P Krishna
Gold and Silver Rates: పసిడి, వెండి ధరలు ఇటీవల ఎప్పుడు తగ్గుతున్నాయో.. ఎప్పుడు పెరుగుతున్నాయో తెలియని అయోమయ పరిస్థితి.అంతర్జాతీయ మార్కెట్ లో జరిగే కీలక పరిణామాలు వీటిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.
Gold and Silver Rates: పసిడి, వెండి ధరలు ఇటీవల ఎప్పుడు తగ్గుతున్నాయో.. ఎప్పుడు పెరుగుతున్నాయో తెలియని అయోమయ పరిస్థితి.అంతర్జాతీయ మార్కెట్ లో జరిగే కీలక పరిణామాలు వీటిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.
P Krishna
గత కొంత కాలంగా దేశంలో పసిడి, వెండి ధరలు తరుచూ మారుతున్నాయి. బంగారం అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. ఒకప్పుడు బంగారం అభరణాలు మాత్రంగానే వాడేవారు.. కానీ ఇప్పుడు దాన్ని ఇప్పుడు ఇన్వెస్ట్ మెంట్ వాడుతున్నారు. ఆపద సమయంలో బంగారం ఏ అవసరానికైనా వాడవొచ్చు అన్న ధీమాతో ఉన్నారు మధ్యతరగతి కుటుంబీకులు. దీంతో ఇటీవల పసిడి ధరలు అమాంతం పెరిగిపోతూ వస్తున్నాయి. దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్ లో జరుగుతున్న కీలక పరిణామాలు పసిడి, వెండి ధరల్లో మార్పులు సంభవిస్తున్నాయి. ఈరోజు మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
గత ఏడాదితో పోలిస్తే పసిడి ధర దాదాపు 5 వేలకు పైగా పెరిగిపోయింది. రాబోయే రోజుల్లో పసిడి తులం ఒక లక్ష దాటే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. గత వారంతో పోలిస్తే పసిడి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. మహిళలకు గొప్ప శుభవార్త.. ఈ రోజు (జులై 1) పసిడి ధర స్వల్పంగా తగ్గింది. 22 క్యారెట్లు 10 గ్రాముల పసిడి ధరపై రూ.10 తగ్గి, రూ. 66,240 గా పలుకుతుంది. 24 క్యారెట్లు 10 గ్రాముల పసిడి ధరపై రూ.10 తగ్గి, రూ.72, 270 వద్ద కొనసాగుతుంది. అలాగే కేజీ వెండి ధర రూ.100 తగ్గి రూ.89,900 వద్ద ట్రెండ్ అవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో 22 క్యారెట్స్ 10 గ్రాముల ధర రూ.10 పెరిగింది. రూ.66,240 వద్ద కొనసాగుతుంది. 24 క్యారెట్స్ 10 గ్రాముల ధర రూ.10 పెరిగింది. రూ.72,270 వద్ద ట్రెండ్ అవుతుంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఢిల్లీలో 22 క్యారెట్స్ 10 గ్రాముల ధర రూ.66,390వద్ద కొనసాగుతుంది. 24 క్యారెట్స్ 10 గ్రాముల ధర రూ.72,410 లకు చేరింది. ముంబై, కోల్‌కొతా, కేరళా, బెంగుళూరులో 22 క్యారెట్స్ 10 గ్రాముల ధర రూ.66,810 లకు చేరింది. 24 క్యారెట్స్ 10 గ్రాముల ధర రూ.72,270లకు చేరింది. చెన్నైలో 22 క్యారెట్స్ 10 గ్రాముల ధర రూ.66,840లకు చేరింది. 24 క్యారెట్స్ 10 గ్రాముల ధర రూ.72,920 వద్ద కొనసాగుతుంది. కిలో వెండి పై రూ.100 పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర రూ. 94,400 వద్ద కొనసాగుతుంది. ఢిల్లీ, కోల్‌కత్తాలో కిలో వెండి రూ. 89,900 ఉండగా, చెన్నైలొ కిలో వెండి ధర రూ. 94,400 వద్ద ట్రెండ్ అవుతుంది.