iDreamPost
android-app
ios-app

బంగారం కొనాలనుకునే వారికి గుడ్‌న్యూస్‌.. ఏకంగా అంత తగ్గింది!

బంగారం కొనాలనుకునే వారికి గుడ్‌న్యూస్‌.. ఏకంగా అంత తగ్గింది!

గత ఐదేళ్లుగా బంగారం ధర దేశీయ మార్కెట్‌లో పరుగులు పెడుతోంది. 2019-2020 మధ్య కాలంలో 30 వేలలో ఉన్న బంగారం ధర ఇప్పుడు 60 వేలు అయి కూర్చుంది. బంగారం ధరల్లో రోజూవారీగా హెచ్చు తగ్గులు ఉంటున్నా.. ధరలు మాత్రం పూర్తిగా కిందకు దిగిరావటం లేదు. గత కొద్దిరోజుల నుంచి పెరుగుతూ వస్తున్న బంగారం ధర గత మూడు సెషన్లలో తగ్గుతూ వస్తోంది. హైదరాబాద్‌ మార్కెట్‌లో బంగారం ధర భారీగా తగ్గింది. హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్‌లో బంగారం ధర 10 గ్రాములకు ఏకంగా 490 రూపాయలు పడిపోయింది.

ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు గానూ 54,950 రూపాయలుగా ఉంది. ఇక, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు గానూ 59,950 రూపాయలుగా ఉంది. ఇక, ఢిల్లీలోనూ బంగారం ధర తగ్గింది. గత రెండు సెషన్లలో దాదాపు 470 రూపాయల మేర పడిపోయింది. ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్‌ రేటు 10 గ్రాములకు గానూ 55 వేల రూపాయలుగా ఉంది. ఇక, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు గానూ 60,100 రూపాయలుగా ఉంది. కాగా, వెండి ధరల్లో కూడా భారీగా పతనం నమోదైంది.

దేశ రాజధాని ఢిల్లీలో వెండి ధర గత మూడు సెషన్‌లలో 3200 రూపాయలు తగ్గింది. ఈ రోజు కూడా 200 రూపాయలు తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి 74,800 రూపాయలు పలుకుతోంది. అయితే, దేశీయంగా భారీగా తగ్గిన బంగారం,వెండి ధరలు అంతర్జాతీయ మార్కెట్‌లో మాత్రం పెరిగాయి. స్పాట్ గోల్డ్ రేటు ఒక ఔన్సుకు కొద్దిరోజుల క్రితం 1936 ఉండగా .. ఇప్పుడది 1943 అయింది. సిల్వర్‌ ధర కూడా ఓన్సు 23.60 డాలర్లుగా ఉంది. మరి, దేశీయ మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా తగ్గటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.