P Krishna
Gold and Silver Rates: ఈ మధ్య బంగారం కొనుగోలు చేసేవారి సంఖ్య భారీగా పెరిగిపోతుంది. బంగారం పై ఇన్వెస్ట్ మెంట్ చేస్తే మంచి లాభాలు ఉంటాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
Gold and Silver Rates: ఈ మధ్య బంగారం కొనుగోలు చేసేవారి సంఖ్య భారీగా పెరిగిపోతుంది. బంగారం పై ఇన్వెస్ట్ మెంట్ చేస్తే మంచి లాభాలు ఉంటాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
P Krishna
దేశంలో రోజు రోజుకీ బంగారం కొనుగోలు ఎక్కువ అవుతుంది. బంగారం మన వద్ద ఉంటే భవిష్యత్ మంచి భరోసా ఉన్నట్టే అంటున్నారు. బంగారం పై పెట్టుబడి పెడితే ద్రవ్యోల్భణ ఉపద్రవం నుంచి కాపాడుతుందని నిపుణులు అంటున్నారు. బంగారం అంటే కేవలం ఆభరణాలు గా మాత్రమే కాదు.. కష్టకాలంలో మనల్ని ఆదుకునే వస్తువుగా ఉపయోగపడుతుంది.ఇతర రంగాలతో పోల్చుకుంటే బంగారం పై పెట్టుబడి పెట్టడానికి కొనుగోలుదారులు ఎక్కువగా ఉత్సాహం చూపిస్తున్నారు. అక్షయ తృతీయ సందర్బంగా పసిడి కొనుగోలుదారులకు ఊరటనిచ్చింది. అది రెండు రోజుల మురిపంగానే.. నేడు మళ్లీ బంగారం ధర పెరిగిపోయింది. ఈ రోజుల మార్కెట్ లో పసిడి, వెండి ధరల ఎలా ఉన్నాయో చూద్దాం.
ఇటీవల బంగారం, వెండి ధరలు చుక్కలు చూపించాయి. అక్షయ తృతీయ సందర్భంగా వారం రోజులుగా పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. శుక్రవారం సాయంత్రం నాటికి ధరలు మళ్లీ పుంజుకున్నాయి. పసిడి పై ఏకంగా రూ.1400 రూపాయల వరకు పెరిగిపోయింది. అంతర్జాతీయ మార్కెట్ లో జరుగుతున్న కీలక పరిణామాలు పసిడి, వెండి ధరలపై ప్రభావం చూపిస్తున్నాయని ఆర్థిక నిపుణులు అంటున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.73,850 కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.67,560 వద్ద కొనసాగుతుంది. మరోవైపు కిలో వెండి పై రూ.100 పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.67,560 వద్ద ఉండగా, ఇక 24 క్యారెట్ల బంగారం ధర రూ.73,700కు చేరుకుంది.
దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.73,850 వద్ద ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 67,710 వద్ద కొనసాగుతుంది. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.73,860 వద్ద ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.67,710 వద్ద కొనసాగుతుంది. ముంబై, కోల్ కొతా, బెంగుళూరు లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.73,700 వద్ద ఉండగా. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.67,560 వద్ద కొనసాగుతుంది. ఢిల్లీ, బెంగుళూరులో కిలో వెండి ధర రూ.87,800 వద్ద ఉండగా, చెన్నైలో కిలో వెండి ధర రూ.91,300 వద్ద ట్రెండ్ అవుతుంది.తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర రూ. 91,300 వద్ద ట్రెండ్ అవుతుంది.