P Krishna
Today Gold and Silver Prices: గత నెల శ్రావణ మాసం మొదలైనప్పటి నుంచి దేశంలో పండుగలు, శుభకార్యాల సందడి మొదలైంది. ఈ క్రమంలోనే బంగారం, వెండి కొనుగోలు కూడా బాగా పెరిగిపోయింది.
Today Gold and Silver Prices: గత నెల శ్రావణ మాసం మొదలైనప్పటి నుంచి దేశంలో పండుగలు, శుభకార్యాల సందడి మొదలైంది. ఈ క్రమంలోనే బంగారం, వెండి కొనుగోలు కూడా బాగా పెరిగిపోయింది.
P Krishna
ప్రపంచంలో పసిడి అంటే ఇష్టపడని వారు ఉండరు.ఏ లోహానికి లేని డిమాండ్ దీనికి ఉంది. బంగారం కేవలం ఆభరణాలుగానే కాదు ఈ మధ్య మంచి ఇన్వెస్ట్ మెంట్ గా చూస్తున్నారు. ఏ ఆపద సమయంలో అయినా పసిడి పెట్టుబడిగా పనికి వస్తుందని మధ్యతరగతి కుటుంబీకులు భావిస్తున్నారు. ఇటీవల పసిడి ధరలు తరుచూ పెరుగుతూ.. తగ్గుతూ వస్తున్నాయి. ప్రస్తుతం మేలిమి బంగారం తులం రూ.73 వేలు దాటిపోయింది. అంతర్జాతీయ మార్కెట్ లో జరుగుతున్న పరిణామాలు, యుద్దాలు పసిడి, వెండి ధరలపై ప్రభావం చూపుతున్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. నేడు మార్కెట్ లో పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
ఈ ఏడాది మూఢాలు ఉండటంతో దాదాపు మూడు నెలల పాటు ఎలాంటి శుభకార్యాలు జరగలేదు. ఇక శ్రావణ మాసం ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచి పండుగలు, పెళ్లిళ్లు, శుభకార్యాల సీజన్ మొదలైంది. ఇక మగువలు పసిడి కొనుగోలు చేయడానికి జ్యులరీ షాపులకు క్యు కడుతున్నారు. గత పదిరోజులుగా పసిడి ధరలు నేల చూపు చూస్తున్నాయి. వరుసగా తగ్గుతూ వస్తున్నాయి. మహిళలకు మరో గుడ్ న్యూస్.. 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం పై రూ.10 తగ్గి,66,790 కి చేరింది, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం పై రూ.10 తగ్గి,72,860కి చేరింది. ఏపీ, తెలంగాణలో బంగారం ధరలు 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.66,790 ఉండగా, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.72,860 వద్ద కొనసాగుతుంది.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.66,940 ఉండగా, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.73,010 వద్ద కొనసాగుతుంది. చెన్నైలో 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.66,790 ఉండగా, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.72,860 వద్ద కొనసాగుతుంది. ముంబై, కోల్‌కొతా, బెంగుళూరు, కేరళా, పూణేలో 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.66,790ఉండగా, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.72,860వద్ద కొనసాగుతుంది. ఇక వెండి విషయానికి వస్తే.. ప్రస్తుతం కిలో వెండిపై రూ.100 తగ్గింది.చెన్నై, కేరళా, తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి రూ.89,400 ఉండగా, ఢిల్లీ, ముంబై, కోల్‌కొతాలో కిలో వెండి రూ.84,400, బెంగుళూరులో రూ.83,900 వద్ద కొనసాగుతుంది.