి వచ్చింది. నేడు హస్తినలో 22 క్యారెట్‌ గోల్డ్ రేటు 10 గ్రాముల ధర రూ. 100 తగ్గి ప్రస్తుతం రూ. 55, 400 మార్క్ వద్ద ట్రేడవుతోంది. అలానే 24 క్యారెట్‌ స్వచ్ఛమైన గోల్డ్ ధర రూ. 100 తగ్గి రూ. 60,430 వద్ద కొనసాగుతోంది.

స్థిరంగా వెండి ధర..

గత రెండ్రోజులుగా దేశీయ బులియన్‌ మార్కెట్‌లో వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. నేడు కూడా సిల్వర్‌ రేటు స్థిరంగా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ కిలో వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం హస్తినలో కిలో వెండి ధర రూ. 77 వేల మార్క్ వద్ద ఉంది. అలానే మన భాగ్యనగరంలో కిలో వెండి ధర రూ. 80 వేల మార్క్ వద్ద ట్రేడవుతోంది. దేశీయ బులియన్‌ మార్కెట్‌లో న ఏడు వెండి, సిల్వర్‌ రేట్లు దిగి రాగా.. ఇంటర్నేషనల్ బులియన్ మార్కెట్లో మాత్రుం గత రెండు సెషన్ల నుంచి బంగారం ధర వరుసగా పెరుగుతూనే ఉంది. క్రితం రోజుతో పోలిస్తే నేడు అంతర్జాతీయ మార్కెట్‌లో గోల్డ్‌ ధర దాదాపు 10 డాలర్లకుపైనే పెరిగింది. ఈరోజు స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు ఇవాళ 1964 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 24.72 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి