P Krishna
Gold and Silver Rates: ఇటీవల పసిడి, వెండి ధరలు భారీగా పెరిగిపోతూ వచ్చాయి.. గత పది రోజులుగా పసిడి ధరలు తగ్గుతూ.. స్థిరంగా కొనసాగుతూ వస్తున్నాయి. వెండి ధరల్లో మాత్రం స్వల్పంగా మార్పులు జరుగుతున్నాయి.
Gold and Silver Rates: ఇటీవల పసిడి, వెండి ధరలు భారీగా పెరిగిపోతూ వచ్చాయి.. గత పది రోజులుగా పసిడి ధరలు తగ్గుతూ.. స్థిరంగా కొనసాగుతూ వస్తున్నాయి. వెండి ధరల్లో మాత్రం స్వల్పంగా మార్పులు జరుగుతున్నాయి.
P Krishna
ప్రపంచలో బంగారం అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. అందుకే బంగారం విలువ రోజు రోజుకీ పెరిగిపోతూ వస్తుంది. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది దాదాపు రూ.5 వేల వరకు పెరిగిపోయింది. ఇటీవల బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో జరుగుతున్న కీలక పరిణామాలు, పలు దేశాల్లో జరుగుతున్న యుద్ద కారణాలు పసిడి, వెండి ధరలపై ప్రభావం చూపుతున్నాయని ఆర్థిక నిపుణులు అంటున్నారు. గత కొన్నిరోజులుగా పసిడి ధరలు వరుసగా తగ్గుతూ వస్తున్న విషయం తెలిసిందే. కాకపోతే వెండి ధరలు మాత్రం పెరిపోతున్నాయి. నిన్న కిలో వెండిపై రూ.200 మేర పెరిగింది. ఈ రోజు దేశంలో పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
భారత దేశంలో పెళ్లిళ్లు, శుభకార్యాలు అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది బంగారం. మన సంస్కృతి, సంప్రదాయాలతో బంగారం, వెండి ముడిపడిపోయాయి. ఇటీవల బంగారం ఆభరణాలుగా మాత్రమే కాదు.. పెట్టుబడి వినియోగిస్తున్నారు. మధ్య తరగతి కుటుంబీకులు తమ వద్ద పొదుపు చేసిన డబ్బుతో ఎక్కువగా బంగారం కొనుగోలు చేస్తున్నారు. దీంతో పసిడితో పాటు వెండికి కూడా గిరాకీ బాగానే పెరిగిపోయింది. నిన్నటితో పోల్చుకుంటే నేడు పసిడి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలు హైదరాబాద, వరంగల్, విశాఖ, విజయవాడ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,250 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,280 వద్ద కొనసాగుతుంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఢిల్లీలో 22 క్యారెట్స్ 10 గ్రాముల ధర రూ.66,390 కాగా.. 24 క్యారెట్స్ 10 గ్రాముల ధర రూ.72,410 వద్ద కొనసాగుతుంది. ముంబై, కోల్‌కొతా, కేరళా, బెంగుళూరులో 22 క్యారెట్స్ 10 గ్రాముల ధర రూ.66,240 కాగా.. 24 క్యారెట్స్ 10 గ్రాముల ధర రూ.72,270 వద్ద కొనసాగుతుంది. . చెన్నైలో 22 క్యారెట్స్ 10 గ్రాముల ధర రూ.66,840 కాగా.. 24 క్యారెట్స్ 10 గ్రాముల ధర రూ.72,920 వద్ద కొనసాగుతుంది. కిలో వెండి పై రూ.100 పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర రూ.94,800 వద్ద కొనసాగుతుంది. ఢిల్లీ, కోల్‌కత్తాలో కిలో వెండి రూ.90,300 ఉండగా, బెంగుళూరులో కిలో వెండి ధర రూ. 90,500 చెన్నైలొ కిలో వెండి ధర రూ. 94,500 వద్ద ట్రెండ్ అవుతుంది.