P Krishna
Gold and Silver Rates: దేశంలో బంగారం రోజు రోజుకీ పెరిగిపోతూనే ఉంది. అంతర్జాతీయ మార్కెట్ లో జరిగే కీలక పరిణామాల ప్రభావం పసిడి, వెండి పై పడటంతో తరుచూ మార్పులు జరుగుతున్నాయి.
Gold and Silver Rates: దేశంలో బంగారం రోజు రోజుకీ పెరిగిపోతూనే ఉంది. అంతర్జాతీయ మార్కెట్ లో జరిగే కీలక పరిణామాల ప్రభావం పసిడి, వెండి పై పడటంతో తరుచూ మార్పులు జరుగుతున్నాయి.
P Krishna
ఇటీవల బంగారం కొనుగోలు భారీగా పెరిగిపోయింది. జనవరి, ఫిబ్రవరిలో భారీగా తగ్గినప్పటికీ ఏప్రిల్ నుంచి మళ్లీ చుక్కలు చూపిస్తుంది. గత పది రోజుల క్రితం నుంచి కాస్త తగ్గుముఖం పట్టినా.. మళ్లీ పెరిగి షాక్ ఇస్తుంది. అంతర్జాతీయ మార్కెట్ లో జరుగుతున్న కీలక పరిణామాలు, పలు దేశాల్లో యుద్దాలు బంగారం, వెండిపై ప్రభావం చూపిస్తున్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా పెళ్లిళ్లు ఇతర శుభకార్యాలకు పసిడి కొనుగోలు ఎక్కువగా ఉంటుంది.. కానీ ఈ మధ్య శుభకార్యాలు ఏవీ లేవు అయినప్పటికీ పసిడికి విపరీతమైన డిమాండ్ ఉంటుంది. దానికి తగ్గట్టుగానే ధరలు కొనసాగుతున్నాయి. బంగారం కొనుగోలుదారులకు అదిరిపోయే శుభవార్త. నిన్న తగ్గిన పసిడి ఈ రోజు కూడా కాస్త తగ్గింది. ఈ రోజు మార్కెట్ లో ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
ప్రపంచంలో అత్యంత విలువైన వస్తువు బంగారం. అందుకే పసిడి అంటే ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా భారతీయ మహిళలు పండుగలు, వివాహాది శుభకార్యాలకు బంగారం కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ప్రస్తుతం శుభకార్యాలు లేనప్పటికీ పసిడికి డిమాండ్ కొనసాగుతుంది. ఇటీవల బంగారం ఆభరణాలు గా మాత్రమే కాదు.. మంచి ఇన్వెస్ట్ మెంట్ గా భావిస్తున్నారు. ముఖ్యంగా మిడిల్ క్లాస్ వాళ్లు ఇప్పుడు బంగారంపై పెట్టుబడి పెట్టడానికి తెగ ఆసక్తి చూపిస్తున్నారు. భవిష్యత్ లో పెట్టుబడికి ఎక్కువ లాభవం వస్తుందని భావిస్తున్నారు. 24 క్యారెట్ 10 గ్రాముల పసిడి ధరపై రూ.10 తగ్గింది. ప్రస్తుతం రూ.74,500 గా నమోదు అవుతుంది.. 22 క్యారెట్ 10 గ్రాముల పసిడి ధరపై రూ.10 తగ్గింది. ప్రస్తుతం రూ.68,290 గా నమోదు అవుతుంది. అలాగే కిలో వెండి పై 100 పెరిగి, రూ.95,900 వద్ద ట్రెండ్ అవుతుంది. తెలుగు రాష్ట్రాలు హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖ పట్నంలో 22 క్యారెట్ 10 గ్రాముల పసిడి ధర రూ.68,290 ఉండగా.. 24 క్యారెట్ 10 గ్రాముల పసిడి ధర రూ.74,500 వద్ద కొనసాగుతుంది.
దేశంలోని ప్రధాన నగరాలు ఢిల్లీ 22 క్యారెట్ 10 గ్రాముల పసిడి ధర రూ.68,440 ఉండగా.. 24 క్యారెట్ 10 గ్రాముల పసిడి ధర రూ.74,650 వద్ద కొనసాగుతుంది. ముంబై, బెంగుళూరు,కోల్‌కొతా, కేరళాలో 22 క్యారెట్ 10 గ్రాముల పసిడి ధర రూ.68,290 ఉండగా.. 24 క్యారెట్ 10 గ్రాముల పసిడి ధర రూ.74,500 వద్ద కొనసాగుతుంది. చెన్నైలో 22 క్యారెట్ 10 గ్రాముల పసిడి ధర రూ.68,590 ఉండగా.. 24 క్యారెట్ 10 గ్రాముల పసిడి ధర రూ.74,830 వద్ద కొనసాగుతుంది. ఇక వెండి విషాయినికి వస్తే.. ఢిల్లీ,కోల్‌కతా, పూణే, ముంబాయిలో కిలో వెండి ధర రూ.95,900 వద్ద కొనసాగుతుంది. పసిడి కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదే మంచి సమయం అని అంటున్నారు నిపుణులు.