మహిళలకు బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన పసిడి ధరలు.. ఈ రోజు ఎంతంటే?

Gold and Silver Rates: ఇటీవల పసిడి, వెండి ధరలకు ఎప్పుడు తగ్గుతున్నాయో.. ఎప్పుడు పెరుగుతున్నాయో ఎవరికీ అర్థం కాని పరిస్థితి నెలకొంది. అంతర్జాతీయ మార్కెట్ లో జరుగుతున్న కీలక పరిణామాలు పసిడి, వెండి ధరల్లో మార్పులు సంభవిస్తున్నాయి.

Gold and Silver Rates: ఇటీవల పసిడి, వెండి ధరలకు ఎప్పుడు తగ్గుతున్నాయో.. ఎప్పుడు పెరుగుతున్నాయో ఎవరికీ అర్థం కాని పరిస్థితి నెలకొంది. అంతర్జాతీయ మార్కెట్ లో జరుగుతున్న కీలక పరిణామాలు పసిడి, వెండి ధరల్లో మార్పులు సంభవిస్తున్నాయి.

దేశంలో బంగారం, వెండి ధరలు తరుచూ మరుతూ వస్తున్నాయి. ప్రపంచంలో అత్యంత విలువైనది బంగారం.. అందుకే దీన్ని ప్రతి ఒక్కరూ ఎంతగానో ఇష్టపడుతుంటారు. భారత దేశంలో పసిడి అంటే మగువలకు ఎంతో ఇష్టం. పండగలు, వివాహాది శుభకార్యాలకు ఖచ్చితంగా బంగారం కొనుగోలు చేస్తుంటారు. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది పసిడి ధర దాదాపు 5 వేల వరకు పెరిగింది. భవిష్యత్ లో బంగారం తులం లక్ష రూపాలు దాటే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. తక్కువ ధర ఉన్నపుడు పసిడి, వెండి కొనుగోలు చేయడం మంచిదని సూచిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన పసిడి మళ్లీ షాక్ ఇస్తుంది. ఈ రోజు మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మగువలకు షాకింగ్ న్యూస్.. నిన్న మొన్నటి వరకు వరుసగా తగ్గుతూ వచ్చిన పసిడి మళ్లీ పెరిగింది. ఇటీవల బంగారం కొనుగోలు ఎక్కువ కావడంతో డిమాండ్ కూడా భారీగానే పెరిగిపోయింది. దానికి తోడు అంతర్జాతీయ మార్కెట్ లో జరుగుతున్న కీలక పరిణామాలు పసిడి, వెండి ధరల్లో మార్పులు సంభవిస్తున్నాయి.ప్రస్తుతం మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై రూ.10 పెరిగి, రూ.66,360 కి చేరింది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై రూ.10 పెరిగి, రూ.72,390 కి చేరింది.తెలుగు రాష్ట్రాలు హైదరాబాద్, వరంగల్, విశాఖ, విజయవాడలో 22 క్యారెట్స్ 10 గ్రాముల ధర రూ.66,360 వద్ద కొనసాగుతుంది.24 క్యారెట్స్ 10 గ్రాముల ధర రూ. 72,390 వద్ద ట్రెండ్ అవుతుంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఢిల్లీలో 22 క్యారెట్స్ 10 గ్రాముల ధర రూ.66,510 కాగా.. 24 క్యారెట్స్ 10 గ్రాముల ధర రూ. 72,540 వద్ద కొనసాగుతుంది. ముంబై, కోల్‌కొతా, కేరళా, బెంగుళూరు‌లో 22 క్యారెట్స్ 10 గ్రాముల ధర రూ.66,360 కాగా, 24 క్యారెట్స్ 10 గ్రాముల ధర రూ.72,390 వద్ద కొనసాగుతుంది. చెన్నైలో 22 క్యారెట్స్ 10 గ్రాముల ధర రూ.66,910 కాగా, 24 క్యారెట్స్ 10 గ్రాముల ధర రూ.72,990 వద్ద ట్రెండ్ అవుతుంది. కిలో వెండి పై రూ.100 పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర రూ.95,600 వద్ద కొనసాగుతుంది. ఢిల్లీ, కోల్‎కత్తాలో కిలో వెండి రూ.91100 ఉండగా, బెంగుళూరులో కిలో వెండి ధర రూ.89950, చెన్నైలొ కిలో వెండి ధర రూ.95,600 వద్ద ట్రెండ్ అవుతుంది.

Show comments